sumati-satakam( image :x)
ఎంటర్‌టైన్మెంట్

Sumathi Satakam: ‘సుమతీ శతకం’ నుంచి విడుదలైన అమర్ దీప్ ఫస్ట్ లుక్

Sumathi Satakam: ‘సుమతీ శతకం’ నుంచి విడుదలైన అమర్ దీప్ ఫస్ట్ లుక్ అమర్ దీప్ ప్రధాన పాత్రలో నటించిన ‘సుమతీ శతకం’(Sumathi Satakam) సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు నిర్మాతలు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై అమర్ దీప్, సైలీ హీరో హీరోయిన్లుగా కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎం.ఎం. నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ నుంచి హీరోయిన్ సైలీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ పోస్టర్ అంచనాలకు మించి ప్రేక్షకాదరణ పొందింది. తాజాగా ఈ సినిమా నుంచి అమర్ దీప్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు నిర్మాతలు.

Read also- War 2 Collections: కాలర్ సెంటిమెంట్ తో ఎన్టీఆర్ కి పెద్ద దెబ్బె తగిలిందిగా..? వార్ 2 తుస్సు.. కూలీకి ప్లస్సు..!

హీరో పాత్రని పరిచయం చేస్తూ ఈ పోస్టర్ ఉంది. అమర్ దీప్ ఇందులో ఓ మిడిల్ క్లాస్ కుర్రాడిలా కనిపించబోతున్నారు. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చూస్తుంటే కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని అర్థం అవుతోంంది. అమర్ దీప్ మెడలో కూరగాయలతో అల్లిన దండలు, ఆ బ్యాక్ గ్రౌండ్ వాతావరణం, ఆయన క్యాస్టూమ్స్ ఇలా అన్నీ కూడా ఇదొక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌ అని చెప్పకనే చెప్పేస్తున్నాయి. మిడిల్ క్లాస్ కథలు అందరికీ కనెక్ట్ అయ్యే కథలు. అలాంటి కథతో వస్తున్నాడు అమర్ దీప్. అంటే ఈ సినిమా సామాన్య ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని తెలుస్తోంది. వీటన్నింటినీ చూస్తుంటే ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకున్నాయి.

Read also- Coolie collection: ఆ రికార్డు బ్రేక్ చేసిన ‘కూలీ’.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. త్వరలోనే టీజర్, ట్రైలర్‌ను కూడా ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతోన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటించాలని మేకర్లు భావిస్తున్నారు. దసరాకి విడుదల చేయాలనే లక్ష్యంతో సినిమా యూనిట్ అహర్నిశలు కష్టపడుతోంది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా సుభాష్ ఆనంద్ , డైలాగ్స్ రైటర్‌గా బండారు నాయుడు, ఎడిటర్‌గా నాహిద్ మొహమ్మద్, ఆర్ట్ డైరెక్టర్ గా విశ్వ ప్రసాద్, కెమెరామెన్‌‌గా హాలేష్ పని చేస్తున్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!