Farah Khan – Shruti Haasan: ఫిల్మ్ మేకర్, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ తన అసిస్టెంట్ దిలీప్‌తో కలిసి ముంబైలోని నటి శృతి హాసన్ ఇంటికి వెళ్ళారు. శృతి హాసన్ హోమ్ టూర్‌లా సాగిన ఈ వీడియోలో వారి మధ్య చాలా ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. ఫరా ఖాన్ తన చిత్రం ‘మై హూ నా’లో సునీల్ శెట్టి పోషించిన ‘రాఘవన్ దత్తా’ పాత్ర కోసం మొదట శృతి హాసన్ తండ్రి, దిగ్గజ నటుడు కమల్ హాసన్‌ని సంప్రదించినట్లుగా గుర్తు చేస్తున్నారు. అలాగే శృతి హాసన్ ఇంట్లో ఉన్న బ్లాక్ నైఫ్ గురించి ఫరా ఖాన్ అడిగి తెలుసుకున్నారు. ఇంకా వారి సంభాషణలో శృతి నుంచి రాబోయే చిత్రం ‘కూలి’ ప్రస్తావన కూడా వచ్చింది. అసలు శృతి హాసన్ వంట చేయడం నేర్చుకోవడానికి గల కారణాలను కూడా ఇందులో తెలిపారు. ఆ వివరాల్లోకి వెళితే..
ముందుగా శృతి హాసన్ ఇంటికి వచ్చిన ఫరా ఖాన్, దిలీప్.. మ్యూజిక్ ట్రీట్ ఇచ్చారు. శృతి హాసన్‌ను దిలీప్‌కి పరిచయం చేసిన ఫరా ఖాన్.. ఆమె తండ్రి కమల్ హాసన్ దేశంలోనే పెద్ద స్టార్ అని, శృతి కూడా చెన్నైలో చాలా పెద్ద స్టార్ నటి అని చెప్పారు. నా అంత పెద్ద స్టారా? అని దిలీప్ ప్రశ్నిస్తే.. ‘నీ అంత పెద్ద స్టార్ ఎవరూ ఉండలేరు.. ఏదో ఒక రోజు షారుఖ్ కూడా నీ అంత స్టార్ అవుతాడు’ అంటూ ఫరా ఖాన్ ఆటపట్టించారు. శృతి కూడా నువ్వే ‘అసలు స్టార్’ అంటూ సంబోధించింది. శృతి వారిద్దరిని ఇంట్లోకి ఆహ్వానించిన తర్వాత.. తన ఇంటి థీమ్ గురించి చెప్పుకొచ్చింది. ‘నా ఇంటి థీమ్‌ని ప్రజలు అర్థం చేసుకోలేక పోతున్నారు. ఇంత డబ్బు సంపాదిస్తూ.. ఇంటికి పెయింట్ కూడా వేసుకోలేకపోతున్నావా?’’ అని అంటుంటారు అని చెప్పగా.. నాకు మాత్రం ఈ ఇండస్ట్రియల్ లుక్ చాలా నచ్చింది అని ఫరా ఖాన్ అన్నారు. ఆ తర్వాత మటన్ గ్రేవీతో ఉన్న టిఫిన్‌ను వారు శృతికి అందించారు.
Also Read- Rana Daggubati: మూడు గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు.. రానా నుంచి ఏం తీసుకున్నారంటే?
ఫరా ఖాన్ మాట్లాడుతూ.. 2004లో నేను చేసిన ‘మై హూ నా’లోని ఓ పాత్ర కోసం కమల్ హాసన్‌ని అనుకున్నానని, ఆయనే నా మొదటి ఎంపిక అని చెప్పారు. సునీల్ శెట్టి చేసిన పాత్రని మొదట కమల్ హాసన్‌ని చెన్నైలో కలిసి వినిపించానని, అది విన్న తర్వాత ఆయన మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపో అన్నారని గుర్తు చేసుకున్నారు. ఇక ఇంటిని పర్యవేక్షిస్తుండగా.. షోకేస్‌లో బ్లాక్ నైఫ్ కనిపించింది. ఈ కత్తి గురించి చెప్పమని ఫరా ఖాన్ అడుగగా.. ‘ఇది నాన్న నాకు బహుమతిగా ఇచ్చారు. ఆయన కత్తులను సేకరిస్తారు’ అని శృతి తెలిపారు. కత్తి చాలా బాగుంది అంటూ కమల్‌పై ఫరా ఖాన్ ప్రశంసలు కురిపించారు. నీకు వంట వచ్చా అని శృతి హాసన్‌ని ఫరా ఖాన్ అడుగగా.. ‘‘అమెరికాలో ఉన్నప్పుడు నేర్చుకున్నాను. నాకు వంట చేయడం చాలా ఇష్టం. నేను అమెరికా వెళ్లిన తర్వాత ఇండియన్ ఫుడ్ చాలా మిస్ అయ్యాను. అక్కడ ఇడ్లీ 20 డాలర్లు. అందుకే వంట నేర్చుకున్నాను..’’ అని చెప్పుకొచ్చారు. ఇంకా దిలీప్ యూట్యూబ్ ఛానల్ గురించి శృతి హాసన్ అడిగి తెలుసుకున్నారు. తన తండ్రి, తల్లి గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. శృతి హాసన్ మ్యూజిక్ టేస్ట్ గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం ‘కూలీ’ సినిమా ప్రస్తావన వచ్చింది.
Also Read- Nidhhi Agerwal: ప్రభుత్వ వాహనంలో స్టోర్ ఓపెనింగ్‌కు.. వివరణ ఇచ్చిన ‘వీరమల్లు’ హీరోయిన్!
‘కూలీ సినిమా కోసం ఎంతగానో వేచి చూస్తున్నాను. సూపర్ స్టార్ రజనీకాంత్ సార్‌తో చేసిన చిత్రం. ఆ సినిమా విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇందులో అసలు అవకాశం వస్తుందని అనుకోలేదు. నేను నా మ్యూజిక్ వీడియో కోసం దర్శకుడు లోకేష్‌ను సంప్రదించగా, ఆయన నాకు ‘కూలీ’లో నటించే అవకాశాన్ని ఇచ్చారు’ అని శృతి హాసన్ చెప్పుకొచ్చింది. చివరగా, శృతి హాసన్‌కు ఫరా, దిలీప్ కొన్ని బహుమతులను ఇచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు