Eesha Trailer : ” రాజు వెడ్స్ రాంబాయి ” సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీ చిన్నగా వచ్చి పెద్ద హిట్ కొట్టింది. అయితే, ఈ చిత్రంలో నటించిన నటి నటులకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక సినిమాలో హీరోగా నటించిన అఖిల్ కు మంచి పేరు వచ్చింది. చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడంతో అఖిల్ కి వరుస అవకాశాలు కూడా వచ్చాయి. అలా ఒక్క హిట్ పడగానే ఇప్పుడు రెండో సినిమా లైనులో పెట్టేసాడు.
సినిమాలో హీరోగా నటించిన అఖిల్ రాజ్ హీరోగా నటిస్తున్న సినిమా ” ఈషా ” మరో నాలుగు రోజుల్లో ఆడియెన్స్ కు ముందుకు రాబోతుంది. దీనిలో హెబ్బా పటేల్, త్రిగుణ్, సిరి హన్మంత్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా దామోదర్ ప్రసాద్ సమర్పణలో, HVR ప్రొడక్షన్స్ పతాకం పై, పోతుల హేమ వెంకటేశ్వర రావు నిర్మాణంలో, శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో రూపొందుతోంది.
సినిమా బన్నీ వాస్, వంశీ నందిపాటి చేత డిసెంబర్ 12, 2025న విడుదల కానుంది. ఇప్పటికే కొన్ని గ్లింప్స్ రిలీజ్ కాగా, తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో “ఆత్మలు ఉన్నాయా?” అనే సస్పెన్స్‌తో, కొంతమంది ఓ బంగ్లాలోకి వెళ్లడం, అక్కడ ఎదుర్కొన్న సంఘటనలు, చెప్పలేని సమస్యలు, అలాగే ఒక ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ తో ప్రేక్షకులను భయపెట్టారు.
ఈట్రైలర్ చూస్తే, సినిమా గుడ్ హారర్-థ్రిల్లర్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించబోతుందని తెలుస్తోంది. ప్రస్తుత ట్రెండ్స్, సస్పెన్స్ ఎలిమెంట్స్, ప్రధాన నటీనటుల నటనతో , ఈషా భయభ్రాంతి కలిగించే హారర్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకోనుందని తెలుస్తోంది.

