Devi Sri Prasad: రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం గురించి కొత్తగా చెప్పనవసరంలేదు. ఆయన ఇచ్చిన సంగీతానికి స్టెప్పులేయనివారుండరు. అయితే తాజాగా ఓ మీడియా చానల్ ఇంటర్వ్యూలో తన రాకింగ్ మ్యూజిక్ కు డాన్స్ మ్యాచ్ చేయగలిగింది ఒక్క చిరంజీవినే అంటూ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా తాను చిన్నపుడు సంగీతం నేర్చుకునే సమయంలో తన సంగీతం సమకూర్చిన పాటలకు మెగాస్టార్ స్టెప్పులేయాలని బలంగా కోరుకునేవాడిని చెప్పారు. అంటే మెగా స్టార్ చిరంజీవి డాన్స్ చేయడంలో చూపించే గ్రేస్ అలాంటిదని ఆయన అన్నారు. మెగాస్టార్ ఎనర్జీ మరో స్థాయిలో ఉంటుందని దాన్ని మ్యాచ్ చేయాలంటే మ్యూజిక్ కంపోజ్ చేయడంలో చాలా కష్టపడాలని, ఆయన పాటలకు కంపోజ్ చేయడం ఎప్పటికీ మరిచిపోలేని రోజులని అన్నారు. దీనిని చూసిన మెగా స్టార్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
Read also-King 100 movie: నాగార్జున వందో సినిమాకు ముగ్గురు హీరోయిన్లా.. షూట్ ఎప్పటినుంచంటే?
బలగం వేణు బలగం తర్వాత తీయబోయే చిత్రం ‘ఎల్లమ్మ’ సినిమాలో హీరోగా ఇప్పటికే దేవీ శ్రీ ప్రసాద్ లాక్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ కథ ఇప్పటివరకూ చాలా మంది హీరోల దగ్గరకు వెళ్లి చివరకు సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ చేతికి చేరింది. ఈ సినిమాలో దేవీ శ్రీ ప్రసాద్ కు జోడీగా కీర్తీ సురేశ్ నటించబోతుందని సమాచారం. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. మొదటి నుంచీ ‘ఎల్లమ్మ’ సినిమాకు కష్టాలు తప్పలేదు. మొదట ఈ సినిమాలో హీరోగా నాని అనుకున్నారు. అనివార్య కారణాల వల్ల ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత నితిన్ అనుకున్నారు. అయన కూడా తప్పుకున్నట్లు సమాచారం. మళ్లీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుకున్నారు. చివరిగా సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ఫిక్సయ్యారు.
Read also-Shiva 4K: నాగార్జున ‘శివ’4కే ట్రైలర్ వచ్చేది అప్పుడే.. ఫ్యాన్స్ రెడీగా ఉండండి..
ఎల్లమ్మ సినిమా ప్రొడక్షన్ విషయానికి వస్తే, ఈ సినిమాను దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై నిర్మించనున్నారు. ఈ సినిమా బడ్జెట్ రూ.40 కోట్లు మించుతుందని అంచనా. కాస్టింగ్ డిలేల వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతుంది. డీఎస్‌పీ లాక్ అయ్యాక, డిసెంబర్, 2025లో షూట్ స్టార్ట్ కావచ్చని సినిమా పెద్దలు అంచనా వేస్తున్నారు. వేణు యెల్డండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ ఒక ఎమోషనల్ ఫీస్ట్‌గా ఉంటుందని నిర్మాత పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. బలగం లాంటి సక్సెస్ కొనసాగితే, ఈ సినిమా కూడా హిట్ అవుతుంది. తాజా బజ్‌తో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు హీరో హీరోయిన్ కూడా ఫిక్స్ అవడంతో సినిమా పట్టాలెక్కించడాని సిద్ధంగా ఉంది. తాజాగా శ్రీవారిని దర్శంచుకున్న వేణు సినిమా గురించి రెండు మూడు వారాల్లో అప్డేట్ వస్తుందన్నారు. వచ్చే ఏడాది సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు.
