Mayasabha: వెర్సటైల్ ఫిల్మ్ మేకర్ దేవా కట్టా (Deva Katta), కిరణ్ జయ కుమార్ (Kiran Jaya Kumar) దర్శకత్వంలో హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష నిర్మించిన వెబ్ సిరీస్ ‘మయసభ’ (Mayasabha). ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లివ్‌లో ఆగస్ట్ 7 నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలను అందుకుంటున్న విషయం తెలిసిందే. రియల్ లైఫ్‌లోని రెండు పార్టీలకు చెందిన అగ్ర నాయకుల మధ్య ఉన్న స్నేహం నేపథ్యంలో వచ్చిన ఈ ‘మయసభ’కు నెంబర్ వన్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతూ.. మంచి ఆదరణను రాబట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్‌లోని మెయిన్ పాత్రల్లో నటించిన వారిని తీసుకోవడానికి గల కారణాలు, అసలు ఈ వెబ్ సిరీస్ ఆలోచన వంటి విషయాలపై దేవా కట్ట.. ప్రత్యేకంగా తెలియజేయాలని అనుకుంటున్నారు. అందులో భాగంగానే.. ‘మయసభ’లో కెకెఎన్ పాత్రలో నటించిన ఆది పినిశెట్టి (Aadi Pinishetty) గురించి ‘ఆదికి, ఆయన కథకి ఓ బిగ్ సెల్యూట్’ అంటూ ఓ లేఖను విడుదల చేశారు. ఇందులో..
‘‘ఆది పినిశెట్టి తండ్రి రవిరాజా పినిశెట్టి 40కి పైగా తెలుగు హిట్ సినిమాలతో.. చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, వెంకటేష్ వంటి లెజెండ్లతో పనిచేసిన ప్రతిష్ఠాత్మక దర్శకుడు. కానీ, ఆది కథ వారసత్వంగా వచ్చిన ఖ్యాతి కాదు, తనకి తానై సంపాదించుకున్న గుర్తింపు. ఆది పినిశెట్టి తన నటనా ప్రయాణాన్ని 2006లో వచ్చిన ‘ఒక వి చిత్రమ్’ సినిమాతో మొదలుపెట్టాడు. 2009లో తమిళంలో వచ్చిన ‘ఈరమ్’తో గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘సరైనోడు, నిన్ను కోరి, రంగస్థలం, మృగం, మరగతనాణయం’ వంటి చిత్రాల్లో తనదైన నటనతో హీరో, విలన్ లేదా సపోర్టింగ్ పాత్ర ఏదైనా సరే.. ఒకే స్థాయి నైపుణ్యంతో చేయగల వెర్సటైల్ నటుడిగా ముద్ర వేశాడు. ‘నిన్ను కోరి’లో ఆదిని నేను మొట్టమొదట గమనించాను. ఆయన డిక్షన్, పాత్రకు తాను తెచ్చిన హుందాతనం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Also Read- Sir Madam OTT: ఓటీటీలోకి విజయ్ సేతుపతి, నిత్యామీనన్‌ల ‘సార్ మేడమ్’.. స్ట్రీమింగ్ డిటైల్స్ ఇవే..
‘మయసభ’ పేరుతో ముందు ఓ మూవీని చేయాలని అనుకున్నాను. కానీ అది సాధ్యం కాదని అర్థమైంది. ఆ తర్వాత ఓటీటీ ఫార్మాట్‌కి మారిన వెంటనే, లీడ్ పాత్రలలో నా మనసుకి తట్టిన మొదటి పేరు ఆది పినిశెట్టి. ఏ సందేహం లేకుండా.. అతనికి స్క్రిప్ట్ పంపి, ఎనిమిది గంటల పాటు జూమ్ కాల్‌లో మొత్తం కథ నరేట్ చేశాను. రెండు లీడ్ పాత్రల్లో ఏదైనా చేయడానికి ఆయనను సిద్ధంగా ఉంచాను. చైతన్య రావును ఫైనల్ చేసిన తర్వాత, తాను MSR పాత్రకు సహజంగా ఉంటాడని భావించి, ఆదిని KKN పాత్ర చేయమని రిక్వెస్ట్ చేశాను.
అక్కడ నుంచి ఆదితో పని చేయడం ఒక ఆనందయాత్రలా మొదలైంది. KKN పాత్ర ఎన్నో పరిమితులు, లేయర్స్‌తో నిండిన ఛాలెంజింగ్ రోల్. నత్తి, ఆర్థిక పరిమితులతో పోరాడుతూ, అపరిమితమైన అపరిమైన లక్ష్యాలతో కూడిన రోల్. ప్రతి సమస్యని ఆవేశంతో కాకుండా.. ఆలోచనతో ఎదుర్కొనే నాయకత్వ లక్షణం ఉన్న పాత్ర. ఆది తన KKN పాత్రను ఒక మారథాన్‌లా తీసుకున్నాడు. ఆ కాలపు రాజకీయ వాతావరణాన్ని గ్రహించి, తన బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకుంటూ.. డైలాగ్‌లతోనే కాదు, మాటల మధ్య నిశ్శబ్దంతో కూడా సిరీస్‌కు ఎంతో లైఫ్ తీసుకొచ్చాడు.
Also Read- Venkatesh – Trivikram: మరీ ఇంత సైలెంట్‌గానా!.. ‘వెంకీ-త్రివిక్రమ్’ ప్రాజెక్ట్ ప్రారంభం
స్కూల్ పిల్లాడిలా స్క్రిప్ట్ రీడింగ్స్‌లో పాల్గొనడం, నత్తిని అతి జాగ్రత్తగా ప్రదర్శిస్తూ, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ అపారమైన డెడికేషన్‌తో.. ఒక రియల్ లైఫ్ లెజెండ్‌తో పోల్చుకునే KKN పాత్రను అప్రోచ్ చేశారు. ఆదిలో ఎప్పుడూ కనిపించే ఆ చిరునవ్వు, అమాయకపు కళ్లు, చైతన్య రావుతో తనకు నిజ జీవితంలో ఉన్న స్నేహం.. ఈ షోకు గొప్ప ఆస్తిగా మారింది. అతను ఇంప్రూవైజ్ చేసిన చిన్న చిన్న హావభావాలు షోలో అనేక అద్భుతమైన మోమెంట్స్‌ను సృష్టించాయి.
ఎన్నో ఉదాహరణలనుంచి ఈ రెండూ పంచుకుంటున్నాను:
మూడో ఎపిసోడ్‌లో బస్సులో MSR చేతిని చాచి పలకరించే ముందు.. తన రక్తమయమైన చేతిని చూసే దృశ్యం- ఒక శక్తివంతమైన ట్రైలర్ షాట్‌గా మారింది.
నామినేషన్ పేపర్లను తీసుకుంటున్నప్పుడు CBRకు బదులివ్వడంలో, అతని స్టైల్లోనే సమాధానం ముగించే విధంగా డైలాగ్ ఎక్స్టెండ్ చెయ్యడం- ఆ హీరోయిక్ మూమెంట్‌ని ఇంకో ఎత్తుకు తీసుకెళ్ళింది.
ఈ సిరీస్‌కి వచ్చిన విమర్శకుల ప్రశంసలు, దేశవ్యాప్త గుర్తింపు.. ఆది కెరీర్‌ని ఇంకా ఉన్నత స్థానాలకు తీసుకు వెళుతుందని, వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. తను ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత అంబీషస్ పొలిటికల్ డ్రామాకి ముఖచిత్రం. ఈ దీర్ఘ ప్రయాణం.. మంచి స్క్రిప్ట్ కోసం ఎదురు చూపులు, సగం మట్టికట్టిన స్క్రిప్ట్‌లను తిరస్కరించిన క్రమశిక్షణ, ప్రతి అడుగు విలువైనదని నిరూపించాయి’’ అని దేవా కట్ట చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు