Balayya and Boyapati Movie
ఎంటర్‌టైన్మెంట్

Akhanda 2 – Thaandavam: హిమాలయాల్లో దర్శకుడు రెక్కీ! ఎందుకంటే?

Akhanda 2 – Thaandavam: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), మాస్ మూవీస్ మేకర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘అఖండ 2: తాండవం’. ఈ సినిమాతో నాల్గవ సారి వీరిద్దరూ కలిసి పని చేస్తున్నారు. ఇంతకు ముందు వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ చిత్రాలు ఒకదానిని మించి మరొకటి సక్సెస్ సాధించాయి. ఇప్పుడు ‘అఖండ’కు సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న చిత్రమే ‘అఖండ 2: తాండవం’. మొదటి పార్ట్ ఘన విజయం సాధించడంతో, ఈ సీక్వెల్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. నటసింహం బాలయ్య కుమార్తె ఎం తేజస్విని నందమూరి ఈ సినిమాను సమర్పిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఓ అప్డేట్ విడుదల చేశారు.

Also Read- Senior Heroine: సెకండ్ ఇన్నింగ్స్‌కు రెడీ అంటున్న సీనియర్ హీరోయిన్

హిమాలయాల్లో రెక్కీ

‘అఖండ 2: తాండవం’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల మహా కుంభ మేళాలో కూడా దర్శకుడు బోయపాటి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమా కోసం హిమాలయాల్లో రెక్కీ నిర్వహిస్తున్నారని మేకర్స్ ఈ అప్డేట్‌లో తెలిపారు. హిమాలయాల్లోని అద్భుతమైన ప్రదేశాలలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఎక్స్‌ట్రార్డినరీ సన్నివేశాలను చిత్రీకరించడానికి బోయపాటి ప్లాన్ చేశాడని, అందుకే అక్కడి ప్రదేశాలపై ఆయన రెక్కీ నిర్వహిస్తున్నాడని మేకర్స్ చెబుతున్నారు. హిమాలయాల్లో చిత్రీకరించే ఈ సన్నివేశాలు ఈ సినిమాకు మెయిన్ హైలైట్ అవుతాయని అంటున్నారు. ‘అఖండ’ సినిమాలో కూడా ఎవరూ ఊహించని విధంగా ఓ యాక్షన్ ఎపిసోడ్‌ని బాలయ్య నీళ్లలో ప్లాన్ చేసి, అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు తీయబోయే సన్నివేశాలు కూడా అలాగే ఉంటాయని అంటున్నారు.

Balakrishna in Akhanda
Balakrishna in Akhanda

హై బడ్జెట్‌తో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సీక్వెల్‌లో బాలయ్య సరసన సంయుక్త హీరోయిన్‌గా కనిపించనుంది. యంగ్ హీరో ఆది పినిశెట్టిని రీసెంట్‌గానే ఓ కీలకమైన పాత్రకి ఎంపిక చేసినట్లుగా అధికారికంగా ప్రకటించారు. సంగీత సంచలనం ఎస్ థమన్ మళ్లీ బ్రహ్మాండమైన సంగీతాన్ని ఈ చిత్రానికి రెడీ చేస్తున్నారు. ఇంకా అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. బాలయ్య, బోయపాటి కాంబోలో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను దసరా పండుగను పురస్కరించుకుని 25 సెప్టెంబర్, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఇక బాలయ్య విషయానికి వస్తే, రీసెంట్‌గా ‘డాకు మహారాజ్’ అంటూ మరో సెన్సేషనల్ హిట్ కొట్టారు. సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా మాస్‌ని బాగా ఆకట్టుకుంది. బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులోని బాలయ్య పాత్రకు ఫ్యాన్స్ అంతా ఫిదా అయ్యారు.

ఇది కూడా చదవండి:
Anasuya: మరోసారి అనసూయకు విరాట్ కర్ణ సినిమాలో ఛాన్స్

Suzhal- The Vortex Season 2: ఓటీటీలోకి వచ్చేసిన క్షణం చూపు పక్కకి తిప్పుకోనివ్వని సస్పెన్స్ థ్రిల్లర్‌ సిరీస్

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?