Ghaati: క్వీన్ అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఘాటి’. చాలా గ్యాప్ తర్వాత అనుష్క చేస్తున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. అందులోనూ దర్శకుడు క్రిష్.. ఈ సినిమాను సైలెంట్‌గా షూటింగ్ చేశారు. చిత్ర గ్లింప్స్ వచ్చే వరకు ఈ సినిమా ఒకటి ఉందని ఎవరికీ తెలియదు. ‘వేదం’ (Vedam) తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలైతే భారీగానే ఉన్నాయికానీ, ఈ సినిమా కూడా (ఆయన సగం దర్శకత్వం వహించిన ‘హరి హర వీరమల్లు’ కూడా రిలీజ్ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తోంది) రిలీజ్ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ.. ఇప్పటికే పలుమారు వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్‌గా జూలై 11న ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ‘ఘాటి’ ప్రమోషన్స్ భారీగా అని చెప్పలేం కానీ, ఓ మోస్తరుగా మొదలెట్టారు. అందులో భాగంగా ఈ మూవీ నుంచి ‘సైలోరే’ అనే లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
Also Read- Chiranjeevi: ఇకపై నాగ్ దారిలోనే నేను.. ధనుష్‌కి బెస్ట్ యాక్టర్ రాకపోతే..!
ఈ సాంగ్ చూసిన వారందరికీ లేని పోని అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి. ఈ సాంగ్‌లో అసలు అనుష్క నటించిందా? అనేలా అనుమానాలు మొదలవుతున్నాయి. ఎందుకంటే, ఒక్క సన్నివేశంలో తప్పితే.. అనుష్క ఫేస్ ఈ పాటలో కనిపించలేదు. లిరికల్ కోసం ఏదో ఏఐ వాడారని అనుకోవడానికి మిగతా వారంతా డ్యాన్స్ చేస్తున్న విజువల్స్‌లో క్లియర్‌గానే కనిపిస్తున్నారు. కానీ అనుష్కను మాత్రం స్ట్రయిట్‌గా చూపించడం లేదు. ఆమెను చూపించాల్సి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక కవరింగ్ ఇస్తున్నారు. దీంతో అనుష్క లేకుండానే ఈ పాటను చిత్రీకరించారనేలా నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో అయితే వైరల్ అవుతూ.. టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
ఈ పాటని జానపద ఊపుతో నిండిన పాటగా పిక్చరైజ్ చేశారు. ఇది ఓ ఎనర్జిటిక్ బ్లాస్టర్‌లా అనిపిస్తుంది. ప్రకృతి సౌందర్యంతో నిండిన అడవులను నేపథ్యంగా చేసుకున్న ఈ ఫోక్ వెడ్డింగ్ యాంథమ్‌లో.. లీడ్ పెయిర్ ఒకే ఒక్క సన్నివేశంలో కనిపించి ప్రేక్షకులను అలరించారు. అనుష్క, విక్రమ్ కొత్తగా పెళ్లి అయిన జంటగా సంగీతం, నృత్యం, సాంస్కృతిక వెలుగులతో చుట్టూ ఉంటూ అడవిని రంగుల విందుగా, మేళ తాళాలతో, భావోద్వేగాలతో నింపారు. నాగవెళ్లి విద్యాసాగర్ స్వరపరిచిన ఈ పాట జానపదపు స్వరాలను, భావోద్వేగాలకు మిళితం చేస్తూ వినగానే ఎక్కేసేలా ఉంది. కృష్ణ రాసిన సాహిత్యం అర్థవంతంగా ఉంటే.. లిప్సిక భాష్యం, సాగర్ నాగవెళ్లి, సోనీ కోమండూరి ఆలపించిన ఈ పాట చార్ట్ బస్టర్‌లో నిలిచేలా ఉంది. రాజు సుందరం కొరొయోగ్రఫీ చేశారు.
Also Read- Manchu Family: న్యూజిలాండ్‌లో 7 వేల ఎకరాలు కొన్నాం.. అసలు విషయం ఇదే!
ఇక ఇటీవల వచ్చిన గ్లింప్స్‌లో ఇంటెన్స్ వైలెంట్ క్యారెక్టర్‌లో కనిపించి, అనుష్క అందరినీ ఆశ్చర్యపరిచారు. తమిళ యాక్టర్ విక్రమ్ ప్రభు ఇంటెన్స్ అవతార్‌లో కనిపించిన క్యారెక్టర్ గ్లింప్స్ సినిమాపై ఉన్న బజ్‌ను మరింత పెంచిందనడంలో అతిశయోక్తి లేదు. UV క్రియేషన్స్ సమర్పిస్తున్న ఈ సినిమాను రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. జూలై 11న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రానికి మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫీ, తోట తరణి ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తుండగా.. సాయి మాధవ్ బుర్రా మాటలు రాశారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు