Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవికి (Anjana Devi) అస్వస్థతగా ఉందని.. ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారంటూ చాలా రకాల వార్తలు వస్తున్నాయి. అయితే వాటిపై తాజాగా చిరంజీవి టీమ్ స్పందించింది. అంజనాదేవికి అస్వస్థత అంటూ వస్తున్న వార్తలు అన్నీ అవాస్తవమే అంటూ తేల్చి చెప్పింది. ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని.. గతవారం ఆమె సాధారణ పరీక్షల్లో భాగంగా ఆస్పత్రికి వెళ్లందన్నారు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఇంట్లోనే ఉన్నారంటూ క్లారిటీ ఇచ్చింది. దాంతో మెగా ఫ్యాన్స్ కూల్ అయిపోయారు.
శుక్రవారం ఉదయం నుంచి అంజనమ్మకు తీవ్ర అనారోగ్య సమస్యలు అంటూ వార్తలు వస్తున్నాయి. దుబాయ్ కు వెళ్లిన చిరంజీవి, సురేఖ దంపతులు హుటాహుటిన ఆస్పత్రికి వెళ్తున్నారని.. అటు రామ్ చరణ్ (Ram Charan) కూడా ఆస్పత్రికి వస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. చివరకు అవన్నీ అవాస్తవమే అంటూ తేలింది.
ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా దీనిపై స్పందించారు. తన తల్లికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని చెప్పారు. కొన్ని రోజుల కిందట ఆమె చిన్నపాటి అనారోగ్యానికి గురయ్యారని.. కానీ దాని నుంచి వెంటనే కోలుకున్నట్టు చెప్పారు. ప్రస్తుతానికి ఆమె చాలా ఆరోగ్యంగా ఉన్నారని వివరించారు. దయచేసి మా తల్లి గురించి ఎలాంటి అవాస్తవాలు రాయొద్దని మీడియాను కోరుతున్నట్టు మెగాస్టార్ వివరించారు.