Chiranjeevi: ఇటీవలే ఎంతో మంది ఈ డీప్‌ఫేక్ బారిన పడుతున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న నుంచి మొదలయ్యి మెగాస్టార్ చిరంజీవి వరకు వెళ్ళింది. ఇక చిరు ఆన్‌లైన్ దాడుల మీద ఆఫ్‌లైన్ యుద్ధం ప్రకటించేశారు. డీప్‌ఫేక్ అంటే సాధారణ గొడ్డలి పెట్టు పెట్టులాంటిదని.. ఇప్పటికే ఈ అంశం పలు మార్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక కొందరైతే అదొక పెద్ద న్యూక్లియర్ బాంబు లాంటిదని గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ డీప్‌ఫేక్ డ్రామా మొత్తాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లేశానని, సూపర్ ఫాస్ట్‌గా యాక్షన్ తీసుకున్నారని బుల్లితెరపై బాంబు పేల్చేశారు చిరు.
Also Read: Bigg Boss Telugu 9: నువ్వు, నీ ఓవరాక్షన్, నీ లవ్ యవ్వారాలు నాకు నచ్చలే.. రీతూకి షాకిచ్చిన ఆయేషా!
ఈ కేసుపై సీరియస్ అయిన పోలీసులు?
డీజీపీ శివధర్ రెడ్డి , సీపీ సజ్జనార్ ఈ ఇద్దరు కేసును సూపర్ సీరియస్‌గా తీసుకున్నారు. సజ్జనార్ స్వయంగా పర్సనల్ మానిటరింగ్లోకి దిగేశారు. ఆయన పర్యవేక్షిస్తున్నట్లుచిరంజీవి చెప్పుకొచ్చారు. “ఎవడైనా సరే, ఎక్కడైనా సరే… డీప్‌ఫేక్ చేస్తే ఊరుకోము” అంటూ సైలెంట్‌గా సైబర్ నేరగాళ్లకు వార్నింగ్ ఇచ్చేశారు.
పోలీసు వ్యవస్థ చాలా బలంగా ఉంది. ప్రజలకు పోలీసులు అండగా ఉన్నారని చిరు తెలిపారు. ఎవరూ డీప్‌ఫేక్, సైబర్ నేరాలకు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. డీప్‌ఫేక్, సైబర్ క్రైమ్స్, ఏదైనా సరే, భయపడకండి.. వాటిని ఎదుర్కొవడానికి పోలీసులు సిద్దంగా ఉన్నారు” అంటూ హీరోలా డైలాగ్ కొట్టేశారు మెగాస్టార్. ఈ మాటలు వినగానే జనం థియేటర్ స్టైల్‌లో చప్పట్లు కొట్టేశారు.

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				