Chinmayi Sripaada: బహుభాషా గాయని, మీటూ ఉద్యమకారిణి చిన్మయి శ్రీపాద తనపై లైంగిక వేధింపులకు సంబంధించిన పాత ఆరోపణలను ప్రస్తావించిన ట్రోలర్‌లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళసూత్రాన్ని ‘సామాజిక నిర్మాణం’గా పేర్కొంటూ ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ వివాదం చెలరేగింది. ఈ వివాదం ఇటీవల చిన్మయి భర్త, సినీ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఇచ్చిన ఇంటర్వ్యూతో మొదలైంది. తమ వివాహంలో మంగళసూత్రం ధరించడం లేదా ధరించకపోవడం అనేది పూర్తిగా చిన్మయి వ్యక్తిగత ఎంపిక అని ఆయన పేర్కొన్నారు. మంగళసూత్రం అనేది ఒక కట్టుబాటు మాత్రమేనని, దానిని ధరించాలని తాను బలవంతం చేయనని ఆయన తెలిపారు.
Read also-Baahubali Eternal War teaser: ‘బాహుబలి ది ఎటర్నల్ వార్ పార్ట్ 1’ యానిమేషన్ టీజర్ వచ్చేసింది చూశారా..
రాహుల్ వ్యాఖ్యలను ఉద్దేశించి కొందరు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, చిన్మయి బదులిస్తూ, “ఆయన చేసిన వ్యాఖ్యలపై పురుషుల నుండి వస్తున్న కోపం చూస్తుంటే, నిజంగా ఇక్కడి మహిళల గురించి నేను ఆందోళన చెందుతున్నాను” అని ట్వీట్ చేశారు. ఈ చర్చ జరుగుతుండగా, ఒక ట్రోలర్ హద్దులు దాటి, చిన్మయి గతంలో గీత రచయిత వైరముత్తుపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను ప్రస్తావించాడు. ఆ ట్రోలర్ “మీరు లైంగిక వేధింపులకు గురైనప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోలేకపోయారు, కాబట్టి మహిళలందరి భద్రత గురించి కాకుండా మీ సొంత భద్రత గురించి చింతించండి” అనే అర్థం వచ్చేలా వ్యాఖ్య చేశాడు.
Read also-Peddi first single: రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి అప్టేట్ అదిరింది.. ఫుల్ సాంగ్ ఎప్పుడంటే?
దీనికి చిన్మయి గట్టిగా బదులిచ్చారు. “అవును. లైంగిక వేధింపులకు గురవడం నా తప్పు. మీలాంటి పురుషులు తమ అర్ధంలేని వాదనను రుజువు చేసుకోవడానికి నా లైంగిక వేధింపుల ఎపిసోడ్‌ను, నన్ను వేధించిన వ్యక్తిని ఎందుకు తీసుకురావాలి?” అని తీవ్రంగా స్పందించారు. చిన్మయి వాదనకు కొంతమంది నెటిజన్లు మద్దతుగా నిలిచారు. “లైంగిక వేధింపులకు గురవడం ఎప్పటికీ మీ తప్పు కాదు. బాధితులకు సానుభూతి చూపాలి, వేరొకరి వాదనకు వారిని ఉపయోగించకూడదు” అని ఒకరు ట్వీట్ చేయగా, మరొకరు “చిన్మయి, నిన్ను ట్రోల్ చేసే ప్రతి పురుషుడిని పట్టించుకోకు” అని ప్రోత్సహించారు. చిన్మయి 2018 మీటూ ఉద్యమం సమయంలో వైరముత్తు, నటుడు రాధా రవిపై ఆరోపణలు చేశారు. అప్పటి నుండి ఆమె పరిశ్రమలో అవకాశాలు కోల్పోయానని చెప్పారు. మంగళసూత్రం లేదా సింధూరం వంటి సంప్రదాయాలు కేవలం వ్యక్తిగత ఎంపికే తప్ప, సామాజిక బాధ్యత కాకూడదని ఆమె గట్టిగా వాదిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నెగిటివిటీ పెరిగిపోతుంది. ముఖ్యంగా ట్వటర్ వంటి మాధ్యమాల్లో ఇది మరింత అధికం. ఇలా ఆడవారిపై ట్రోల్ ఆగాలంటే.. సమాజంలో మార్పు రావడమే ఏకైక మార్గం.
