Bun Butter Jam
ఎంటర్‌టైన్మెంట్

Bun Butter Jam Trailer: ‘బ‌న్ బ‌ట‌ర్ జామ్‌’ ట్రైలర్.. అందరూ చూడాల్సిందే!

Bun Butter Jam Trailer: ఇటీవల వచ్చిన టీజర్‌తోనే ఆసక్తిని రేకెత్తించిన చిత్రం ‘బన్ బటర్ జామ్’ (Bun Butter Jam). రాజు జెయ‌మోహ‌న్‌, ఆధ్య ప్ర‌సాద్‌, భ‌వ్య త్రిఖ హీరో హీరోయిన్లుగా రాఘ‌వ్ మిర్‌ద‌త్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘బన్ బటర్ జామ్’. సురేష్ సుబ్ర‌మ‌ణియ‌న్ స‌మ‌ర్ప‌కుడిగా రెయిన్ ఆఫ్ ఎరోస్‌, సురేష్ సుబ్ర‌మ‌ణియ‌న్ నిర్మించిన ఫ‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్‌గా ఔట్ అండ్ ఔట్ కామెడీతో ఆల్రెడీ తమిళ్‌లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కోలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించిన తీరుని చూసి.. ఈ మూవీని తెలుగులో ఆగస్టు 22న శ్రీ విఘ్నేశ్వర ఎంటైన్మెంట్స్ బ్యానర్ పై సిహెచ్ సతీష్ కుమార్ గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్‌ని ఆయన యమా జోరుగా నిర్వహిస్తున్నారు. టీజర్ అలా వచ్చిందో లేదో.. వెంటనే ఇప్పుడు ట్రైలర్ వదిలి.. సినిమాపై మరింతగా అంచనాలను పెంచేశారు.

Also Read- Chiranjeevi: రాజకీయాల్లో లేకపోయినా నాపై విమర్శలు.. అయినా ఎందుకు స్పందించనంటే?

‘బన్ బటర్ జామ్’ ట్రైలర్ విషయానికి వస్తే.. ‘సంపాదించిన దాంట్లో సగం పెళ్లికి ఖర్చు పెడుతున్నారు.. మిగతా సగం డివోర్స్‌కి ఖర్చు పెడుతున్నారు’, ‘అసలు నేను చేస్తోంది లవ్వో కాదో తెలియట్లేదే’, ‘ఏ రిలేషన్ షిప్‌లో అయినా రెండు వైపుల ప్రేమ, మర్యాద సమానంగా ఉండాలి’.. ‘మీరు రాను రాను పిచ్చి వాళ్లలా బిహేవ్ చేస్తున్నారు’ అని కొడుకు అంటే.. ‘అవునురా మేమంతా పిచ్చివాళ్లమే.. మీ లైఫ్ అంతా బాగుండాలని అనుకుంటున్నాం కదా’ అని తల్లి.. ఇలా వారి మధ్య సంభాషణ హైలైట్‌గా నిలుస్తోంది. ట్రైలర్ చివర్లో వచ్చే ‘ఇష్టమైతే పెళ్లి చేసుకుంటున్నారు.. లేకపోతే డివోర్స్‌ తీసుకుంటున్నారు.. మీ జనరేషన్‌ని అర్థం చేసుకునే ప్రయత్నంలో మేమంతా ఓడిపోతున్నాం’ అంటూ తల్లి చెప్పే డైలాగ్‌.. ఈ సినిమా కథ, కథనాలు ఏంటనేది తెలియజేస్తున్నాయి. ఒకవైపు ఎమోషన్స్ కురిపిస్తూనే, మరోవైపు ఎంటర్‌టైన్ చేస్తున్న ఈ ట్రైలర్.. సినిమాపై క్రేజ్‌ ఏర్పడేలా చేస్తోంది.

Also Read- Khadgam Actress: విడాకులు తీసుకోబోతున్న రవితేజ హీరోయిన్.. పెద్ద హింటే ఇచ్చిందిగా?

ఈ సినిమాను.. కాలేజ్ లైఫ్, ప్రేమ, పెళ్లి, తల్లిదండ్రుల ప్రేమ వంటి అన్ని రకాల అంశాలను జోడించి తెరకెక్కించినట్టుగా ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ ట్రైలర్‌ను బట్టి చూస్తే ఇది యూత్ ఫుల్, లవ్, ఫ్యామిలీ, రొమాంటిక్, కామెడీ సినిమా అని ఇట్టే చెప్పేయవచ్చు. రాఘ‌వ్ మిర్‌ద‌త్ ఫ‌న్నీగా సినిమాను నడిపిస్తూనే.. నేటి తరం తెలుసుకోవాల్సిన ఎన్నో విలువల్ని చెబుతున్నట్లుగా అనిపిస్తోంది. ఆయన సినిమాను తెర‌కెక్కించిన తీరు, నివాస్ కె. ప్ర‌సన్న అందించిన సంగీతం, బాబు కుమార్ సినిమాటోగ్ర‌ఫీ, ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్ అన్నీ కూడా సినిమాపై ప్రేక్షకులకు ఇంట్రస్ట్‌ని కలిగిస్తున్నాయి. ఆగ‌స్ట్ 22న విడుదలకు వస్తున్న ఈ సినిమా తెలుగులోనూ ఘన విజయం సాధిస్తుందని విఘ్నేశ్వ‌ర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మాత సి.హెచ్‌ స‌తీష్ కుమార్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

SCU: సుజీత్ సినిమాటిక్ యూనివర్స్.. దర్శకనిర్మాతలు క్లారిటీ ఇచ్చేశారుగా..!

Arjun Das: ఓరి నీ అభిమానం చల్లగుండా.. మరీ ఇంత పెద్ద మెసేజ్ ఏంటయ్యా?

Sandeep Raj: ‘ఓజీ’ విడుదల వేళ.. 8 సంవత్సరాల క్రితం చేసిన ట్వీట్‌‌‌తో సంచలనం!

O Cheliya Teaser: హీరో శ్రీకాంత్ వదిలిన ‘ఓ.. చెలియా’ టీజర్ ఎలా ఉందంటే?

Connplex Cinemas: ‘ఓజీ’ సినిమాతో హైదరాబాద్‌లో మరో లగ్జరీ మల్టీప్లెక్స్‌ ప్రారంభం.. వివరాలివే!