Deepa Mehta: బాలీవుడ్ నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ (Mahesh Manjrekar) మొదటి భార్య దీపా మెహతా కన్నుమూశారు (Deepa Mehta Passes Away). తన తల్లి మరణ వార్తను మహేష్ మంజ్రేకర్, దీపా మెహతాల కుమారుడు సత్య మంజ్రేకర్ (Satya Manjrekar) తన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ‘ఐ మిస్ యూ అమ్మ’ (I Miss You Amma) అంటూ ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీపా మెహతా మృతి వార్త తెలిసిన వారంతా, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. నివాళులు అర్పిస్తున్నారు. సత్య మంజ్రేకర్ తన మదర్‌కు నివాళులు అర్పించిన వారందరి పోస్ట్‌లను ఇన్‌స్టా వేదికగా తెలియజేశారు. దీపా మెహతా విషయానికి వస్తే.. దీపా మెహతా ఒక కాస్ట్యూమ్ డిజైనర్. మహేష్ మంజ్రేకర్ 1987లో ఆమెను వివాహం చేసుకున్నారు. వారిద్దరూ కాలేజీ రోజుల నుంచి ఒకరికొకరు తెలుసు, అప్పటి నుంచే కలిసి ఉన్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. కుమార్తె అశ్వమి మంజ్రేకర్, కుమారుడు సత్య మంజ్రేకర్. 1995లో వారి వివాహ జీవితంలో విభేదాలు తలెత్తడంతో మహేష్, దీపా.. ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అయినప్పటికీ అశ్వమి, సత్య ఇద్దరూ వారి తండ్రి మహేష్‌తోనే ఉన్నారు.
అసలు దీపా మెహతా ఎవరంటే..
దీపా ‘క్వీన్ ఆఫ్ హార్ట్స్’ అనే చీరల బ్రాండ్‌ను నిర్వహించేవారు. ‘క్వీన్ ఆఫ్ హార్ట్స్’ బ్రాండ్ చీరలకు అప్పట్లో మరాఠీ సినీ పరిశ్రమలోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా మంచి డిమాండ్ ఉండేది. దీప, మహేష్‌ల కుమార్తె అశ్వమి మంజ్రేకర్ ఈ బ్రాండ్‌కు మోడల్‌గా పనిచేసేవారు. అశ్వమి నటన రంగంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
Also Read- Marriage Gift Scheme: పెళ్లి చేసుకునే అమ్మాయిలకు ప్రభుత్వ కానుక.. కానీ, వారు మాత్రమే అర్హులు!
మహేష్ మంజ్రేకర్ కుటుంబ వివరాలివే..
దీపా మెహతాతో విడాకుల అనంతరం మహేష్ మంజ్రేకర్ నటి మేధాను రెండో వివాహం చేసుకున్నారు. మేధా, మహేష్‌లకు సయీ మంజ్రేకర్ అనే కుమార్తె ఉంది. సయీ తన తండ్రితో కలిసి సల్మాన్ ఖాన్ నటించిన ‘దబాంగ్ 3’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. తెలుగులో ఆమె ‘ఘని’, ‘స్కంద’, ‘మేజర్’, ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ చిత్రాలలో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. మహేష్ మంజ్రేకర్ రెండో భార్య మొదటి భర్తకు కూడా ఒక కుమార్తె ఉంది. ఆమె కూడా నటే. ఆమె పేరు గౌరీ ఇంగావాలే. ‘పాంఘ్రున్, హి అనోఖి గాత్, దే ధక్కా 2’ వంటి చిత్రాలలో గౌరీ ఇంగావాలే నటించింది. మహేష్, దీపాల పిల్లలైన అశ్వమి, సత్య కూడా యాక్టింగ్ వృత్తికి చెందినవారే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు