Bigg Boss Telugu 9 : బిగ్ బాస్ షో ఎప్పుడు రన్ అవుతుందా అని ఎదురు చూశారు. ఇప్పుడైతే చూసే వాళ్ళకి కూడా చిరాకు వస్తుంది. ఈ సీజన్ కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ చేయడంతో మంచి హైప్ వచ్చింది. వరుసగా కింగ్ నాగ్ కి ఇది ఏడో సీజన్. ఇది స్టార్ట్ అయ్యే వరకు ఒకలా ఉంది. స్టార్ట్ అయ్యాక ఇంకోలా మారింది. బిగ్ బాస్ గురించి మనకీ తెలిసిందేగా.. కొంచం తేడా వచ్చినా.. అప్పటి వరకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఒక్కసారిగా ఫైర్ అవుతారు. చూసే ఆడియెన్స్ కూడా.. వామ్మో మీ ఓవర్ యాక్షన్ ఆపండిరా బాబు .. ఇదొక షో నా .. ఇక చాలు ఆపండంటూ మండి పడతారు. రణరంగం అంటే యుద్ధభూమి. ఈసారి చదరంగం కాదు, రణరంగమే అనే ట్యాగ్ లైన్ తో మొదలైన ఈ షో అనుకున్నంత హైప్ అయితే రాలేదు.
Also Read: Gadwal Crime: పోలీసుల అదుపులో మోసాలకు పాల్పడుతున్న బంగారం వ్యాపారి.. మరో ఘటనలో బంగారం కోసం మహిళ హత్య
బిగ్ బాస్ సీజన్ 9 ఈ సారి ఎవరి ఊహకి అందడం లేదు. అయితే, తొమ్మిదో వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. దీనికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ అయింది. సోమవారం వస్తే చాలు నామినేషన్స్ రచ్చ మొదలైనట్లే. హౌస్ మేట్స్ వారం నుంచి దాచుకుంది మొత్తం ఆ రోజున కక్కేస్తారు. ఇక ఈ సారి రీతూ మళ్లీ సంజన మీద విరుచుకుపడింది. బంధాలు అంటూ ఒకరి మీద ఒకరు మాటల దాడి చేసుకున్నారు.
ఈ ప్రోమో ను చూసిన వాళ్ళు రక రకాల కామెంట్స్ చేస్తున్నారు. హౌస్ లో అందరూ మంచిగున్నరా.. అందరికీ బాండ్స్ ఉన్నాయి. ఒక్కరు గొడవ పడితే చాలు. వేరే వాళ్ళు కూడా వెళ్తారు. ఏమైనా అంటే హౌస్ లో బయట తనూజ మాత్రమే తప్పు చూపిస్తున్నారు. లైవ్ చూస్తే తెలుస్తుందిగా. తనూజ, రీతూ , డెమోన్ కళ్యాణ్ వీళ్ళు టీం లాగా ఉంటే బావుంటుంది.
