Bigg Boss 9 Telugu: ఇంకొన్ని రోజుల్లో మళ్లీ బిగ్ బాస్ సందడి మొదలు కాబోతోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) మొదలయ్యేందుకు సమయం ఆసన్నమవుతోంది. అయితే ఈ లోపు కంటెస్టెంట్ల పరంగా కావాల్సినంత థ్రిల్ పంచుతున్నాడు బిగ్ బాస్. అవును, రీసెంట్‌గా ఈసారి సామాన్యులకు అవకాశం అంటూ బిగ్ బాస్ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఏ క్షణం ఏం జరుగుతుందో? వూహించలేని విధంగా, ఎవరి తలరాత ఎలా మారిపోతుందో అంచనాలకు కూడా అందకుండా, షో మొదలవ్వక ముందే.. ప్రతి నిమిషం ఉత్కంఠగా, ప్రతి అప్డేట్‌లోనూ ఏదో ఒక విశేషంతో ‘బిగ్ బాస్’ వార్తలలో నిలుస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు స్టార్ మా అందిస్తున్న ఈ షో.. ఇప్పుడు తొమ్మిదో సీజన్ (బిగ్ బాస్ సీజన్ 9)కు చేరుకోగా, ఈసారి ఎన్నో ప్రత్యేకతలతో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు థ్రిల్ ఇవ్వడానికి టీమ్ కొత్త కొత్త ఐడియాలతో సిద్ధమవుతోంది.
దాదాపు 8 సీజన్లుగా ఈ షోను ఆదరిస్తున్న వారి కోసం ‘రిటర్న్ గిఫ్ట్’ పేరుతో ఇటీవల హోస్ట్ నాగార్జున (Bigg Boss Host Nagarjuna) చేసిన ప్రోమో పెద్ద సంచలనమే సృష్టించింది. ఈసారి జరిగే బిగ్ బాస్ సీజన్ 9లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు ఎక్కువ ఇంపార్టెన్ ఇస్తున్నట్లుగా చెప్పి.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిలో పెద్ద చర్చకు తెరతీశారు కింగ్ నాగ్. ఇంతవరకు ఇంట్లో ఉండి షో ని చూశాం.. ఈసారి మనమూ హౌస్‌లోకి వెళ్లే ఛాన్స్ వచ్చిందని, వేల మంది ఉత్సాహపడటంతో.. అసలు చిక్కు వచ్చి పడింది బిగ్ బాస్ యాజమాన్యానికి. అయినా సరే.. బిగ్ బాస్ ఏదీ అంత ఈజీ కాదు, ఏదీ అంత సులభంగా తేలదనే విషయం తెలియంది కాదు. ఈసారి బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే.. ‘అగ్నిపరీక్ష’ (agnipariksha). అవును.. ‘అగ్నిపరీక్ష’ పేరుతో ఈ షోపై, కంటెస్టెంట్స్‌పై మరింత ఆసక్తిని పెంచారు బిగ్ బాబు.
Also Read- Kingdom OTT: ఓటీటీలోకి ‘కింగ్‌డమ్’.. ఇంత త్వరగానా? స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
దాదాపు 100 రోజులకు పైగా కోట్ల మంది ప్రేక్షకులను అలరించాల్సిన కంటెస్టెంట్స్ ఎంపిక.. పకడ్బందీగా జరగాలనే ఉద్దేశంతో ఈ బిగ్ బాస్ ఈ అగ్నిపరీక్షను ప్లాన్ చేశారు. ఈసారి హౌస్‌లోకి వెళ్లేందుకు అప్లికేషన్ సబ్మిట్ చేసిన వేలాది మందిలో నుంచి.. రకరకాలుగా జల్లెడ పట్టి ఫైనల్‌గా 40 మంది కంటెస్టెంట్స్‌ని ఎంపిక చేశారు. ఈ 40 మంది ఇప్పుడు బిగ్ బాస్ పెట్టే ‘అగ్నిపరీక్ష’ని ఎదుర్కోబోతున్నారు. అసలు ఈ ‘అగ్నిపరీక్ష’ ఏమిటి? ఎలా ఉంటుంది? ఎలాంటి కఠిన పరీక్షలు ఇందులో పెట్టబోతున్నారు? ఈసారి హౌస్ మేట్స్ కావాలనుకుంటున్నవారి ఎంపిక ఎలా జరుగుతుంది? ఇవన్నీ తెలియాలంటే ఈ ‘అగ్నిపరీక్ష’ని చూడాల్సిందేనంటున్నారు బిగ్ బాస్ టీమ్. జియో హాట్ స్టార్‌లో మాత్రమే అందుబాటులో వుండే ఈ ‘అగ్నిపరీక్ష’ను ఎదుర్కొని.. 40 మంది నుంచి ఎవరు ‘బిగ్ బాస్ సీజన్ 9’ హౌస్‌లోకి వెళ్తారో తెలియాలంటే.. మరో అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
