Bigg Boss ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Big Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్నిపరీక్షను తట్టుకుంటారా? లేక పారిపోతారా?

 Big Boss Agnipariksha: బిగ్ బాస్ రియాలిటీ షో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇది మాకొద్దు బాబోయ్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ త్వరలో మన ముందుకు రానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమోలు కూడా రిలీజ్ అయ్యాయి. ఈ నెల 23 నుంచి బిగ్ బాస్ స్టార్ట్ అవ్వనుంది. అయితే, బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లే ముందు కంటెస్టెంట్స్ కి కొన్ని పరీక్షలు పెట్టనున్నారు. సరికొత్తగా బిగ్ బాస్ అగ్నిపరీక్ష పెట్టి, దీనిలో గెలిచినా వాళ్ళకి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఉంటుందో.

కంటెస్టెంట్స్ ఎవరు ఉంటారు? అనే దాని పై చాలా సందేహాలు ఉన్నాయి. ఈ సారి సెలబ్రిటీస్ ఉంటారా లేక కామన్ పీపుల్స్ ఉంటారా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ సారి కామన్ పీపుల్స్ కి కూడా అనుమతి ఉంది అని చెప్పగానే దాదాపు 20 వేల నుంచి 30 వేల వరకు అప్లై చేసుకున్నారు. అయితే, 40 మందిని మాతమ్రే సెలెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.

అగ్నిపరీక్ష అంటే ఏంటి?

అగ్ని పరీక్షలో మొత్తం 40 కంటెస్టెంట్స్ ఉన్నట్లు తెలుస్తుంది. అందులో కామన్ పీపుల్స్, సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. వీళ్ళందర్ని ఒక దగ్గర ఉంచి ఈ అగ్ని పరీక్షను పెట్టబోతున్నారు. దీనిలో సెలక్ట్ అయిన 19 నుంచి 20 మందిని మాత్రమే బిగ్ బాస్ కి పంపిస్తామని నాగార్జున చెప్పారు. రెండు హౌసెస్ ఉంటాయి, ఈ సారి బిగ్ బాస్ ఉండడు అని చెప్పారు. వీళ్ళను టాస్క్ లలో ఆడించి, రెండు హౌసెస్ లో షిఫ్ట్ చేస్తారా ? లేక ఏ కంటెస్టెంట్స్ ని ఏ హౌస్ లో పెడతారు అనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి. ఈ అగ్ని పరీక్షకు జడ్జెస్ గా ఆల్ టైం ఫేవరేట్, బెస్ట్ పెరఫార్మెర్ అనిపించుకున్న వాళ్ళని సెలెక్ట్ చేసారు.

 

 

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!