Bhartha Mahasayulaku Wignyapthi: ‘బెల్లా బెల్లా’ సాంగ్ వైరల్
Bhartha Mahasayulaku Wignyapthi (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Bhartha Mahasayulaku Wignyapthi: ‘స్పెయిన్‌కే అందాలనిట్ట, అద్దిన ఓ పూలా బుట్టా’.. ‘బెల్లా బెల్లా’ వైరల్

Bhartha Mahasayulaku Wignyapthi: మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో అలరించబోతున్నారు . SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఇందులో రవితేజ సరసన ఆషికా రంగనాథ్‌ , డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. అద్భుతమైన టైటిల్ గ్లింప్స్ తర్వాత, మేకర్స్ ఇప్పుడు ఫుట్‌ట్యాపింగ్ ట్రాక్‌ బెల్లాబెల్లాతో మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించారు.

మాస్-ఆకట్టుకునే చార్ట్‌బస్టర్‌లను అందించడంలో పాపులరైన భీమ్స్ సిసిరోలియో, జానపద సంగీతంతో కూడిన ఫుట్‌ట్యాపింగ్ నంబర్‌తో ఆకట్టుకున్నారు. ఇన్‌స్ట్రుమెంటేషన్, విజువల్స్‌ను ఎలివేట్ చేసే సౌండ్‌స్కేప్‌ను క్రియేట్ చేసింది. ఇది ఇన్స్టంట్ గా హిట్ అయ్యింద. “స్పెయిన్ కే అందాలనిట్ట, అద్దిన ఓ పూలా బుట్టా… వీధుల్లో పోతుంటే అట్టా వార్తల్లో రాయాలి చిట్టా” అంటూ సురేష్ గంగుల రాసిన లిరిక్స్ లో వైబ్‌ అదిరిపోయింది.

నకాష్ అజీజ్, రోహిణి సోర్రాట్ ఎనర్జిటిక్ వోకల్స్ తో జోష్‌ను తెచ్చారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కట్టిపడేసింది. రవితేజ తన ట్రేడ్‌మార్క్ మాస్ మహారాజా స్వాగర్‌తో అదరగొట్టారు. రవితేజ, ఆషికా రంగనాథ్ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ రిఫ్రెషింగ్, ఎలక్ట్రిక్‌గా అనిపిస్తుంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి సంగీత ప్రయాణానికి అద్భుతమైన ప్రారంభంగా నిలిచిన ఈ సాంగ్ జింతాక్ లీగ్‌లో మరో చార్ట్‌బస్టర్‌గా మారనుంది.

టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తోంది. సినిమాటోగ్రఫీ ప్రసాద్ మురెళ్ల, జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్, ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్. భర్త మహాశయులకు విజ్ఞప్తి 2026 సంక్రాంతికి విడుదల కానుంది.

సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ డింపుల్ హయాతి మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఇందులో నా క్యారెక్టర్ పేరు బాలమణి. ఆ పేరులోనే వైబ్రేషన్ ఉంది. ఈ క్రెడిట్ డైరెక్టర్ కిషోర్ గారికి ఇవ్వాలి. మీ అందరికీ ఈ పాట నచ్చడం చాలా ఆనందంగా ఉంది. అషికాతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఇంకా అద్భుతమైన పాటలు ఉన్నాయి. నెక్స్ట్ రాబోతున్నాయి. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. మాస్ మహారాజా అంటే ఎనర్జీ. అదే ఎనర్జీ సంక్రాంతితో చూడబోతున్నాం.

హీరోయిన్ ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ.. మంచి కామెడీ, ఫన్, ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా ఇది. సంక్రాంతి నాకు చాలా లక్కీ. నా సామి రంగంలో వరాలు క్యారెక్టర్ కి అద్భుతమైన ప్రేమని అందించారు. వరాలు కంటే ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రవితేజ గారి ఎనర్జీ మ్యాచ్ చేయడం అంత ఈజీ కాదు. ఆయన అద్భుతమైన డాన్సర్. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bhartha Mahasayulaku Wignyapthi: ‘స్పెయిన్‌కే అందాలనిట్ట, అద్దిన ఓ పూలా బుట్టా’.. ‘బెల్లా బెల్లా’ వైరల్

Akhanda 2: ‘అఖండ 2’కు అవతార్ రూపంలో గండం.. నిరాశలో నందమూరి ఫ్యాన్స్!

Samantha Marriage: భూత శుద్ధి ప్రక్రియలో సమంత – రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకోవడానికి కారణమిదేనా?

Revanth Reddy: వడ్డించే వాడినే నేను… పాలమూరుకు ఎన్ని నిధులైనా ఇస్తా.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పు.. ఇకపై ఓటీపీ తప్పనిసరి