Film Chamber Meeting
ఎంటర్‌టైన్మెంట్

Bharadwaja Thammareddy: సాఫ్ట్‌వేర్ వాళ్లతో సినీ కార్మికులను పోల్చవద్దు..

Bharadwaja Thammareddy: టాలీవుడ్‌లో సినీ కార్మికులు, నిర్మాతల మధ్య చిన్నపాటి యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. సినీ కార్మికులు 30 శాతం వేతనాలు పెంచాలని, లేదంటే షూటింగ్స్‌కు వచ్చే సమస్యే లేదని తెగేసి చెబుతున్నారు. దీంతో షూటింగ్స్ చాలా వరకు ఆగిపోయాయి. నిర్మాతలు కూడా కార్మికులకు వ్యతిరేకంగా కొన్ని నిబంధనలు వ్యక్తం చేశారు. అయితే విషయం మెగాస్టార్ చిరంజీవి వరకు వెళ్లడంతో ప్రస్తుతం ఇద్దరి మధ్య చర్చలు నడుస్తున్నాయి. ఈ చర్చలు సఫలం కానీ పక్షంలో చిరంజీవి నేను ఇన్వాల్స్ అవుతానని తెలిపినట్లుగా నిర్మాత సి. కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫెడరేషన్ ప్రతినిధులతో ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతలు కో-ఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఫెడరేషన్ ముందు నిర్మాతలు 4 ప్రతిపాదనలు ఉంచారు.

అవి:
1. ఫ్లెక్స్ ఫుల్ కాల్ షీట్లు కావాలి. (ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు)
2. టాలీవుడ్‌లో సరైన నిపుణులు లేనప్పుడు నాన్ మెంబర్స్‌తో కూడా వర్క్ చేయించుకుంటాం. (స్కిల్ ఆధారంగా, వేరే రాష్ట్రాల వారితో పని చేయించుకుంటాం)
3. షూటింగ్ ఎక్కడ చేసినా రేషియో అనేది ఉండకూడదు.
4. సెకండ్ సండే, ఫెస్టివల్ డేస్ (ప్రభుత్వం ప్రకటించిన సెలవులు) లో వర్క్ జరిగితే మాత్రమే డబుల్ కాల్ షీట్.. మిగిలిన సండేస్‌లో సింగిల్ కాల్షీట్‌‌
ఈ 4 ప్రతిపాదనలపై ఫెడరేషన్ నిర్ణయం చెబితే.. కార్మికులు కోరుతున్న వేతన పెంపుపై ఒక నిర్ణయం తీసుకుందామని నిర్మాతలు సూచించినట్లుగా తెలుస్తుంది‌‌.

Also Read- Allu Arha: ‘నువ్వు తెలుగేనా?’.. మంచు లక్ష్మి‌కి షాకిచ్చిన అల్లు అర్హ! వీడియో వైరల్!

కో-ఆర్డినేషన్ మీటింగ్ అనంతరం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని మాట్లాడుతూ.. ‘‘నిర్మాతల వైపు నుంచి నాలుగు ప్రపోజల్స్‌పై చర్చ నడిచింది. అందులో రెండు ప్రతిపాదనలకు ఓకే చెప్పాము. మరో రెండు ప్రతిపాదనలపై మేము యూనియన్స్‌లో చర్చ జరపాలి. ఈ సమస్య‌ను ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లోనే సాల్వ్ చేసుకుంటాం. రేపు శుక్రవారం సెలవు. శనివారం ఛాంబర్ మీటింగ్ ఉండొచ్చు. చిరంజీవి, బాలకృష్ణలు అందరికీ న్యాయం జరిగేలా చూస్తారనే నమ్మకం ఉంది. మేము యధావిధిగా 30 శాతం వేతన పెంపు ఇస్తున్న వారికి షూటింగ్స్ చేస్తున్నాం. చిన్న నిర్మాతల ప్రతిపాదనలపై నిర్ణయం అనేది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తీసుకుంటుంది. చిన్న సినిమాల నిర్మాతలకు మా సపోర్ట్ ఉంటుందని మొదటి నుంచి మేము చెబుతూనే ఉన్నామని తెలిపారు.

కో-ఆర్డినేషన్ చైర్మన్ వీరశంకర్ మాట్లాడుతూ.. నిర్మాతల వైపు నుంచి 4 ప్రతిపాదనలు వచ్చాయి. ఇంకో రెండు మూడు మీటింగ్స్ అనంతరం, మహా అయితే నాలుగైదు రోజుల్లో సమస్యలు పరిష్కారమవుతాయని అనుకుంటున్నాను. నిర్మాతలకు, కార్మికులకు ఆమోదయోగ్యమైన రిజల్ట్ ఉంటుందనే భావిస్తున్నాం. నిర్మాతలెవరూ బాసిజం చేయరు.. కార్మికుల కష్టం వారికి తెలుసు. అలాగే నిర్మాతల పరిస్థితి ఏంటనేది కూడా కార్మికులకు తెలుసు. నిర్మాతల ప్రతిపాదనలు అన్నీ ఎగ్జిస్టింగ్‌గా ఉన్నవే‌‌. తదుపరి మీటింగ్‌లో వేతనాల పర్సంటేజ్ గురించి చర్చలు జరుపుతామని అన్నారు.

Also Read- Rajinikanth Fans: తలైవాపై తనివి తీరని అభిమానం.. గుడికట్టి ప్రత్యేక పూజలు

ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న ఈ ఇష్యూపై దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. అతి త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. సమస్య ఎప్పుడూ అలాగే ఉండిపోదు. నిర్మాతలు చెబుతున్నట్లుగా కార్మికుల జీతాలు నిజంగానే ఎక్కువగా ఉన్నాయి. రోజూ వారి కార్మికులకు, నెల జీతాలు తీసుకునే కార్మికుల జీతాలు కలిపి మాట్లాడవద్దు. నిర్మాత అనేవాడు దేవుడు. నిర్మాత లేకపోతే కార్మికులు బతకలేరు. అందరూ బాగుండాలి. నా అభిప్రాయం ప్రకారం అవసరం ఉన్న వారినే షూటింగ్స్‌కు తీసుకోవాలి. తద్వారా సినిమా బడ్జెట్ తగ్గుతుంది. ఏ సమస్య అయినా త్వరలోనే సాల్వ్ అయిపోతుంది. ఈ రోజు నిర్మాతల విధించిన నాలుగు ప్రతిపాదనలపై చర్చ జరిగింది. డైలీ వేజ్ తీసుకునే వారు.. నెలకు ఎన్ని రోజులు వర్క్ చేస్తారనేది ముఖ్యం. దయచేసి సాఫ్ట్‌వేర్ వాళ్లతో సినీ కార్మికులకు పోల్చవద్దు. అసలా పోలిక అనవసరమైనది. అల్టిమేట్‌గా అందరికీ పని దొరకాలి. అందరూ బాగుండాలి. ఈ వేతన వివాదం అనేది ఫస్ట్ టైమ్ కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే. నిర్మాతలు, కార్మికులు తగ్గి సమస్య సాల్వ్ చేసుకోవాలి. త్వరలోనే అన్ని చక్కబడతాయని నమ్ముతున్నానని తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ