చిత్రం: బ్యూటీ
నటి నటులు: యంగ్ హీరో అంకిత్ కొయ్య, నీలఖి, విజయ నరేష్ కృష్ణ, వాసుకి ఆనంద్, ప్రసాద్ బెహరా, నితిన్ ప్రసన్న, మురళి గౌడ్, నంద గోపాల్, నాగేంద్ర మెడిడా, మరికొందరు కీలక పాత్రల్లో నటించారు.
దర్శకుడు: జె.ఎస్.ఎస్. వర్ధన్.
కథ, స్క్రీన్ ప్లే: ఆర్.వి. సుబ్రహ్మణ్యం
సంగీతం: విజయ్ బుల్గానిన్,
సినిమాటోగ్రఫీ: శ్రీ సాయికుమార్ దారా
ఎడిటింగ్: ఎస్.బి. ఉద్ధవ్. వానరా సెల్యులాయిడ్,
ప్రొడక్షన్ : జీ స్టూడియోస్, మారుతి ప్రొడక్షన్స్
యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో పాటు తండ్రి-కూతురు ఎమోషనల్ బంధాన్ని ఆకట్టుకునేలా చూపించే ప్రయత్నం. అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర జంటగా నటించగా, నరేష్, వాసుకి కీలక పాత్రల్లో కనిపించారు. జె.ఎస్.ఎస్. వర్ధన్ దర్శకత్వంలో, మారుతి టీమ్, జీ స్టూడియోస్, వానరా సెల్యూలాయిడ్స్ బ్యానర్లపై విజయ్ పాల్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 19, 2025న విడుదలైంది.
కథ విషయానికొస్తే..
వైజాగ్‌లో కాలేజీ విద్యార్థిని అలేఖ్య (నీలఖి) తన మధ్యతరగతి కుటుంబంలోని తండ్రి నారాయణ (నరేష్), క్యాబ్ డ్రైవర్, తల్లి (వాసుకి)తో జీవిస్తుంది. తండ్రికి కూతురు అంటే ప్రాణం, ఆమె కోసం తన స్థోమతకు మించి ఖర్చు చేస్తుంటాడు. అలేఖ్య తన పుట్టిన రోజుకు స్కూటీ కావాలని కోరుకుంటుంది. ఈ క్రమంలో ఆమెకు అర్జున్ (అంకిత్ కొయ్య)తో పరిచయం ఏర్పడి, ప్రేమలో పడతారు. అయితే, వారి రొమాంటిక్ సన్నివేశాలు తల్లిదండ్రులకు తెలియడంతో సమస్యలు తలెత్తుతాయి. భయపడిన అలేఖ్య, అర్జున్‌తో కలిసి హైదరాబాద్‌కు పారిపోతుంది. కూతురిని వెతుక్కుంటూ నారాయణ హైదరాబాద్ వెళ్తాడు. సెకండ్ హాఫ్‌లో వచ్చే ఊహించని ట్విస్ట్ కథను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. అలేఖ్య, అర్జున్‌ల ప్రేమకథ ఏమైంది? నారాయణ తన కూతురిని ఎలా కనుగొన్నాడా? అనేది తెరపై చూడాలి.
ప్లస్ పాయింట్స్
ఎమోషనల్ డెప్త్: తండ్రి-కూతురు బంధం, మధ్యతరగతి కుటుంబాల ఆకాంక్షలు హృదయాన్ని తాకేలా చిత్రీకరించారు. నరేష్ నటన సినిమాకు ప్రధాన బలం.
ట్విస్ట్: సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది, కథను కొత్త మలుపు తిప్పుతుంది.
సంగీతం: విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్ గా మారింది. ముఖ్యంగా “కన్నమ్మ కన్నమ్మ”, “ప్రెట్టీ ప్రెట్టీ” పాటలు ఆకట్టుకుంటాయి.
యూత్‌ఫుల్ ఎలిమెంట్స్: యువతను ఆకర్షించే రొమాంటిక్ సన్నివేశాలు, డైలాగ్స్ సినిమాకు బలంగా నిలిచాయి.
మైనస్ పాయింట్స్
రొటీన్ కథ: కథ కొంతవరకు సాంప్రదాయిక లవ్ స్టోరీ ఫార్మాట్‌ను అనుసరిస్తుంది. గతంలో వచ్చిన “పరుగు”, “బుట్టబొమ్మ” వంటి సినిమాలను గుర్తు చేస్తుంది.
ప్రమోషన్ లోపం: సినిమా ప్రమోషన్‌లో ఊపు లేకపోవడం, మారుతి బ్రాండ్‌ను సరిగా వినియోగించుకోకపోవడం బాక్సాఫీస్‌పై ప్రభావం
చూపుతుంది.
సడన్ ఎండింగ్: క్లైమాక్స్ సడెన్ గా ముగించినట్లుగా అనిపించింది. పూర్తి సంతృప్తిని ఇవ్వలేదని అనిపించింది.
రేటింగ్: 2/5