Pourusham: ప్రపంచంలో ఆడవాళ్లు లేకుండా మగవాళ్లు లేరు. వాళ్ల సపోర్ట్‌తో మనం ముందుకెళ్లాలి అనే ఒక బ్యూటీఫుల్ కాన్సెప్టే ‘పౌరుషం’ సినిమా అని అంటున్నారు దర్శకుడు షెరాజ్ మెహ్ది. యూవీటీ హాలీవుడ్ స్టూడియోస్ (యూఎస్ఏ), శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై అశోక్ ఖుల్లార్, దేవేంద్ర నేగి నిర్మిస్తున్న చిత్రం ‘పౌరుషం – ది మ్యాన్‌హుడ్’. షెరాజ్ మెహ్ది దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సుమన్ తల్వార్, మేకా రామకృష్ణ, షెరాజ్, అశోక్ ఖుల్లార్, జ్యోతి రెడ్డి, శైలజ తివారీ, కనిక వంటివారు నటిస్తున్నారు. దర్శకత్వంలో పాటు ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం షేరాజ్ మెహ్దీ అందిస్తున్న ఈ చిత్రానికి డివి ప్రభు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. మార్చి 7న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. టైటిల్ అలా ఉన్నా, ఈ సినిమా ఆడవాళ్ల కోసం, వారికి మరింత గౌరవం ఇచ్చేలా ఉంటుందని ఈ కార్యక్రమంలో మేకర్స్ తెలిపారు.
Also Read- Tamannaah-Vijay varma: తమన్నా-విజయ్ వర్మ బ్రేకప్‌కి కారణమిదే?
ఈ కార్యక్రమంలో దర్శకుడు షెరాజ్ మెహ్ది మాట్లాడుతూ.. ‘‘ఇది నా మనసులో నుంచి వచ్చిన కథ. ఈ సినిమాలోని ప్రతి సీన్ నిద్రలో లేపి అడిగినా చెప్తాను. అంత బాగా ఈ సినిమా నా మైండ్‌లో ఉంది. ఇంతకు ముందు 8 సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేశాను. ఇది నా తొమ్మిదో సినిమా. నిర్మాతలు ఇచ్చిన మద్దతుని ఎప్పటికీ మరిచిపోలేను. ముఖ్యంగా నిర్మాత అశోక్.. నేను ఈరోజు, ఇలా సినిమా తీయగలిగాను అంటే ఆయనే కారణం. ఇది నేను నా కళ్ళతో చూసిన కథ. ఒకరి వల్ల మంచి వాళ్ళు ఎలా బాధ పడతారనే కోణంలో రాబోతోన్న మంచి కంటెంట్ ఉన్న సినిమా. కమర్షియల్ విలువలతో సినిమాలో రొమాంటిక్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా అన్ని అంశాలు ఉన్నాయి. హీరోయిన్ కనికా పాత్ర హైలెట‌్ ఉంటుంది. ఇందులో ఆమె చాలా బాగా నటించింది. అలాగే నటి మధి చిన్న ఏజ్ లోనే స్టార్ స్టేటస్ తెచ్చుకుంది. రవి వర్మ, సుమన్ తల్వార్, జబర్దస్త్ నటీనటులు.. అందరూ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ‘పౌరుషం – ది మ్యాన్‌హుడ్’ సినిమా ప్రతి అమ్మాయికి అంకితం. మార్చి 8న ఉమెన్స్ డే స్పెషల్‌గా ఒక రోజు ముందే సినిమా రిలీజవుతుంది. ప్రపంచంలో ఆడవాళ్లు లేకుండా మగవాళ్లు లేరు. వాళ్ల సపోర్ట్‌తోనే మనం ముందుకెళ్లాలి అనే ఒక బ్యూటీఫుల్ కాన్సెప్ట్ ఈ ‘పౌరుషం’ సినిమా. నిజంగానే పౌరుషంగా ఉంటుంది. అందరూ థియేటర్లలో చూసి ఆశీర్వదించాలి’’ అని కోరారు.

ఈ సినిమాలో హీరోయిన్‌కు అన్నయ్యగా, సుమన్‌కు కొడుకుగా నటించాను. సీనియర్ నటి ఆమని ఇందులో మంచి మెసేజ్ ఇచ్చే పాత్ర చేశారు. పిల్లలు ఎలా ఉండాలనేది చెప్పారు. ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా ఇది. హీరో శివ తాండవం చేశారు. ఇందులో సైన్స్, దేవుడు వేరు వేరు కాదు, రెండూ ఒకటే అని చెప్పిన పాయింట్ చాలా బాగుంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలని తెలిపారు నటుడు గంగాధర్. ‘మార్చి 7న గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం. అందరూ థియేటర్స్‌కి వచ్చి ఈ సినిమా చూడండి’ అని కోరారు నిర్మాత అశోక్ ఖుల్లార్. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ కనిక, నటి మధి ప్రసంగించారు.