balayya warning ( image source :X)
ఎంటర్‌టైన్మెంట్

Nandamuri Balakrishna: వారికి బాలయ్య వార్నింగ్.. దొరికితే దబిడి దిబిడే

Nandamuri Balakrishna: ఈ మధ్య కాలంలో సేవ పేరుతో మోసాలు పెరిగిపోతున్నాయి. తాజాగా నందమూరి బాలయ్య బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పేరుతో మోసం జరగడాన్ని బాలయ్య గమనించారు. ఈ విషయంపై ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ‘బంగారు బాలయ్య – బసవతారకం ఈవెంట్’ పేరిట అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి నా పేరు, బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పేరును అనుమతి లేకుండా ఉపయోగిస్తూ ఈ కార్యక్రమాన్ని విరాళాల సేకరణ కోసం నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను స్పష్టంగా తెలియజేయదలచుకున్న విషయం ఏంటంటే.. ఈ ఈవెంట్‌కు నా అనుమతి లేదు. హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు తరఫున ఎటువంటి అధికారిక ఆమోదం లేదు. కాబట్టి దయచేసి ఈ రకమైన అనధికారిక, తప్పుదారి పట్టించే కార్యక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండండి. బసవతారకం హాస్పిటల్ తరఫున జరిగే అన్ని అధికారిక కార్యక్రమాలు, విరాళాల అభ్యర్థనలు కేవలం ధృవీకరించబడిన, పారదర్శకమైన మాధ్యమాల ద్వారానే నిర్వహించబడతాయి. మోసపూరిత ప్రకటనలు, కార్యక్రమాలను నమ్మి మోసపోవద్దు.’ అంటూ ప్రజలను హెచ్చరించారు.

Read also- Minister Seethakka: సమిష్టి కృషితో అభివృద్ధిలో జిల్లా నిలుపుదాం: మంత్రి సీతక్క

బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ఉంది. దీనికి నందమూరి బాలకృష్ణ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. NABH మరియు NABL గుర్తింపు పొందిన ఈ లాభాపేక్ష లేని సంస్థ, 650 పడకలతో కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, రోబోటిక్ సర్జరీలు, పెడియాట్రిక్ ఆంకాలజీ, పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్, ఆంకో పాథాలజీ, మాలిక్యులర్ టెస్టింగ్ సేవలందిస్తుంది. పేద రోగులకు ఉచిత, సబ్సిడీ చికిత్స, అవగాహన కార్యక్రమాలు, ఉచిత స్క్రీనింగ్ క్యాంపులు, మానసిక మద్దతు, క్యాన్సర్ పరిశోధన మరియు వైద్య విద్యను సమర్థవంతంగా నిర్వహిస్తుంది. ఈ హాస్పిటల్ NABH, NABL గుర్తింపు పొంది 2.5 లక్షల మందికి సేవలందించింది.

Read also- Thummala Nageswara Rao: ఆయిల్ పామ్‌తో రైతులకు ఆర్థిక బలం: తుమ్మల నాగేశ్వరరావు

బాలయ్య బాబు తాజాగా అఖండ 2: తాండవం సినిమాలో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. 2021లో సూపర్ హిట్ అయిన ‘అఖండ’కు ఈ సినిమా సీక్వెల్. బాలయ్య ద్విపాత్రాభినయంలో ఈ చిత్రం సెప్టెంబర్ 25, 2025న దసరా సందర్భంగా విడుదల కానుంది. సంయుక్త, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం, రామ్, లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీతో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లో రామ్ అచంట, గోపీచంద్ అచంట నిర్మిస్తున్నారు. టీజర్‌లో బాలయ్య శివుని సైనికుడిగా శక్తివంతమైన డైలాగులతో, త్రిశూలంతో యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు