Bakasura Restaurant
ఎంటర్‌టైన్మెంట్

Bakasura Restaurant: ‘బకాసుర రెస్టారెంట్‌’.. టైటిల్‌కి తగ్గట్టే ఉంది ఫస్ట్ లుక్!

Bakasura Restaurant: ఫుడ్‌కు సంబంధించి బయట ఎలాంటి వ్యాపారాలైనా త్వరగా క్లిక్ అవుతాయి. అందుకే వీధికో రెస్టారెంట్ వెలుస్తోంది. ఒకప్పుడు చాలా తక్కువగా ఉండేవి కానీ, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇదొక లాభసాటి వ్యాపారంగా చూస్తున్నారు. అందుకే మొబైల్ క్యాంటిన్ మొదలుకుని పెద్ద పెద్ద రెస్టారెంట్స్‌ నిర్మాణాలకు అంతా ఆసక్తి చూపుతున్నారు. మరి ఇలాంటి ఫుడ్ కాన్సెప్ట్‌తోనే సినిమా వస్తే, అందులో మన టాలీవుడ్‌కి చెందిన కమెడియన్స్ అంతా యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అదే ప్రయత్నం చేస్తున్నారు ఎస్‌జే మూవీస్‌ నిర్మాతలు. కమెడియన్ ప్రవీణ్, వైవా హర్ష, ఫణి, కృష్ణభగవాన్ వంటి వారు ప్రధాన పాత్రలలో ఎస్‌జే శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని (Bakasura Restaurant First Look) తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

Also Read- Allu Arjun: ‘వేవ్స్ 2025’లో చిరుపై అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్.. మెగా ఫ్యాన్స్ ఏమంటారో?

వాస్తవానికి కమెడియన్, నటుడు ప్రవీణ్ (Comedian Praveen) పేరుపై ఈ మధ్య రకరకాలుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే, ‘బకాసుర’ అనే రెస్టారెంట్‌తో ఆయన ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నాడనేలా టాక్ వినబడింది. అంతా నిజమేనా అని ఆశ్చర్యపోయారు కూడా. నిజంగా ప్రవీణ్ రెస్టారెంట్ రంగంలోకి దిగుతున్నాడా? అని అనుమానించిన వారు కూడా లేకపోలేదు. వారు అనుమానించినట్లే, ఆయన చేస్తుంది బిజినెస్ కాదు. ఆ పేరు మీద రూపుదిద్దుకున్న సినిమాలో యాక్టింగ్ అనేది ఇప్పుడు క్లారిటీ ఇచ్చింది. ప్రవీణ్‌ ఎక్కడా, ఎటువంటి రెస్టారెంట్‌ను పెట్టడం లేదు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం పేరే ‘బకాసుర రెస్టారెంట్’. తాజాగా వదిలిన ఫస్ట్ లుక్ టైటిల్‌కు తగ్గట్టే ఉండి.. సినిమాపై ఆసక్తిని కలగజేస్తోంది.

ఈ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని గమనిస్తే.. ఇందులో ప్రవీణ్‌ పెద్ద గరిటెతో వంట చేస్తుండటం.. ఆ పక్కనే ఇతర పాత్రలు కొన్ని కనిపిస్తున్నాయి. మరో వైపు కమెడియన్స్ వైవా హర్ష, షైనింగ్‌ ఫణి.. పెద్ద బిర్యానీ ప్లేట్ ముందు కూర్చుని అందులో ఉన్న బిర్యానీని ఆరగిస్తున్నారు. ఆ ప్లేట‌్‌లోకి బళ్లలో బిర్యానీని సర్వ్ చేస్తున్నారు. అంటే ఈ పోస్టర్‌లో ఎవరు బకాసురులో క్లియర్‌గా అర్థమవుతోంది. ఎన్నో విజయవంతమైన చిత్రాలతో మంచి నటుడిగా, కమెడియన్‌గా అందరికి సుపరిచితుడైన ప్రవీణ్‌ ఇందులో బకాసుర రెస్టారెంట్‌‌ని నడిపే పాత్రలో కనిపించనున్నాడనేది ఈ పోస్టర్‌ క్లారిటీ ఇచ్చేస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం సినిమాపై అంచనాలను పెంచేదిగానే ఉంది. ఈ మధ్య ఇలాంటి తరహా చిత్రమైతే ఏదీ రాలేదనే చెప్పుకోవాలి. ఎంటర్‌టైన్‌మెంట్ కావాల్సినంత లోడింగ్ అనేది ఈ ఫస్ట్ లుక్ తెలియజేస్తుంది.

Also Read- Natural Star Nani: నేను కరెక్ట్ అని ప్రూవ్ చేశారు.. పవన్ కళ్యాణ్‌కు థ్యాంక్స్!

ఈ సినిమాను ఎస్‌జే మూవీస్‌ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి నిర్మిస్తున్నారు. పస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. చిత్ర ఫస్ట్‌లుక్‌ విడుదల సందర్భంగా దర్శకుడు ఎస్‌జే శివ మాట్లాడుతూ. ‘‘హంగర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. పూర్తి వినోదాత్మకంగా, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రంలో నేటి యువతరంతో పాటు అన్ని వర్గాలను అలరించే అంశాలున్నాయి. ప్రతి సన్నివేశం అందరికి ఎంతో థ్రిల్‌ను ఇస్తుంది. ప్రవీణ్‌ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాగా నిలిచిపోతుంది. నటుడిగా ఆయనలోని మరో కోణాన్ని ఈ చిత్రంలో చూస్తారు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మా చిత్రం తప్పకుండా నచ్చుతుందనే నమ్మకముందని అన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!