Bakasura restaurant: రొటీన్ కథలకు భిన్నంగా ప్రేక్షకులను నవ్వుల విందు పంచడానికి రాబోతుంది ‘బకాసుర రెస్టారెంట్’ (Bakasura Restaurant). ఈ సినిమా చూసిన వాళ్లకు ఓ మంచి విందు భోజనం ఆరగించిన ఫీల్ కలగబోతుందని చిత్ర టీమ్ చెబుతోంది. తన నటనతో, డైలాగ్ డెలివరితో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాందించుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ ప్రవీణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’. ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్, షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్, ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హంగర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్టు 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమౌతుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని పాటలకు, ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు హీరో సుధీర్‌బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Read also- SKN: ఒక చెట్టు పెంచితే పండ్లు ఇవ్వడమే కాదు.. ఎండిపోయాక కూడా!
సుధీర్ బాబు మాట్లాడుతూ ‘ప్రవీణ్ నాకు వన్‌ఆఫ్ ఫేవరేట్ యాక్టర్. నన్ను ఏ దర్శకుడు అడిగినా నేను ప్రవీణ్ పేరు చెబుతాను. ఏ సినిమా అయినా ఎలా సక్సెస్ చేయాలో తపన పడుతుంటాడు. ప్రవీణ్ ఈ సినిమాతో హీరోగా మారుతున్నాడు. మంచి నటుడే కాదు మంచి వ్యక్తి కూడా. ఈ సినిమా ప్రవీణ్‌కు మంచి బ్రేక్ తీసుకరావాలని అనుకుంటున్నాను. ఈ సినిమాను వినోదమే ధ్యేయంగా నిర్మించిన నిర్మాతకు అభినందనలు. ఈ సినిమాలో నటించిన అందరికి మంచి గుర్తింపు తీసుకరావాలని కోరుకుంటున్నాను. నవ్వు ఎప్పుడూ పోస్ట్‌పోన్ చేయకూడదు. థియేటర్ అంతా ఓ ఫ్యామిలీలా కలిసి ఈ సినిమాను ఎంజాయ్ చేయాలి’ అని అన్నారు.
Read also- Rahul Gandhi: దివంగత నేత అరుణ్ జైట్లీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ
నిర్మాత జనార్థన్ మాట్లాడుతూ ‘ఈ సినిమాకు కథే హీరో.. మంచి కథను దర్శకుడు చాలా బాగా తెరకెక్కించారు.’ అని అన్నారు. దర్శకుడు ఎస్ జే శివ మాట్లాడుతూ ‘విరూపాక్షకు దర్శకత్వ శాఖలో పనిచేశాను. ఆ సినిమా వల్లే నేను దర్శకుడినయ్యాను. ఆ సినిమా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. నా గురించి మా అన్నయ్య నిర్మాతగా మారాడు. ఈ కథకు మంచి సంగీతం కుదిరింది.’ అన్నారు.ప్రవీణ్ మాట్లాడుతూ ‘మా జీవితాలకు టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన ప్రేమకథా చిత్రమ్ హీరో అతిథిగా రావడం ఆనందంగా ఉంది. నన్ను నమ్మి కథలో నన్ను ప్రధాన వస్తువుగా సినిమా తీసిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. వికాస బడిస సంగీతం టాక్‌ఆఫ్ ది టౌన్, టెక్నిషియన్స్ అందరూ ది బెస్ట్ ఇచ్చారు.’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యం రాజేష్, షైనింగ్ ఫణి, వివేక్ దండు, అమర్, రామ్ పటాస్, రమ్య ప్రియ, ప్రాచీ ఠాకూర్, డిఓపీ బాల సరస్వతి, సంగీత దర్శకుడు వికాస్ బడిస, ఎగ్జిక్యూటివ్ నిర్మాత వినయ్ కొట్టి తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.