Celebrity Divorce: నజ్రియా నజీమ్ సౌత్ తో పాటు తెలుగు, మలయాళం, తమిళ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. తెలుగు సినిమాల్లో ఆమె తీసిన రెండు సినిమాల వలన క్రేజ్ తెచ్చుకుంది. అయితే, ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకి సంబందించిన ఓ వార్త సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
మలయాళ సినీ జంట ఫహద్ ఫాజిల్, నజ్రియా విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతుంది. ఈ జంట మలయాళంతో పాటు తెలుగు, తమిళ చిత్రాల్లో కూడా ఫేమస్ అయ్యారు. నజ్రియా తెలుగులో నానితో “అంటే సుందరానికి”, ఆర్యతో “రాజారాణి” వంటి హిట్ చిత్రాల్లో నటించి అభిమానులను సంపాదించుకుంది.
Also Read: Tamannaah – Vijay Varma: తమన్నాకి బిగ్ షాక్ ఇస్తూ.. విజయ్ వర్మ కొత్త లవర్‌ను సెట్ చేసుకున్నాడుగా?
తన కంటే పదేళ్లు పెద్దవాడైన ఫహద్‌ను ప్రేమించి 2014లో వివాహం చేసుకున్న నజ్రియా, సూపర్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. అయితే, ఇటీవల నజ్రియా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడంతో విడాకులు వార్తకు బలం చేకూరింది. ఈ వార్తలపై ఇంత వరకు ఇద్దరూ స్పష్టత ఇవ్వకపోవడంతో, నిజంగానే విడిపోతున్నారనే అనుమానాలు బలపడ్డాయి.
Also Read: Man Vs Leopard: ఆర్ఆర్ఆర్ సీన్ రిపీట్.. తారక్ తరహాలో చిరుతతో సామాన్యుడి ఫైట్.. వీడియో వైరల్!
ఇక సినీ వర్గాలు వారు, గొడవలు లేకపోతే వీళ్ళు ఎప్పుడో ఈ వార్తను ఖండించే వాళ్ళు. సమాధానం లేకపోవడంతో విడాకుల వార్తలు నిజమే అని అనుకుంటున్నారు. ఈ జంట తీసుకున్న నిర్ణయంతో తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు.
Also Read: Salman Khan : అలాంటి ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నా.. కపిల్ శర్మ షోలో సల్మాన్ సంచలన కామెంట్స్
తెలుగు సినీ ఇండస్ట్రీలో సమంత, నాగ చైతన్య విడిపోయిన బాధే ఇంకా పోలేదు. ఇప్పుడు వీరిద్దరూ కూడా విడిపోతే ఫ్యాన్స్ తట్టుకోగలరా? ఇక సినిమాలు కూడా చూడరేమో ? కలిసి ఉండాలని పెళ్లి రోజు ప్రమాణాలు చేసిన ఈ జంటలు ఎందుకు సడెన్ గా విడిపోతున్నారో ఎవరికి అర్ధం కావడం లేదు.