Kuberaa: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మొన్నటి ఎన్నికల్లో గెలిచి, డిప్యూటీ సీఎం కూడా అయ్యాడు కదా.. మళ్లీ ఈ గెలవడం ఏంటి? అనుకుంటున్నారు కదా..! అవును.. పవన్ కళ్యాణ్ మళ్లీ గెలిచాడు. ఇటీవల తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా విడుదల ఉండగా.. థియేటర్ల బంద్ అంటూ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పిలుపునివ్వబోతున్నట్లుగా టాక్ వచ్చింది. అది కూడా పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకు ముందు చేస్తేనే ఉపయోగం ఉంటుందని అంతా మాట్లాడుకున్నట్లుగా ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్‌కు తెలియడంతో ఆయన వెంటనే మీడియా సమావేశం నిర్వహించి ఫైర్ అయ్యారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అఫీషియల్‌గా నాకు రిటర్న్ గిఫ్ట్ బాగా ఇచ్చారు అంటూ.. సినీ పెద్దలపై కౌంటర్స్ వేశారు.
Also Read- The Raja Saab: ‘రాజా సాబ్’ టీజర్ వదిలి తప్పు చేశారా? మారుతి దొరికేశాడు!
అంతేకాదు, ఇకపై టికెట్ల ధరలను పెంచుకునే విషయంలో నన్ను నేరుగా కలవవద్దు అంటూ హుకుం జారీ చేశారు. ఏదైనా సరే, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నుంచి మాత్రమే జరగాలని కండీషన్ పెట్టారు. అది కూడా తన సినిమా నుంచే మొదలవుతుందని కూడా ప్రకటించారు. కాకపోతే ‘హరి హర వీరమల్లు’ చివరి నిమిషంలో వాయిదా పడటంతో.. టికెట్ల ధర విషయంలో ఛాంబర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది మరోసారి ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పుడు ‘కుబేర’ విషయంలో.. చిత్రయూనిట్ కాకుండా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ద్వారా టికెట్ల ధరల పెంపు కోసం ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు వెళ్లినట్లుగా తెలుస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గెలిచినట్లేగా. ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను మాట్లాడేందుకు, ఇండస్ట్రీ తరపు పెద్దలు సీఎం చంద్రబాబుని కలవాలని కూడా పవన్ కళ్యాణ్ సూచించారు. మొదటిసారి చెప్పినప్పుడు అంతా లైట్ తీసుకున్నారు. మొన్న లేఖలో ఘాటుగా ఇవ్వడంతో.. అంతా సీఎంను కలిసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. వాస్తవానికి లాస్ట్ సండేనే అంతా కలవాల్సి ఉంది. కానీ అనూహ్యంగా వాయిదా పడింది.
Also Read- Samantha: సమంతకు చేదు అనుభవం.. వద్దన్నా, అలా వెంటపడుతున్నారేంటి?
ఇప్పుడు ‘కుబేర’ (Kuberaa) టికెట్ల ధరల పెంపు నిమిత్తం, సినిమా యూనిట్ కాకుండా పెద్దరికంగా ఛాంబర్ తరపు నుంచి ధరఖాస్తు వెళ్లడంతో.. ఇండస్ట్రీ తరపు నుంచి కూడా అంతా హర్షిస్తున్నారు. ఇలా కదా.. అసలు జరగాల్సింది. ఇదే కదా.. పవన్ కళ్యాణ్ కోరుకుంది.. అని అంతా కొనియాడుతున్నారు. ఇక ఫ్యాన్స్ అయితే.. ‘నువ్వు తలుచుకో సామి.. నువ్వు తలుచుకుంటే అయిపోతుంది’ అని సినిమా డైలాగ్స్‌తో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ‘కుబేర’ సినిమా విషయానికి వస్తే.. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా కాంబోలో రూపుదిద్దుకున్న ఈ సినిమా జూన్ 20న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తరపున ఏపీ ప్రభుత్వానికి టికెట్ల ధరల పెంపు నిమిత్తం దరఖాస్తు చేరడంతో వెంటనే ప్రభుత్వం అందుకు అనుమతులు ఇస్తూ జీవో జారీ చేసింది. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 75 వరకు పెంచుకునేలా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ధరలు పెంపు, సినిమా విడుదలైన రోజు నుంచి 10 రోజుల వరకు వర్తిస్తుందని, హయ్యర్ క్లాస్ టికెట్స్‌కు మాత్రమే ఈ టికెట్ల ధరల పెంపు వర్తిస్తుందని జీవోలో పేర్కొంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు