Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రస్థానంపై సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా అభినందనలు తెలిపారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు రజనీకాంత్ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ‘కూలీ’ సినిమా ఘన విజయం సాధించాలని ఆయన కోరుతున్నారు. ప్రస్తుతం థియేటర్లలోకి వచ్చిన ‘కూలీ’ సినిమా మిశ్రమ స్పందన రాబట్టుకున్నప్పటికీ, కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఈ సినిమాతో పాటు విడుదలైన ‘వార్ 2’ సినిమాను అధిగమించి కలెక్షన్లు రాబడుతూ.. బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు రజనీకాంత్.
Read also- Pavithra menon: జాన్వీ కపూర్‌పై మలయాళ నటి ఫైర్.. అసలు ఏం జరిగిందంటే?
తాజాగా సూపర్ స్టార్ సినీ ప్రస్థానం గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రజనీకాంత్ కు అభినందనలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఇలా రాసుకొచ్చారు. ‘సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా రంగంలో 50 అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసినందుకు అభినందనలు. ఐకానిక్ నటనతో కోట్లాది మందిని అలరించడమే కాకుండా, సినిమాల ద్వారా సామాజిక సమస్యలపై అవగాహన పెంచారు. ఆయన చిత్రాలు సమాజంలోని కీలక అంశాలపై ఆలోచింపజేసి, అనేక మంది జీవితాలకు దిశా, నిర్దేశాన్ని చేశాయి. మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.’ అంటూ రాసుకొచ్చారు. దీనిపై స్పందించిన రజనీకాంత్ ‘ప్రియమైన చంద్రబాబు నాయుడు, మీ ఆప్యాయమైన మాటలు హృదయపూర్వక శుభాకాంక్షలు నన్ను ఎంతగానో కదిలించాయి. మీ సందేశం నాకు చాలా విలువైనది. మీ వంటి వ్యక్తుల ప్రేమ స్నేహంతో, సినిమా ద్వారా నా ఉత్తమ ప్రదర్శనను కొనసాగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.’ అంటూ రాసుకొచ్చారు.
Read also- RGV – Chiranjeevi: చిరంజీవితో సినిమా క్యాన్సిల్ అవడానికి కారణం ఎవరంటే..?
రజనీకాంత్ స్వర్ణోత్సవ సినిమా
రజనీకాంత్ (Rajinikanth)తన 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని జరుపుకుంటున్న సమయంలో, ఆయన నటిస్తున్న కూలీ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రాన్ని యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కలానిధి మారన్ నిర్మించారు. ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు నాగార్జున అక్కినేని, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శృతి హాసన్ వంటి తారాగణం నటిస్తోంది. సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.