Anasuya: యాంకర్, నటి అనసూయ ఏడుస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ ఫొటోలను స్వయంగా అనసూయ తన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసింది. ఎప్పుడూ హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసే అనసూయ, ఈసారి మాత్రం చక్కగా, సాంప్రదాయబద్దంగా ఉన్న ఫొటోలతో అందరి అటెన్షన్ పొందుతోంది. ఆమె అలా కనిపించడానికి కారణం లేకపోలేదు. ఆమె నూతన గృహ ప్రవేశం చేశారు. తన కుటుంబంతో కలిసి నూతన గృహ ప్రవేశ వేడుకను జరుపుకున్న అనసూయ, ఒక ఫొటోలో ఏడుస్తున్నట్లుగా ఉంది. అలాంటి సంతోష సమయంలో అనసూయ ఎందుకు ఏడుస్తుందనేది ఎవరికీ అర్థం కాలేదు. దీంతో అందరూ ఆమెను ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఒకవైపు శుభకార్యం జరుగుతుంటే, నువ్వేంటి అలా ఏడుస్తున్నావు? అంటూ అందరూ అడుగుతుండటంతో.. అనసూయ ఆ మూమెంట్‌కి ఉన్న సందర్భాన్ని తెలియజేసింది.
Also Read- Bigg Boss Season 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హోస్ట్‌పై కీలక అప్డేట్!
‘‘ఈ ఫొటో వెనుక పెద్ద కథే ఉంది. అది మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మే 3న మేము మా నూతన గృహంలో కొన్ని పూజలు జరిపించాం. హోమాలు, వ్రతం, రుద్రాభిషేకం వంటివి జరిపించాం. మా గురువుగారికి మా ఇష్టదైవం అయిన ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ ఇంటికి ‘సంజీవని’ అని పేరు పెట్టాలని అనుకుంటున్నట్లుగా చెబితే, ఆయన ‘శ్రీరామ సంజీవని’ అని పెట్టమన్నారు. మేమంతా ఎంతో సంతోషించాం. ఆయన హోమం జరిపిస్తుండగా, మేము వాస్తు పురుషుడు, ధర్మపత్ని పూజ వంటివి చేయడానికి మరో గదిలోకి వెళ్లాం. ఓ 20 నిమిషాల తర్వాత గురువుగారు వచ్చి, తన ఫోన్‌ని చూపించి.. ఇటు చూడమ్మా.. ‘ఆంజనేయుడు వచ్చాడు’ అని అన్నారు. అంతే ఇంక నాకు కళ్లలో నీరు ఆగలేదు. నిజంగా ఆ ఫొటోలో ఆంజనేయుని చూసి ఆశ్చర్యపోయాను. ఆ స్వామి అనుగ్రహం లభించినట్లుగా ఫీలై నాకు తెలియకుండా కళ్లలో నీళ్లు వచ్చేశాయి.
Also Read- Vishal Marriage: రజనీకాంత్ కుమార్తెతో హీరో విశాల్ పెళ్లి? అది దా సర్‌ప్రైజ్!
మా ఇంటిలో ఏది జరిగినా ముందు ‘జై హనుమాన్’ అని తలుచుకుంటాం. అది మా నాన్నగారి నుంచి నేర్చుకున్న గొప్ప విషయం. నేను కూడా సంతోషం, దు:ఖం, అనారోగ్యం.. ఇలా ఏ విషయమైనా సరే.. ‘జై హనుమాన్’ అని తలుచుకోకుండా ఏదీ చేయను. ఆంజనేయుడిని నా తండ్రిగా భావిస్తాను. ఇది నా బంధువులందరికీ తెలుసు. ఆయన పేరు వచ్చేలా నా పెద్ద కుమారుడికి ‘శౌర్య’ అని పేరు పెట్టాను. ముక్కోటి దేవతలకు వార్తహరుడైన అగ్నిదేవుడి రూపంలో ఆ రోజు హోమంలో ఆంజనేయుడు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినట్లుగా మేమంతా భావించాం. ఎవరు నమ్మినా, నమ్మకపోయినా నాకు ఎదురైన ఆ దేవుడి దర్శనభాగ్యాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని అనిపించింది. ప్రహ్లాదుడు చెప్పినట్లుగా అందుగలడిందులేడని సందేహం వలదు.. ఎందెందువెతికినా అందతడే గలడు’’ అంటూ అనసూయ తన భావోద్వేగానికి కారణమేంటో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్‌లు, షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు