Amrutha Pranay: అమృత ప్రణయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఆమె గత రెండేళ్ల నుంచి సోషల్ మీడియాలో కామెంట్స్ అన్ని ఆఫ్ చేసింది. దీంతో ఆమె అందరికి దూరంగా ఉన్నారు. తాజాగా, ఆమె ఓ వీడియో రిలీజ్ చేసింది. దానిలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం, ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
అమృత ప్రణయ్ మాట్లాడుతూ ” నేను చాలా డిస్టర్బ్ అవ్వడం వలన సోషల్ మీడియాలోకి రాలేక పోయాను. ఇంత దూరం సపోర్ట్ చేస్తూ వచ్చారు కదా.. పాజిటివ్ గా తీసుకుని మాట్లాడేవాళ్ళకి నేను కచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి.. రిప్లై ఇవ్వాలి.. మాట్లాడుతూ ఉండాలని నిర్ణయం తీసుకున్నా అని చెప్పింది. నా నుంచి మీరు తెలుసుకోవాలనుకునే ప్రశ్నలు ఇంస్టాగ్రామ్ లో అడగండి అని పెట్టాను కదా .. అయితే, చాలా మంది ప్రశ్నలు అడిగారు. వాటికీ ఈ రోజు జవాబులు ఇస్తున్నాను అంటూ సంచలన వీడియో రిలీజ్ చేసింది. మరి ఆమె ఏవేం చెప్పిందో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read- Singer kousalya: నాకు అవకాశాలు రాకుండా తొక్కేశారు .. సింగర్ కౌసల్య షాకింగ్ కామెంట్స్
నా సమాధానాలు ఇవే..
కుకింగ్ అయిపోయిన తర్వాత మీరేం చేస్తారు ?
కుకింగ్ అయిపోవగానే తినేసి చాలా మంది నిద్ర పోతారు. కానీ, నేను అలా కాదు. వంట అయిపోయిన వెంటనే ముందు ఫేస్ వాష్ చేసుకుంటాను. సమ్మర్లో వేడికి చెమట ఎక్కువగా వస్తుంది. ఆ టైం లో చిరాకుగా ఉంటుంది. కాబట్టి నేను వెంటనే రిఫ్రెష్ అవ్వాలనుకుంటాను అని చెప్పింది.
సోషల్ మీడియాకి ఎందుకు దూరంగా ఉన్నారు?
యూట్యూబ్ నుంచి నేను దూరంగా వెళ్ళలేదు. నేను జస్ట్ బ్రేక్ తీసుకున్నాను. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నేను ఎక్కువ సోషల్ మీడియాలో లేను.. అలా వచ్చి వెళ్తూ ఉండేదాన్ని. కానీ, ఈ సారి ఎక్కువ బ్రేక్ కావాలనిపించింది. ఆల్మోస్ట్ వన్ మంత్ బ్రేక్ తీసుకున్నాను. మధ్య మధ్యలో షార్ట్స్ ఉంటే పెట్టాను. చిన్న షార్ట్స్ మాత్రమే పెట్టాను. పెద్ద వ్లాగ్స్ ఏం పెట్టలేదు. యూట్యూబ్ చేయడం మానేయలేదు. కొంచం టైం కావాల్సి వచ్చి తీసుకున్నాను. బ్రేక్ తీసుకుని మళ్లీ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. నేను బావున్నాను, నా కొడుకు బావున్నాడు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా బావున్నామని తెలిపింది.
Also Read- Gold Rate Today : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన గోల్డ్ రేట్స్
మీ ఫ్రెండ్స్ కి ఎందుకు టచ్ లో లేరు ?
నేను ఏ ఫ్రెండ్స్ ని మర్చిపోలేదు. నేను బిజీ అని కూడా చెప్పను. ఒక టైం ఉంటుంది మనకు .. ఆ సమయంలో అందరూ గుర్తు ఉంటారు. అందరూ కావాలి కూడా.. అందరితో మాట్లాడాలనిపిస్తుంది. కానీ, మాట్లాడే మూడ్ ఉండదు. ఒంటరిగా ఉండాలి. ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా మన పని మనం చేసుకుంటే చాలు అని అనిపించే టైం ఉంటుంది. నాకు ఇది అనుకుంటా .. మళ్లీ అందరికీ టచ్ లోకి వస్తా అని ఆమె మాటల్లో చెప్పింది.
ఇంస్టాగ్రామ్ లో నేమ్ ఎందుకు మార్చారు?
నా వ్యక్తిగత జీవితం మీద ఎందుకు పడ్డారో నాకు తెలీదు. కానీ, అందరికీ తెలియని విషయం ఏంటంటే నేను ఐదు నెలల క్రితమే పేరు మార్చుకున్నాను. కానీ, గైడ్ లైన్స్ ప్రకారం టైం పట్టింది. నేను నా పేరే కదా పెట్టుకున్నాను. దీనిని ఎందుకు తప్పుబట్టారు. అమృత వర్షిణి నా పేరు అది.. నా సొంత పేరు కూడా.. ఫస్ట్ నుంచి నా పేరు అది. అలాగే పుట్టినప్పటి నుంచి పెట్టిన పేరు అది. అన్ని సర్టిఫికెట్స్ లో నా పేరు అదే ఉంటుంది. నా సొంత పేరు నాకు మార్చుకునే హక్కు కూడా లేదా అంటే ఆ ప్రశ్నకి నేనేం మాట్లాడలేను. ఇప్పటికైనా ఎందుకు మార్చానో మీ అందరికి అర్ధం అయ్యే ఉంటుంది అనుకుంటున్నాను అని అన్నది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు