Chiranjeevi: తెలుగు సినీ ఇండస్ట్రీలోగత కొంత కాలం నుంచి వరుస మరణాలు చూస్తున్నాం. అయితే, తాజాగా జరిగిన ఘటనతో మళ్లీ విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నం (94) ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, చివరకు వయసు మీదపడటంతో తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలియగానే, ముంబైలో అట్లీ దర్శకత్వంలో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ వెంటనే హైదరాబాద్‌కు బయలుదేరారు. అల్లు కనకరత్నం అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం కోకాపేటలో జరగనున్నాయి. ఈ ఘటనతో సినీ ఇండస్ట్రీలో విషాద వాతావరణం నెలకొంది. అల్లు కనకరత్నం మరణవార్త సినీ ప్రముఖులను కలిచివేసింది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి తన సంతాపాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
ఆయన తన ఎక్స్ లో ” మా అత్తయ్య గారు.. కీ.శే అల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నమ్మ గారు శివైక్యం చెందటం ఎంతో బాధాకరం. మా కుటుంబాలకు ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతిః ” అని రాసుకొచ్చారు.
Also Read: Bhupalapally Shocking: అడవిలో యువతి దారుణ హత్య.. కుళ్లిన స్థితిలో మృతదేహాం.. అఘాయిత్యం చేసి చంపారా?