Little Hearts: పుష్పరాజ్ మనసు గెలుచుకున్న లిటిల్ హార్ట్స్..
allu-arjun(image source :X)
ఎంటర్‌టైన్‌మెంట్

Little Hearts: పుష్పరాజ్ మనసు గెలుచుకున్న లిటిల్ హార్ట్స్.. లాభాలు ఎంతో తెలుసా?

Little Hearts: తెలుగు సినిమా ప్రపంచంలో ఇటీవల మల్టీస్టారర్ యాక్షన్ బ్లాక్‌బస్టర్లు, భారీ బడ్జెట్ ఫిల్ములు డామినేట్ చేస్తున్నప్పటికీ, చిన్న బడ్జెట్ రొమాంటిక్ కామెడీలు కూడా ఆడియన్స్ హృదయాలు గెలుచుకుంటున్నాయి. సెప్టెంబర్ 5న విడుదలైన ‘లిటిల్ హార్ట్స్’ సినిమా ఇందుకు ప్రధాన ఉదాహరణ. యూట్యూబర్ మౌళి తనుజ్ ప్రశాంత్ హీరోగా, శివాని నగరం హీరోయిన్‌గా నటించిన ఈ చిన్న ఫిల్మ్, పూర్తిగా యూత్‌కి తగిన ఫన్, లవ్ స్టోరీని అందించింది. డైరెక్టర్ సాయి మార్తాండ్ రాసి, డైరెక్ట్ చేసిన ఈ మూవీ, ప్రొడ్యూసర్ ఆదిత్య హసన్ చేత ETV విన్ బ్యానర్‌లో రూపొందింది. సూపర్‌స్టార్ అల్లు అర్జున్ ఈ ఫిల్మ్ చూసి, తన ట్విటర్లో ప్రశంసలు కురిపించారు.

Read also-CM Revanth Reddy: గుడ్ న్యూస్.. ఆ ప్రాంతాల్లోనే కొత్త రైల్వే లైన్లు.. సీఎం రేవంత్ వెల్లడి

అల్లు అర్జున్ తన X హ్యాండిల్ నుంచి ఒక పోస్ట్‌లో ఇలా రాశాడు.. “లిటిల్ హార్ట్స్ నిన్న చూశాను.. ఏమి సరదా, అదొక నవ్వుల రైడ్! ఎలాంటి మెలోడ్రామా లేదు,.. పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్. చాలా ఫ్రెష్, యంగ్ లవ్ స్టోరీ. మౌళి బ్లాస్ట్ చేశాడు, శివాని నాగారం స్వీట్ ప్రెజెన్స్, స్నేహితులు & ఇతర ఆర్టిస్టుల క్యాండిడ్ పెర్ఫార్మెన్స్‌లు అద్భుతం. డైరెక్టర్ మార్తాండ్ సాయి పని చాలా ఇష్టపడ్డాను. మ్యూజిక్ రిఫ్రెషింగ్. యావత్తు టీమ్‌కి కంగ్రాట్స్. ఈ స్పెషల్ ఫిల్మ్‌ని థియేటర్స్‌కి తీసుకొచ్చిన బన్నీ వాస్ కి కృతజ్ఞతలు.” అని రాసుకొచ్చారు. ‘పుష్ప: ది రూల్’ సక్సెస్‌తో బిజీగా ఉన్న అల్లు అర్జున్, ఇలాంటి చిన్న ఫిల్మ్‌కి ప్రశంసలు కురిపించడం టీమ్‌కి భారీ బూస్ట్ ఇచ్చింది. అతను మౌలి పెర్ఫార్మెన్స్‌ని ‘బ్లాస్ట్’ అని, డైరెక్టర్ సాయి మార్తాండ్ పనిని ‘లవ్డ్’ అని, సింజిత్ యెర్రమిల్లి మ్యూజిక్‌ని ‘రిఫ్రెషింగ్’ అని ప్రత్యేకంగా పేర్కొన్నాడు. ఈ ప్రశంసలు సినిమాకి పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్‌కి మరింత ఊపు జోడించాయి.

Read also-Raghava Lawrence: దాతృత్వం చాటుకున్న రాఘవ లారెన్స్.. ఏం చేశాడంటే?

వీకెండ్ తర్వాత కూడా కలెక్షన్స్ డ్రాప్ కాకుండా స్టెడీగా ఉన్నాయి. డే 4 (మంగళవారం) ₹2.30 కోట్లు (ఇండియా నెట్), ఆక్యుపెన్సీ 41.26%. మండే (డే 4) కలెక్షన్స్ ఫ్రైడే (డే 1) కంటే ఎక్కువగా ఉండటం స్పెషల్ – ₹2.30 కోట్లు vs ₹1.35 కోట్లు! ఇది వర్డ్ ఆఫ్ మౌత్ పవర్ చూపించింది. డే 5 (బుధవారం) ₹2.25 కోట్లు, ఆక్యుపెన్సీ 39.07%. డే 6 (గురువారం) ₹1.85 కోట్లు, ఆక్యుపెన్సీ 31.82%. డే 7 (శుక్రవారం) ₹0.38 కోట్లు (ప్రీలిమినరీ), ఆక్యుపెన్సీ 21.03%. 4 రోజుల్లో మొత్తం ఇండియా నెట్ ₹9.60 కోట్లు, 5 రోజుల్లో ₹11.55 కోట్లు (AP/తె.లు.లో), ROI+ఓవర్సీస్ ₹6.95 కోట్లు – వరల్డ్‌వైడ్ ₹18.50 కోట్లు గ్రాస్. 6 రోజుల్లో ₹21 కోట్లు+ గ్రాస్, ₹8.3 కోట్లు ప్రాఫిట్ వచ్చిందని అంచనా.

Just In

01

Premante OTT Release: ప్రియదర్శి ‘ప్రేమంటే’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

VH Hanumantha Rao: బీసీ రిజర్వేషన్లపై.. బీజేపీ ఓబీసీ ఎంపీలు మౌనమేల: వీహెచ్ ఫైర్

Lipstick: మీ స్కిన్ టోన్‌కి అద్భుతంగా కనిపించే లిప్ స్టిక్ షేడ్స్.. డే-టు-డే నుండి పార్టీ లుక్ వరకు

New Year Party: న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్.. నగరానికి చేరుస్తున్న పెడ్లర్లు డెడ్​ డ్రాప్​ పద్దతిలో..!

Nagababu Politics: అక్కడ ఫోకస్ పెట్టేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఫోకస్ తగ్గించుకుంటున్న మెగా బ్రదర్..