Allu Arjun | ప్రపంచస్థాయి ఘనత సాధించిన అల్లు అర్జున్ ..!
Allu Arjun
ఎంటర్‌టైన్‌మెంట్

Allu Arjun | అల్లు అర్జున్ ప్రపంచస్థాయి ఘనత.. ఇండియాలో తొలి హీరోగా రికార్డు..!

Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ అమాంతం పెరుగుతోంది. పుష్ప (puahpa) సిరీస్ తర్వాత దేశ వ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా కూడా మనోడికి గుర్తింపు లభిస్తోంది. ఇప్పటికే ఎన్నో రికార్డులు కొల్లగొడుతున్న బన్నీ.. తాజాగా మరో అరుదైన ఘనత అందుకున్నాడు. ఏకంగా హాలీవుడ్ ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీపై ఆయన ఫొటో ముద్రించారు. హాలీవుడ్ లో ప్రముఖ మ్యాగజైన్ అయిన ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ ఇప్పుడు ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ (the hollywood reporter india)పేరుతో ఇండియాలోకి అడుగు పెట్టింది. దీని మొదటి సంచిక అల్లు అర్జున్ ఫొటోతో రాబోతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోషూట్ కూడా కంప్లీట్ చేశారు.

ఇందుకు సంబంధించిన ఓ బీటీఎస్ ప్రోమో వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో అల్లు అర్జున్ కొన్ని విశేషాలను కూడా పంచుకున్నారు. ‘ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నా. నా లైఫ్ లో దొరికిన అతిపెద్ద అవకాశం ఇదే. బలం, ఆత్మవిశ్వాసం నన్ను నటుడిగా నిలబెట్టాయి. కొన్ని లక్షణాలు పుట్టుకతోనే వస్తాయి. ఇది కూడా అలాంటిదే. నేను ఎంత ఎదిగినా సామాన్యుడిగా వినయంగా ఉండటం నేర్చుకున్నా. అలాంటి వారిని ఎంతో మందిని చూశాను. సినిమా చూస్తూ చాలా విషయాలు నేర్చుకుంటాను. బ్రేక్ సమయంలో కచ్చితంగా రెస్ట్ తీసుకుంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్.

దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో మ్యాగజైన్, వీడియోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ నానా రచ్చ చేస్తున్నారు. బన్నీ పుష్ప–2తో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. పుష్ప–2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూలు చేసింది. బాహుబలి–2 తప్ప ఇప్పటి వరకు ఏ తెలుగు హీరో సినిమా కూడా ఇంత బాగా వసూలు చేయలేదు. ఈ మూవీతో ఎంత పేరు తెచ్చుకున్నాడో.. అంతే వివాదంలో చిక్కుకున్నాడు బన్నీ. సంధ్య థియేటర్ ఘటనతో ఏకంగా జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. దాని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. తన తర్వాత సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తాను చేయబోయే తర్వాత సినిమా కోసం అల్లు అర్జున్ ప్రిపేర్ అవుతున్నాడు.

 

 

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?