Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేడు పుట్టిన రోజు సందర్భంగా బన్నీ ఫ్యాన్స్ కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చేశారు. గత కొన్నేళ్ల నుంచి తమిళ స్టార్ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ ఓ మూవీ చేయబోతున్నాడనే వార్తలు చాలానే వచ్చాయి. అయితే, ఈ రోజు దీనిపై బిగ్ అప్డేట్ వచ్చేసింది.
Also Read: jagtial mango farmers: దళారుల దందా నిలిపివేయండి .. మా మొర ఆలకించండి.. కలెక్టర్ కు రైతుల విన్నపం
అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ మూవీ రాబోతున్నట్టు అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. చూడబోతుంటే ఇది బిగ్ బిగ్ ప్రాజెక్ట్ లా అయ్యేలా ఉంది. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఇదే విషయాన్ని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇది మాత్రం ఊహించ లేదనే చెప్పుకోవాలి.
Also Read: Sreeleela: ఆకతాయిలు చేసిన పనితో శ్రీలీల షాక్.. పబ్లిక్‌లో అలా లాక్కెళ్లిపోయారేంటి? వీడియో వైరల్!
” పుష్ప 2 ” తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో ప్రేక్షకులకు ఈ ప్రాజెక్ట్ పైన భారీ అంచనాలే ఉన్నాయి. ఇది అల్లు అర్జున్ సినీ కెరీర్‌లో 22వ సినిమాగా, అట్లీ కెరీర్‌లో 6వ మూవీగా తెరకెక్కుతుంది. ఈ వీడియోలో ఇంటర్నేషనల్ హాలీవుడ్ టెక్నీషియన్స్ కనిపించడంతో భారీ గానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే, అల్లు అర్జున్ మోషన్ క్యాప్చర్ ఎక్స్పరిమెంట్స్ చూస్తుండడంతో అసలు ఏం ప్లాన్ చేస్తున్నారో ఎవరికీ అర్ధం కావడం లేదు. మొత్తానికి, ఈ సెన్సేషనల్ కాంబోలో ఎవరూ ఊహించని ప్రాజెక్ట్ మన ముందుకు రాబోతుందని చెప్పకనే చెప్పాల్సిందే.
Also Read: Telangana RTC: ఆర్టీసీలో ఏడడుగుల బుల్లెట్.. అతడిపై సీఎం రేవంత్ ఫోకస్.. మంత్రి కీలక ఆదేశాలు!