Allari Naresh: తన అన్నయ్య గురించి చెప్పిన అల్లరి నరేష్..
allari-naresh(image :X)
ఎంటర్‌టైన్‌మెంట్

Allari Naresh: తన అన్నయ్య గురించి ఎవరికీ తెలియని నిజాలు చెప్పిన అల్లరి నరేష్.. అందుకే సినిమాలకు దూరం అయ్యాడా!

Allari Naresh: అల్లరి సినిమాతో వెండి తెరకు పరిచయమైన నరేష్ ఆ సినిమా తర్వాత ఆ సినిమా పేరునే తన ఇంటి పేరు కింద మార్చేసుకున్నారు. ఒకప్పుడు కామెడీ సెంటిమెంట్ సినిమాలకు కేరాఫ్ గా మారిన ఈ అల్లరోడు గత కొంత కాలంగా సీరియస్ సినిమాలు తీసి తన నటనా ప్రతిభను ప్రేక్షకుల ముందు చూపిస్తున్నారు. తాజాగా అదే కోవలో నుంచి వచ్చిన మరో సినిమా 12ఏ రైల్వేకాలనీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేక పోయింది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా తన అన్నయ్య ఆర్యన్ రాజేష్ గురించి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలు ఆర్యన్ రాజేష్ సినిమాలకు ఎందుకు దూరం అయ్యారు. మళ్లీ ఎలా కంబ్యాక్ చేయాలనుకుంటున్నారు. ఎలాంటి పాత్ర వస్తే ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అన్న వాటి గురించి చెప్పుకొచ్చారు. అంతే కాకుండా అందరూ కలిసి ఉండాలి అనే ఈవీవీ సత్యనారాయణ సిద్ధాంతాన్ని పట్టించుకోకుండా అల్లరి నరేష్ దూరంగా ఎందుకు ఉంటున్నారు చెప్పుకొచ్చారు.

Read also-Pet Detective: అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ‘ది పెట్ డిటెక్టివ్‌’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధి అల్లరి నరేష్ ను ‘మీ అన్న అయిన ఆర్యన్ రాజేష్ సినిమాల్లోకి మళ్లీ ఎందుకు రావడంలేదు, అని అడిగారు. దీనికి ఆయన సమాధానం ఇస్తూ.. మా అన్నయ్య ఆర్యన్ రాజేష్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన ఎవరితో ఎక్కువ మాట్లాడటానికి ఇష్టపడడు. కొన్ని రోజుల పాటు ఆయన్ని పరిశీలిస్తేనే గానీ ఆయన గురించి ఒక అవగాహన రాదు. ఎందుకో కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నారు. అంతే అక్కడి నుంచి మళ్లీ గ్యాప్ వస్తూనే ఉంది. ఇప్పటికీ ఆయన సినిమాలు వింటూనే ఉంటారు. కానీ ఆయన్ని ఇంప్రస్ చేసే స్క్రిప్ట్ ఒక్కటీ రావడంలేదు. మంచి కథలు వస్తే ఆయన చేయడానికి ఎప్పుడూ ముందే ఉంటారు. ముఖ్యంగా ధ్రువ సినిమాలో అరవింద్ స్వామి పాత్ర అంటే ఆయనకు చాలా ఇష్టం అలాంటి పాత్రలు వస్తే ఆయన తప్పకుండా చేస్తాడు, అంటూ చెప్పుకొచ్చారు.

Read also-Akhanda 2: బాలయ్య ‘అఖండ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ .. వెన్యూ ఎక్కడంటే?

అంతే కాకుండా తన కుంటుంబం గురించి కూడా కొన్ని విషయాలు ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా తన కుటుంబం అంతా ఎందుకు కలిసి లేదో కూడా చెప్పుకొచ్చారు. తను దూరంగా ఉండటానికి కారణం తన కూతురు చదువే అని అన్నారు. తన కూతురు శంషాబాద్ లో చదువుకుంటుందని ఇంటికి వచ్చి వెళ్లడానికి దాదాపు గంటన్నర సమయం పడుతుందని అందుకే అక్కడ ఇల్లు కూడా ఉండటంతో అక్కడే ఉండిపోయానన్నారు. దీంతో తన గురించి ఏవేవో అనుకునే వారికి సరైన సమాధానాలు దొరికాయి. అంతే కాకుండా తన దగ్గర ఉన్న సిబ్బందిని ఎలా చూసుకుంటారో కూడా చెప్పుకొచ్చారు. దాదాపు అందరూ ఇరవై ఏళ్లుగా తన దగ్గరే పనిచేస్తున్నారన్నారు. ఇవన్నీ తెలియడంతో ఆయనపై ఉన్న అభిమానం ప్రేక్షకుల్లో మరింత పెరిగింది. ఇదే సందర్బంలో సీరియస్ పాత్రలే కాకుండా మళ్లీ రెండు కామెడీ సినిమాలు చేయబోతున్నాన్ని అవి రెండు పెద్ద సినిమాలకు స్పూఫ్ లుగా ఉంటాయన్నారు. దీంతో అభిమానులు అల్లరి నరేష్ ను మళ్లీ తన జోనర్ లో చూసేందుకు కుతూహలంగా ఉన్నారు.

Just In

01

Srinivas Goud: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Balakrishna: బోయపాటి నోటి వెంట చిరు, ప్రభాస్ పేరు.. హర్టయిన బాలయ్య!

Tollywood: రషా తడానీ, హర్షాలి.. నెక్ట్స్ టాలీవుడ్‌ను ఊపేసే భామలు వీరేనా?

Sahakutumbanam: తన ఫ్రెండ్ చనిపోతే.. ఆసక్తికర విషయం చెప్పిన బుచ్చిబాబు సానా!

Jailer 2: ‘జైలర్ 2’లో గెస్ట్ రెల్ చేసేది బాలయ్య కాదట.. ఎవరంటే?