Akhil Akkineni ( Image Source : Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Akhil Akkineni: బీచ్ ఒడ్డున కాబోయే భార్యతో అలాంటి పనులు చేస్తున్న అఖిల్.. వైరల్ అవుతున్న ఫోటోలు

Akhil Akkineni: అక్కినేని నాగార్జున చిన్న కొడుకుగా టాలీవుడ్లోకి అడుగుపెట్టిన అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే, అఖిల్ సినిమాలు చేస్తున్నప్పటికీ ఇంత వరకు సరైన హిట్ పడలేదు. తీసిన కొన్ని సినిమాల్లో డిజాస్టర్ అవ్వగా, ఒకటో రెండో చిత్రాలు యావరేజ్ గా నిలిచాయి. ఇక , తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో సమస్యలు వచ్చాయి. మొదటి పెళ్లి మధ్యలోనే ఆగిపోవడంతో కొన్నాళ్ళు ఎవరికీ కనిపించలేదు. చాలా గ్యాప్ తీసుకుని సినిమాలు చేశాడు కానీ, మంచి ఫలితం అయితే రాలేదు. ఇదిలా ఉండగా, అఖిల్ కి సంబందించిన వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

గతేడాది అఖిల్ , జైనబ్ రవ్జీ అనే ఓ అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నారు. అయితే, తాజాగా  పెళ్ళికి ముందే భార్యతో అఖిల్ వెకేషన్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పుడు, వీరి వివాహానికి సంబంధించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. బీచ్ దగ్గర జైనాబ్ రవ్జీని, అఖిల్ హాగ్ చేసుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ ను షేర్ చేస్తూనువ్వే నా స‌ర్వ‌స్వం ” అనే క్యాప్షన్ పెట్టి పోస్ట్ చేశాడు. ఫొటోస్ చూసిన అక్కినేని ఫ్యాన్స్సూపర్ జోడిఅంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరుపెళ్లికి ముందే బీచ్ దగ్గర ఇలాంటి పనులేంటిఅంటూ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.

ఒక పెద్ద హిట్ అఖిల్ కి పడితే సినీ ఇండస్ట్రీలో ఇక సెటిల్ అయిపోవచ్చు . చాలా కష్ట పడి ‘ఏజెంట్’ సినిమా చేశాడు. కానీ, చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు మళ్లీ ” లెనిన్ ” అనే కొత్త సినిమాతో మన ముందుకు వస్తున్నాడు.

Just In

01

IAS Shailaja Ramaiyer: కమిషనర్ శైలజా రామయ్యర్ కు కీలక బాధ్యతలు..?

Mahabubabad District: యూరియా టోకెన్ల కోసం కిక్కిరిసి పోయిన రైతులు.. ఎక్కడంటే..?

Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?

Gadwal District: జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం.. నది ప్రవాహంలో బాలుడు గల్లంతు

Bigg Boss 9 Telugu Promo: డబుల్ హౌస్ తో.. డబుల్ జోష్ తో.. ప్రోమో అదిరింది గురూ!