Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అఖండ 2 తాండవం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇంకా కేవలం ఐదు రోజులు మాత్రమే ఉంది. డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్దమవుతున్న ఈ సినిమాలో, ఒక రోజు ముందే అంటే డిసెంబర్ 4 సాయంత్రం నుంచే ప్రీమియర్ షోలు ప్లాన్ చేసినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బాలయ్య కెరీర్‌లో ఇదే మొదటి 3డీ సినిమా అవ్వడంతో భారీ అంచనాలున్నాయి. బోయపాటి దర్శకత్వంలో మళ్లీ ఆగని మాస్ తాండవాన్ని చూపబోతున్నారనే నమ్మకం. ఈ రెండూ కలిసి సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేశాయి. అఖండ వంటి మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందో లేదో చూడాలనే ఉత్కంఠ ఫ్యాన్స్‌లో మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకుల్లో కూడా కనిపిస్తోంది.
ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి పోస్టర్, టీజర్, ట్రైలర్ ఈ ప్రాజెక్ట్‌ను మరింత హైప్ కు తీసుకెళ్లాయి. అఖండలాంటి సెన్సేషనల్ విజయానికి సీక్వెల్‌గా రావడం సినిమాకు ఒక భారీ బూస్ట్ అయితే, బాలయ్య–బోయపాటి హ్యాట్రిక్ కాంబో మరో లెవెల్ హైప్ ఇచ్చింది. ఇదివరకే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచింది. అదే జోరుతో సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా అత్యంత భారీ స్థాయిలో క్లోజ్ అయిందని ఇండస్ట్రీ టాక్. నైజాం ఏరియాలో రూ.27 కోట్లు, సీడెడ్‌లో రూ.24 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.13.50 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.8.25 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ.6.50 కోట్లు, కృష్ణాలో రూ.7 కోట్లు, గుంటూరులో రూ.9.50 కోట్లు, నెల్లూరులో రూ.4.40 కోట్లు బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. రెస్ట్ ఆఫ్ ఇండియాలో మరో రూ.8 కోట్లు, ఓవర్సీస్ మార్కెట్‌లో రూ.15 కోట్లు చేరడంతో అఖండ 2 ప్రపంచవ్యాప్తంగా మొత్తం సుమారు రూ.123 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ సాధించింది. ఈ సంఖ్యలు చూస్తేనే సినిమా విడుదలకే ముందు ఎంతటి క్రేజ్ క్రియేట్ చేసుకుందో అర్థమవుతోంది.
ఇంత భారీ బిజినెస్ తో రంగంలోకి దిగుతున్న అఖండ 2: తాండవం, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో అన్న ఆసక్తి ఇప్పుడు టాలీవుడ్ మొత్తంలో ఉంది.
బాలయ్య–బోయపాటి కాంబోలో ఇప్పటికే రెండు భారీ హిట్లు ఇచ్చిన నేపథ్యంలో, ఈ సారి కూడా అదే మాస్ లెవెల్లో వెళ్తుందా అన్న అంచనాలు పీక్‌కి చేరాయి. వరల్డ్‌వైడ్‌గా రూ.123 కోట్ల భారీ టార్గెట్‌తో రిలీజ్ అవుతున్న ఈ సీక్వెల్, మొదటి వీకెండ్ నుంచే రికార్డుల దుమారం రేపే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

