Aishwarya Rajesh
ఎంటర్‌టైన్మెంట్

Aishwarya Rajesh: రూటు మార్చిన ఐశ్వర్య రాజేష్.. అందరూ అవాక్క్!

Aishwarya Rajesh: తమిళ హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొందిన కథానాయికల్లో ఐశ్వర్య రాజేశ్ ఒకరు. ఈ బ్యూటీ తమిళంతో పాటు తెలుగు, మలయాళంలో మూవీస్ చేస్తూ దూసుకుపోతుంది. కౌసల్య క్రిష్ణమూర్తి సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది ఐశ్వర్య. ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో ఐశ్వర్య యాక్టింగ్‌కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఐశ్వర్య డస్కీ అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటూ వస్తోంది. మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి మూవీస్ చేసింది. అయితే అవి అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేపోయాయి.

ఇక, ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని సరసన ‘టక్ జగదీష్’ మూవీలో నటించి ప్రేక్షకులతో సూపర్ అనిపించుకుంది. తర్వాత ‘రిపబ్లిక్’ సినిమాలో సాయి ధరమ్ తేజ్ జంటగా నటించింది. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కొంత గ్యాప్ ఇచ్చి ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే మూవీలో ఐశ్వర్య నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంతో బ్లాక్ బస్టర్ తన అకౌంట్లో వేసుకుంది. విక్టరీ వెంకటేష్ సరసన నటించిన ఈ బ్యూటీ తన నటనతో అదరగొట్టింది. ఎంతో మంది తెలుగు ఆడియన్స్ సొంతం చేసుకుంది. ఈ మూవీతో ఈ భామ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. వెంకటేష్‌కి భార్యగా యాక్ట్ చేసిన ఐశ్వర్య.. భాగ్యం పాత్రలో ఇరగదీసింది. మూవీలో తన కంగారు, భయం, టెన్షన్ అన్నీ స్క్రీన్ పై నవ్వులు పూయించింది. ఇక తన నేచురల్ నటన, యాసతో కూడా బ్యూటీ ఫిదా చేసింది.


Aishwarya Rajesh

Also Read: హీరోయిన్‌కి వరుసగా హిట్స్.. అయినా రానీ క్రేజ్!

ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిట్ తో బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు వస్తున్నాయి. తమిళంలో మూడు, కన్నడలో ఓ చిత్రంలో ఐశ్వర్య నటిస్తుంది. అలాగే కొన్ని వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తుంది. ఇదిలా ఉంటే.. ఇక ఎప్పుడూ ట్రెడిషనల్ లుక్‌లో కనిపించే ఈ భామ రూటు మార్చింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’లో సంప్రదాయంగా చీరలో కనిపించి అచ్చ తెలుగు అమ్మాయిలా మార్కులు కొట్టేసింది. అయితే ఐశ్వర్య తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఈ భామ గ్లామర్ ట్రీట్ మాములుగా లేదు. సోషల్ మీడియాను షేక్ చేసేలా ఫొటోషూట్ చేసింది. ట్రెండీ వేర్‌లో బ్యూటీ స్టన్నింగ్ స్టిల్ మతిపోగొడుతోంది. ఇప్పటివరకు ట్రెడిషనల్ పాత్రల్లో నటించిన ఐశ్వర్య ఒక్కసారిగా గ్లామర్ ఫోటో షేర్ చేసేసరికి అందరూ షాక్ అవుతున్నారు. కొందరు అభిమానులు కామెంట్స్ కూడా పెడుతున్నారు. మోడ్రన్ లుక్‌లో గ్లామర్ ట్రీట్ ఇవ్వడానికి కూడా ఈ బ్యూటీ రెడీగా ఉన్నట్లు ఈ ఫొటోతో తెలిసిపోతుంది.

Just In

01

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్