స్వేచ్ఛ, సినిమా: ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) దూసుకుపోతోంది. ఇటీవల ఆమె హీరోయిన్ గా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా నటించిన ఐశ్వర్య… తన నటనతో సినిమా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది కూడా. దీంతో ఆమెకి తెలుగులో వరుస ఆఫర్లు వస్తున్నట్టు సినీవర్గాల సమాచారం.
Also Read : Mass Jathara : మాస్ మహారాజా మీసం మెలేసి హిట్ కొడతారా?
ఇదిలా ఉండగా, తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) మాట్లాడుతూ ఒక హీరోతో పని చేసే అవకాశం వస్తే వదులుకోను అని చెప్పింది. ఆ హీరోని తెగ పొగిడేసింది. ఆ హీరో ఎవరో కాదు, గ్లోబల్ హీరో జూనియర్ ఎన్టీఆర్. ఆయన గురించి ఐశ్వర్య మాట్లాడుతూ… “నాకు ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం. ఆయనను ‘స్టూడెంట్ నెంబర్1’ సినిమా నుంచి చూస్తూ వస్తున్నాను. ఆయన డాన్స్ అంటే ఇంకా ఇష్టం. ఆయనతో నటించే అవకాశం వస్తే మాత్రం కచ్చితంగా వదులుకోను. అంతేకాదు నా కోరిక కూడా అదే. ఆయన డైలాగ్ డెలివరీ, డాన్స్, యాక్టింగ్ అంటే మరింత ఇష్టం. ముఖ్యంగా ఎమోషన్ సన్నివేశాలలో ఆయన నటించే తీరు నాకు మరింత నచ్చుతుంది. కనీసం భవిష్యత్తులోనైనా ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే ఏ మాత్రం వదులుకోకుండా చేస్తాను” అంటూ చెప్పుకొచ్చింది.