Agraharam lo Ambetkar:‘అగ్రహారంలో అంబేద్కర్’.. సాంగ్ రిలీజ్
Agraharam lo Ambetkar (IMAGE SOURCE :x)
ఎంటర్‌టైన్‌మెంట్

Agraharam lo Ambetkar:‘అగ్రహారంలో అంబేద్కర్’ సినిమా నుంచి సాంగ్ రిలీజ్

Agraharam lo Ambetkar: భారత రాజ్యాంగ రూపశిల్పి బాబా సాహేబ్ రామ్ జీ అంబేద్కర్ సిద్ధాంతాల స్ఫూర్తితో రూపొందిన చిత్రం ‘అగ్రహారంలో అంబేద్కర్’. ఈ చిత్రాన్ని రామోజీ, లక్ష్మోజీ ఫిల్మ్స్ పతాకంపై మంతా కృష్ణ చైతన్య స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. దీనికి సంబంధించిన ప్రచార చిత్రాలు ఇప్పటికే మంచి ప్రేక్షకాదరణ పొందాయి. కాగా ఈ సినిమాకు సంబంధించిన సాంగ్‌ను ‘పద్మశ్రీ’ మంద కృష్ణ మాదిగ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమ సమాజ స్థాపన కోసం అంబేద్కర్ చేసిన సేవలను స్మరిస్తూ ఈ సినిమాను రూపొందించారన్నారు. ఆయన భావజాలాన్ని విశ్వ వ్యాప్తం చేయడానికి ఇలాంటి సినిమాలు ఎంతో ఉపయోగపడతాయి అని అన్నారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో అంబేద్కర్ ఆశయాలు నీరుగారాయని మళ్లీ అలాంటి సమాజాన్ని తీసుకు రావడానికి ఇలాంటి సినిమాలు తీస్తున్న కృష్ణచైతన్యకు అభినందనలు తెలిపారు. అందరూ ఇలాంటి సినిమాలు ఆదరించాలని అన్నారు.

Also Read – Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ కి ఏమైంది.. ఆందోళనలో ఫ్యాన్స్.. తారక్ ఆరోగ్యంపై నెటిజన్ల ప్రశ్నల వర్షం

‘అగ్రహారంలో అంబేద్కర్’ సినిమాకు మంతా కృష్ణచైతన్య స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. దళిత సంచలనం మంద కృష్ణ మాదిగ చేతుల మీదగా సాంగ్ విడుదల చేసిన అనంతరం దర్శకుడు మంతా కృష్ణచైతన్యమాట్లాడుతూ…అంబేద్కర్ భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా తెరకెక్కిన ఈ చిత్రం టైటిల్ సాంగ్ రిలీజ్ చేసిన మందా కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రాన్ని సినిటేరియా మీడియా వర్క్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. కుల మత ప్రాంత వర్గ వైషమ్యాలకు అతీతంగా సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన అంబేద్కర్ కు గొప్ప నివాళిగా.. తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు.

Also Read – Stuntman Raju: షాకింగ్.. ఇండస్ట్రీలో మరో విషాదం.. మాస్టర్ ప్రాణం తీసిన స్టంట్..!

దళిత సంచలనం మంద కృష్ణ మాదిగా విడుదల చేసిన సాంగ్ వింటుంటే రాజ్యాంగానికి పీటిక ఎలాంటిదో.. ఈ సినిమాకు కూడా విడుదలైన ఒక్క సాంగ్ అలా ఉంది. V3K అందించిన సంగీతం  ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. కే ఎస్ వీ ప్రసాద్, శిల్ప సాయిలు రాసిన సాహిత్యం అందరినీ ఆలోచింపజేసేలా ఉంది. ఈ సినిమాకు వైతవ్య వడ్లమాని, నరేష్ దొరపల్లి కలిసి ఎడిటర్స్‌గా వ్యవహరిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Farmer Sells Kidney: రోజుకు రూ.10 వేల వడ్డీతో రూ.1 లక్ష అప్పు.. భారం రూ.74 లక్షలకు పెరగడంతో కిడ్నీ అమ్ముకున్న రైతు

Polling Staff Protest: మధ్యాహ్న భోజనం దొరకక ఎన్నికల పోలింగ్ సిబ్బంది నిరసన

Delhi Government: ఆ సర్టిఫికేట్ లేకుంటే.. పెట్రోల్, డీజిల్ బంద్.. ప్రభుత్వం సంచలన ప్రకటన

Champion: ‘ఛాంపియన్’ కోసం ‘చిరుత’.. శ్రీకాంత్ తనయుడికి కలిసొచ్చేనా?

Boyapati Sreenu: నేనూ మనిషినే.. నాకూ ఫీలింగ్స్ ఉంటాయి