G2 Movie
ఎంటర్‌టైన్మెంట్

G2: అడివి శేష్ ‘G2’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్సయింది

G2: సక్సెస్ ఫుల్ హీరో అడివి శేష్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ స్పై థ్రిల్లర్ ‘గూఢచారి’కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘G2’. సోమవారం ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. అడివి శేష్ హీరోగా మరో సరికొత్త మిషన్‌కి రెడీ కాబోతోంది. ఈ సినిమాకి గ్రాండ్ లెవెల్ పోస్టర్స్‌తో రిలీజ్ డేట్‌ని ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాను 2026 మే 1న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లుగా మేకర్స్ అనౌన్స్ చేశారు.

వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని, ఫస్ట్ పార్ట్ ‘గూఢచారి’ మూవీ సక్సెస్‌ను బేస్‌గా తీసుకుని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నారు. 150 రోజుల పాటు, 6 దేశాల్లో షూటింగ్ చేసి, 23 భారీ సెట్లతో రూపొందించబోతున్న ఈ మూవీ, ఇండియన్ సినిమాలో స్పై థ్రిల్లర్ జానర్‌‌ని రీడిఫైన్ చేయనుందని చిత్రబృందం తెలుపుతోంది.

Also Read- Mahavatar Narsimha: బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ.. సరికొత్త రికార్డ్ క్రియోట్ యానిమేటెడ్ మహావతార్ నరసింహ..

ఈసారి ఏజెంట్ 116గా వామికా గబ్బి ఎంట్రీ ఇవ్వనుంది. యాక్షన్‌తో పాటు ఎమోషన్‌ వున్న క్యారెక్టర్ ఇదని తెలుస్తోంది. ఈ మూవీతో ఇమ్రాన్ హష్మీ తొలిసారి తెలుగు తెరపై కనిపించబోతుండగా.. మురళీ శర్మ, సుప్రియా యార్లగడ్డ, మధు శాలిని వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై టి.జి. విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా రిలీజ్ కానుంది. పవర్‌ఫుల్ క్యాస్ట్, అంతర్జాతీయ స్థాయి ప్రొడక్షన్, గ్రాండ్ విజన్‌తో రూపుదిద్దుకోనున్న ఈ G2 మూవీ 2026లో మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులని అలరించనుందని మేకర్స్ మాటిస్తున్నారు.

Also Read- Rajinikanth: ‘బాషా’ సినిమాకు ఆంటోని ఎలాగో.. ‘కూలీ’ సినిమాకు సైమన్ అలాగే.. నాగ్ అదరగొట్టేశాడు

శరవేగంగా సిద్ధమవుతోన్న ‘డకాయిట్’
మరోవైపు అడివి శేష్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా రూపుదిద్దుకుంటోన్న ‘డకాయిట్’ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే లీడ్ క్యారెక్టర్స్‌ని పరిచయం చేస్తూ విడుదలైన పవర్ గ్లింప్స్ హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ప్రేమ-ప్రతీకార కథనం నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో వస్తున్న ఈ భారీ చిత్రాన్ని సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తుండగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా 25 డిసెంబర్, 2025న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. రీసెంట్‌గా మృణాల్ ఠాకూర్ పుట్టినరోజును పురస్కరించుకుని స్పెషల్ పోస్టర్‌ని విడుదల చేయగా, ఆ పోస్టర్ మంచి స్పందనను రాబట్టుకుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు