Celebrity Divorce: ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు పెళ్లి బంధానికి ముగింపు చెప్పడానికి ఏ మాత్రం ఆలోచించడం లేదు. చిన్న చిన్న గొడవలను కూడా పెద్దవిగా చేసుకుంటూ కోర్టు మెట్లు ఎక్కి.. విడాకులకు సిద్ధమవుతున్నారు. ఇక, ఆ లిస్ట్ లో వారిలో స్టార్ నటి నటులు కూడా ఉంటున్నారు. సమంత, నాగ చైతన్య ప్రేమ పెళ్లి చేసుకున్న .. కలిసి ఉండలేకపోయారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు డివోర్స్ తీసుకుని ఎవరికి వారు విడి విడిగా బతుకుతున్నారు. అయితే, తాజాగా పవన్ కళ్యాణ్ తో నటించిన హీరోయిన్ కూడా విడాకులకు రెడీ అవుతుందంటూ వార్తలు వస్తున్నాయి. మరి, ఆ ముద్దుగుమ్మ ఎవరో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Balagam Actor: ఇండస్ట్రీలో మరో విషాదం.. ‘బలగం’ నటుడు కన్నుమూత.. దర్శకుడు వేణు సంతాపం
పవన్ కళ్యాణ్ పెద్ద మరదలు గుర్తుందా?
అత్తారింటికి దారేది మూవీలో పవన్ పెద్ద మరదలు పాత్రలో నటించిన హీరోయిన్ ప్రణీత తెలుగు ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు పొందింది. అయితే, ఈ బ్యూటీ కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు బెంగళూరుకు చెందిన బిజినెస్ మేన్ నితిన్ ను వివాహం చేసుకుంది. 2024 లో కొడుకు పుట్టిన విషయం మనకు తెలిసిందే. అయితే, ఈ మధ్య కాలంలో ప్రణీత ఆమె భర్త నితిన్ కి మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చాయని సినీ వర్గాల నుంచి సమాచారం.
Also Read: Bomb Threat Call: బెజవాడకు వరుస బాంబు బెదిరింపులు.. ఉక్కిరి బిక్కిరి అవుతున్న పోలీసులు
ప్రణీత, నితిన్ రాజు విడాకులు తీసుకోబోతున్నారా?
పిల్లలు పుట్టాక ఇద్దరికీ మనస్పర్ధలు రావడంతో ప్రణీత, నితిన్ రాజు డివోర్స్ కు సిద్దమవుతున్నట్టు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే, ప్రణీత బంధువులు మాత్రం వారి మధ్య చిన్నపాటి మనస్పర్ధలేనని అని చెబుతున్నారు. మరి, ఈ వార్త పై ఈ ప్రణీత ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.