Image Credit: Anjali
ఎంటర్‌టైన్మెంట్

Game Changer: గేమ్ ఛేంజర్ రిజల్ట్ పై స్పందించిన అంజలి.. ఏమన్నారంటే!

Game Changer : టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గేమ్ ఛేంజర్. రామ్ చరణ్, కియరా అద్వానీ, అంజలి ప్రధాన పాత్రల్లో కనిపించగా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే విడుదలైనప్పటి నుంచి పలు వివాదాలు ఎదుర్కున్న ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకోవటంపై నటి అంజలి స్పందించారు.

ప్రముఖ నటి అంజలి తమిళంలో నటించిన మధగజ రాజా చిత్రాన్ని ప్రస్తుతం తెలుగులో ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న అంజలి.. గేమ్ ఛేంజర్ సినిమాపై స్పందించారు. ఎంతో మంది కష్టపడి ఎంతో ఇష్టంగా పనిచేసిన సినిమా అనుకున్న స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేనప్పుడు చాలా బాధ కలుగుతుందని చెప్పుకొచ్చారు.

గేమ్ ఛేంజర్ సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది కదా.. ఈ విషయంపై మీరేమంటారు? అంటూ ఓ రిపోర్టర్ ప్రశ్నించగా… ‘నటిగా నేను నా పాత్రను ఎలా పోషించాను అనే విషయానికి మాత్రమే బాధ్యత వహించగలరు. ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ సాధించాలనే ప్రమోషన్స్ చేస్తాము. కానీ అంతకుమించి పరిధి దాటి మాట్లాడాలంటే ఇప్పుడు ఉన్న సమయం కూడా సరిపోదు. ఒక సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్మే ఎంతో కష్టపడి పనిచేస్తాము. గేమ్ ఛేంజర్ విషయంలో కూడా నటీనటులంతా 200% ఎఫర్ట్స్ ఇచ్చాం. సినిమా చూసిన ఏ ఒక్కరూ నెగిటివ్ రివ్యూ ఇవ్వలేదు. ఊహించిన దానికంటే మంచిగానే స్పందించారు. కానీ ఇంత మంచి సినిమా విషయంలో కూడా అనుకోని రీతిలో గాయపడాల్సి వచ్చింది. ఇదే చిత్ర బృందానికి చాలా బాధను మిగిల్సింది. ఇలా ఎందుకు చెబుతున్నానో మీ అందరికీ తెలుసు..” అంటూ సినిమా పైరసీకి గురై నష్టపోయిన విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా అంజలి వెల్లడించారు.

ఇక శ్రీ వెంకటేశ్వర బ్యానర్ లో దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్ భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కింది. ఎన్నికల రాజకీయాల్లో అవినీతిని నిర్మూలించాలని కలలు కనే రామ్ నందన్ అనే ఐఏఎస్ పాత్రలో రామ్ చరణ్ నటించారు. ఈ సినిమాకు తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. కియరా అద్వానీ, అంజలి కథానాయికలుగా కనిపించారు.

బెస్ట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా అనుకోని రీతిలో పైరసీకి గురవ్వటమే కాకుండా విడుదలైన వెంటనే ఆన్లైన్ లో కాపీ అందుబాటులోకి వచ్చేసింది. దీంతో సినిమా కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపించింది. రూ.450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా… ఇండియాలో రూ.154.85 కోట్ల గ్రాస్ సాధించగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.185.10 కోట్ల వసూళ్లు సాధించింది.

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?