BTPS thunder
Top Stories, క్రైమ్

Telangana: బీటీపీఎస్ లో పిడుగుపాటు

  • భద్రాద్రి పవర్ ప్లాంట్ ఆవరణలో దుర్ఘటన
  • రూ.150 కోట్ల నుంచి రూ.300 కోట్లకు పైగా డ్యామేజీ?
  • ఘటనా స్థలంలో కార్మికులెవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణనష్టం
  • లైట్నింగ్​ పనితీరుపై ఉద్యోగుల్లో అనుమానాలు
  • మంటలను అదుపులోకి తేలేకపోయిన ఫైరింజన్ సిబ్బంది
  • డ్రై కెమికల్ పౌడర్​ తో అదుపులోకి వచ్చిన మంటలు
  • నిలిచిపోయిన 270 మెగావాట్ల యూనిట్ల ఉత్పత్తి
  • ప్రమాదం తీరుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా

Thunder effect on btps 270 megawats units current production stoped
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల పరిధిలోని భద్రాద్రి పవర్ ప్లాంట్ ఆవరణలో శనివారం అర్థరాత్రి పిడుగు పడింది. ఈ ప్రమాదంలో పిడుగు సరిగ్గా జనరేటింగ్ ట్రాన్స్‌ఫార్మర్‌పై పడటంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. గమనించిన అధికారులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేయగా వారు ఘటనా స్థలానికి చేరకుని మంటలను అదుపు చేశారు. ఈ దుర్ఘటనలో రూ.30 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అయితే, యూనిట్-1 పునరుద్ధరణకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోతలు ఉన్నాయంటూ అపవాదును ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తాజాగా దుర్ఘటన కొత్త తలనొప్పిని తెచ్చి పెట్టింది.

బీటీపీఎస్ ట్రాన్స్ ఫార్మర్ దగ్ధం

బీటీపీఎస్​లోని మొదటి యూనిట్ కు సంబంధించిన జనరేటర్ ట్రాన్స్​ఫార్మర్ పై ఒక్కసారిగా పిడుగు పడడంతో ట్రాన్స్ ఫార్మర్ పేలిపోయి మంటలు వ్యాపించాయి. మొదటి యూనిట్ లో ఉత్పత్తి అయిన విద్యుత్తును జనరేటర్ ట్రాన్స్​ఫార్మర్ ద్వారా స్విచ్ యార్డుకు పంపిస్తారు. జనరేటర్ ట్రాన్స్​ఫార్మర్ కు అగ్నిప్రమాదం జరగడంతో 270 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన మొదటి యూనిట్ ను షట్ డౌన్ చేశారు. ముందుజాగ్రత్తగా పక్కనే ఉన్న రెండో యూనిట్​ను కూడా షట్​డౌన్​ చేశామని ఉద్యోగులు తెలిపారు. కాగా.. జనరేటర్ ట్రాన్స్ ఫార్మర్ కు అంటుకున్న మంటల్ని అదుపు చేసేందుకు ఫైర్ ఇంజన్ వల్ల సాధ్యం కాకపోవడంతో డ్రై కెమికల్ పౌడర్​ వినియోగించారు. గంటన్నరపైగా ఫైర్ సిబ్బంది, ప్లాంటు ఉద్యోగులు శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు. పిడుగు పడిన టైంలో ఆ ప్రాంతంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. జనరేటర్ ట్రాన్స్ ఫార్మర్ కాలిపోవడంతో సుమారు రూ.150 కోట్ల నుంచి రూ.300 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఉద్యోగులు పేర్కొన్నారు.

లైట్నింగ్ అరెస్టు పనితీరుపై అనుమానాలు

బీటీపీఎస్​లోని జనరేటర్ ట్రాన్స్​ఫార్మర్ పై పిడుగు పడడంపై అధికారులతో పాటు కార్మికులు ఆశ్చర్యానికి గురయ్యారు. విద్యుత్ కేంద్రాలు, పవర్ గ్రిడ్లు, సబ్ స్టేషన్ల సమీపంలో పిడుగులు పడకుండా లైట్నింగ్​ అరెస్టులను (రాడ్) ఏర్పాటు చేస్తారు. బీటీపీఎస్​లోనూ లైట్నింగ్​ అరెస్టులను ఏర్పాటు చేశామని ప్లాంట్​ అధికారులు పేర్కొంటున్నారు. లైట్నింగ్​ పనితీరుపై ఉద్యోగుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత పెద్ద ప్లాంటులో పిడుగులను అడ్డుకునే లైట్నింగ్​ల ఏర్పాటు, వాటి పనితీరు, పర్యవేక్షణ విషయంలో ఆఫీసర్ల నిర్లక్ష్యం కనిపిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక జనరేటర్​ ట్రాన్స్​ఫార్మర్​పై పిడుగు పడడంతో 270 మెగావాట్ల యూనిట్ల​ఉత్పత్తి నిలిచిపోయింది. తిరిగి ఉత్పత్తి కావడానికి దాదాపు నెలకుపైనే పట్టే అవకాశం ఉందని ఉద్యోగులు పేర్కొంటున్నారు.

మంత్రి తుమ్మల ఆరా

ప్రమాదం సంభవించిన విషయం తెలుసుకున్న వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీటీపీఎస్​ సీఈ బిచ్చన్న కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును తుమ్మలకు సీఈ వివరించారు. పిడుగుపాటును అడ్డుకునే లైట్నింగ్​ అరెస్టులు ఉన్నా ఇలా జరగడంపై విచారణ చేపడుతున్నామని తెలిపారు.

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు