T.high court phone tapping
Top Stories, క్రైమ్

Hyderabad:ఫోన్ ట్యాపింగ్ పై హైకోర్టు సీరియస్

  • మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని
  • తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు అదేశం.
  • వ్యక్తిగత స్వేచ్ఛకు, దేశ భద్రతకు భంగం కల్గించారని వాఖ్య.
  • ఫోన్ ట్యాపింగ్ పై నిత్యం ఎక్స్లూజివ్
  • కథనాలు మీకు అందిస్తున్న స్వేచ్ఛ.
  • భుజంగరావు వాంగ్మూలం బయటపెట్టింది స్వేచ్ఛ డైలీ.
  • మూడు వారాల్లో దర్యాప్తు లోతుగా లేకపోతే కేసు సిబిఐ కి.?
  • మాజీ మంత్రి హారీష్ రావుకి, కేసీఆర్ కి నోటీసులు ఇస్తారా.?
  • ప్రభాకర్ రావును విచారిస్తే.. జిల్లాలో ట్యాపింగ్ భయటపడనుందా..?
  • కేసు హైకోర్టుకు చేరడంతో టెన్షన్ లో నేతలు, నిందితులు

దేవేందర్ రెడ్డి. 9848070809
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం.

 

Telangana High court takes serious on phone tapping sending notices:
ఫోన్ ట్యాపింగ్ కేసును తెలంగాణ హైకోర్టు సుమోటగా స్వీకరించింది. మంగళవారం విచారణ చేపట్టి ఉన్నత న్యాయస్థానం తెలంగాణ చీఫ్ సెక్రెటరీకి, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఇంటిలిజెన్స్ అదనపు డీజీ, హైదరాబాద్ కమిషనర్ తో పాటు కేంద్ర హోం శాఖకు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని అదేశించింది చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్ కుమార్ ల ధర్మాసనం.

వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లింది

దేశ భద్రతకు, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన వ్యవహారోంలో తెలంగాణ పోలీసులు ఇష్టానుసారంగా ఫోన్ ట్యాపింగ్ చేశారని స్వేచ్ఛ డైలీ మొదటి నుంచి ఎక్స్ క్లూజివ్ కథనాలు అందించింది. అందుకు ఇద్దరు మీడియా అధినేతలు ఉన్నారని, వారి వాట్సప్ చాటింగ్ అధారాలను పోలీసులకు అందజేసింది స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం. నలుగురు పోలీస్ అధికారులను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు వారిని కస్టడి రిపోర్టులో నివ్వరబోయే విషయాలు భయటకు వచ్చాయి. కోర్టులో పోలీసులు సమర్పించిన వాంగ్మూల రిపోర్టును సర్టిఫైడ్ కాఫీతో విషయాలన్నింటిని భట్టభయలు చేయడం జరిగింది. అయితే అందులో జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లు అదనపు ఎస్పీ భుజంగరావు తెలిపారు. దీంతో అన్ని పత్రికల్లో ఈ వార్తను అందిపుంచుకోవడంతో పాటు సంచలనంగా మారింది. దీంతో హైకోర్టు అధివారం సుమోటగా తీసుకొని నోటీసులు ఇవ్వడంతో దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారులతో పాటు, నిందుతుల్లో టెన్షన్ నెలకొంది.

మూడు వారాల్లో ఏం జరగనుంది

పోలీసుల దర్యాప్తు సరిగ్గా జరుగుతుందా..? ప్రభుత్వం ఇప్పటికే స్వేచ్ఛయుతంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని అదేశాలు ఇచ్చింది. ఎక్కడ పొలిటికల్ ఇంటర్ఫీయర్ కాకుండా సీఎం అదేశాలు జారీ చేశారు. దీంతో 200 మంది ఫోన్ ట్యాప్ బాధితులకు ఫోన్ చేసి వారి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేశారు. అయితే జిల్లాల వారిగా ఫోన్ ట్యాపింగ్స్ జరిగాయని తెలుస్తుంది. అక్కడి పోలీస్ అధికారులు విచారణ ఎలా చేస్తున్నారు. మొత్తం ఎంతమంది ఫోన్స్ ట్యాప్ చేశారో హైకోర్టుకు మూడు వారాల్లో తెలియజేయాల్సి ఉంటుంది. అందుకు ప్రధాన నిందుతుడు ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వస్తేనే పూర్తి విషయాలు భయటకు రానున్నాయి. కోర్టుకు సమర్పించే నివేదిక అదారంగా హైకోర్టు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సిబిఐ కి ఇస్తుందా..? లేదా హైకోర్టు జడ్జిల ఫోన్స్ కూడా ట్యాప్ అయ్యాయని నిందుతులు చెప్పడంతో చీఫ్ జస్టిస్ యే మానిటర్ చేస్తారనేది కీలకంగా మారింది. కేసు దర్యాప్తు సరిగ్గా లేదని కోర్టు భావిస్తే, ప్రభుత్వం, పోలీసుల చేతులోంచి కోర్టు చేతిలోకి వెళ్లనుంది.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్