- టిండర్ యాప్ తో బిగ్ షాట్లకు టెండర్
- మోషే పబ్బులో వెలుగు చూస్తున్న అక్రమాలు.
- ఒకే రోజు ముగ్గురు వ్యాపారవేత్తల్ని చీట్ చేసిన యువతి.
- వ్యాపారవేత్తలని ట్రాప్ చేసి మోషే పబ్ కు తీసుకువచ్చిన యువతి.
- మోషే పబ్ మేనేజర్, యజమానితో కుమ్మక్కై డబ్బులు వసూలు.
- లిక్కర్ తాగినట్లుగా నటించి వేల రూపాయల బిల్లు చేసి దోచేసుకున్న యువతి.
- మోషే పబ్ విహారంలో పదిమందిపై కేసు నమోదు ఆరుగురు అరెస్టు.
- మోషే పబ్ ముగ్గురు యజమానులతో పాటు మేనేజర్ పై కేసు నమోదు.
Cheating Big shots with Dating app case filed on Moshe pub Hyderabad:
డేటింగ్ యాప్ లతో అమ్మాయిల కోసం చూస్తున్నారా.. యాప్‌లలో అమ్మాయిలు పరిచయం అవ్వగానే వావ్ అనుకుని వారి వెంట పబ్ లకు పరుగెడుతున్నారా… అయితే తస్మాత్ జాగ్రత్త. హైదరాబాద్ లో ఓ కొత్త రకం మోసం బయటకు వచ్చింది. ఇందులో డేటింగ్ యాప్‌లో పరిచయం అయిన అమ్మాయిలు తర్వాత వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపుతున్నారు. ఆ తర్వాత కలుద్దాం అంటూ ప్రపోజ్ చేస్తున్నారు. కలిసాక హైటెక్ సిటీలో ఓ పబ్‌కి తీసుకెళుతున్నారు. అక్కడ ఖరీదైన మందు, ఫుడ్ ఆర్డర్ చేసి అమ్మాయిలు నెమ్మదిగా జారుకుంటున్నారు. దీంతో అబ్బాయిలకు వేల్లో బిల్లులు కట్టాల్సి వస్తోంది. ఇప్పటివరకు నగరంలో 8మంది అబ్బాయిలు మోసపోయారు. భాగ్యనగరంలోనే అదో పేరు మోసిన పబ్బు. అయితే ఈ పబ్బులో జరిగేవి అన్నీ గబ్బు మోసాలే.. తాజాగా జరిగిన విచారణలో పబ్బు అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
పబ్బుకు పిలిపించుకుని
పబ్బు యాజమాన్యంతో చేతులు కలిపింది ఓ యువతి. డేటింగ్ యాప్ ద్వారా పబ్బుకు పిలిపించుకుని వాళ్ల నుంచి లక్షలు దోచుకుంటుంటుంది. తనకు వచ్చిన ఆదాయంలో పబ్బు యాజమాన్యాలకు కూడా భాగం ఇచ్చేది. తమకు కూడా ఆదాయం దండిగా వస్తుండటంతో ఆమెను తమ వ్యాపార లావాదేవీలలో భాగస్వామిగా చేసుకున్నారు. ఇక అడ్డూ అదుపూ లేకుండా నగరంలో బడా పారిశ్రామికవేత్తలు, ధనవంతులను ట్రాప్ చేయడం మొదలుపెట్టింది. ఈ ప్రక్రియలోనే ఒకే రోజు ముగ్గురు వ్యాపారవేత్తలను మోసం చేసింది. వారిని ఒకరికి తెలియకుండా మరొకరిని ట్రాప్ చేసింది. వారిని మోషే పబ్ కు రప్పించింది. ఆ కిలాడీ యూవతి మాటలు నమ్మిన సదరు బిజినెస్ మ్యాన్స్ ఆ యువతి చేతిలో దారుణంగా మోసపోయారు. మోషే పబ్ మేనేజర్, యజమానితో కుమ్మక్కై డబ్బులు వసూలు చేసింది. లిక్కర్ తాగినట్లు నటించి ఏకంగా వేల రూపాయల బిల్లు వేయించింది. అందులోంచి తన కమిషన్ కొట్టేసింది యువతి. ఒకేరోజు ముగ్గురు వ్యాపారవేత్తలను మోసగించిన ఆ యువతి.. వారి నుంచి లక్షన్నర రూపాయలు కాజేసింది.
పదిమందిపై కేసు, ఆరుగురు అరెస్ట్..
కాగా, మోషే పబ్ వ్యవహారంలో ఇప్పటి వరకు 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు. మోషే పబ్ ముగ్గురు యజమానులతో పాటు.. మేనేజర్‌పైనా కేసు నమోదు చేశారు పోలీసులు. టిండర్ యాప్ ద్వారా వ్యాపారవేత్తలను ట్రాప్ చేసి, వారిని మోసం చేస్తున్నారు. వీరంతా నాగపూర్‌కు చెందిన గ్యాంగ్‌గా తెలిపిన పోలీసులు.. వారిని అరెస్ట్ చేశారు. మోషే పబ్బుకు చెందిన ముగ్గురు యజమానులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని విచారిస్తున్నారు. విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇక వ్యాపారవేత్తలకు వలవేస్తున్న అమ్మాయిలను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.