A Wife Who Killed Her Husband For Her Lover: ఇంటికి దీపం ఇల్లాలే అంటుంటారు కానీ, కొన్ని కొన్ని ఘటనలు చూస్తుంటే అందులో ఏం మాత్రం నిజం లేదని స్పష్టమవుతోంది. కొంతమంది భార్యలు ఇళ్లు, ఒళ్లు మరిచి వావి వరుసలు లేకుండా అటు కన్నవారికి, ఇటు కట్టుకున్నవాడికి తీర్చలేని శోకాన్ని మిగిల్చుతున్నారు. కట్టుకున్న వారి పాలిట యమగండంలా తయారవుతున్నారు. తాజాగా ఇలాంటి విషాద ఘటనే ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. అక్రమ సంబంధానికి తన భర్త అడ్డుగా ఉన్నాడని దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడితో కలిసి తన భర్తను అతి దారుణంగా చంపేసింది ఓ కసాయి భార్య.
ప్రియుడి మోజులో పడి సుపారీ ఇచ్చి మరి తనతో ఏడుగులు నడిచి జన్మజన్మల తనతో ఉంటానని మాటిచ్చిన భర్తని హత్య చేయించింది. ఈ ఘటన రెండురోజుల క్రితం జరగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక అసలు వివరాల్లోకి వెళితే ఆదిలాబాద్ జిల్లాకు చెందిన టీచర్ జాదవ్ గజానంద్ జైనథ్, రెండు రోజుల క్రితం హత్యకు గురయ్యాడు. అయితే భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు విచారణ చేపట్టగా, అసలు దొంగలు ఎవరనేది బట్టబయలైంది. మృతుడు జైనథ్ భార్య మహేష్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు పోలీసుల విచారణలో తెలుసుకున్నారు. ఆమె ప్రియుడితో సంతోషంగా ఉండాలంటే తన భర్త అడ్డు తొలగించుకోవాలని పక్కా ప్లాన్ వేసింది.
భర్త చనిపోయిన తన మీద ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలని అనుకుంది. అనుకున్నట్లుగానే సుపారీ గ్యాంగ్‌తో ఫోన్‌లో మాట్లాడి డీల్ కుదుర్చుకుని వారితో తన భర్తను హత్య చేయించింది. అయితే భర్త హత్య జరిగిన రెండు రోజుల తర్వాత, భార్య పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భర్త రెండురోజుల నుంచి ఇంటికి రాలేదని, ఎక్కడికి వెళ్లాడో తెలియడం లేదని కంప్లైంట్ ఇవ్వగా, పోలీసుల విచారణలో భాగంగా ఈ నిజాలు బయటపడ్డాయి. ఇక పోలీసులు ఆ మహిళతో పాటు హత్య చేసిన వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కి తరలించారు.