Monday, July 1, 2024

Exclusive

Kaushik Reddy: ఆయనంతే.. అదోటైపు..!

-అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు!
-నోటి దురుసు మాటలు.. లెక్కలేనన్ని ఆరోపణలు!
– నిత్యం ఏదో ఒక వివాదం
– వాటితోనే వార్తల్లో ఉండే ప్రయత్నం
– చర్చనీయాంశంగా తానే ఉండాలనే కుటిల యత్నం
– చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం ప్రమాణం
– ఉద్యోగాల పేరుతో మోసం చేసింది ఎవరు?
– పెట్రోల్ బంకుల పేరుతో డబ్బులు వసూలు చేసింది ఎవరు?
– మనీ తిరిగివ్వకుండా ఇప్పటికీ తిప్పించుకుంటున్నది ఎవరు?
– అనుచరుల కబ్జా కహానీలు, గన్ లైసెన్సుల సంగతులు
– పోలీసులు, జర్నలిస్టులు, ప్రజల పట్ల నోటి దురుసు మాటలు
– కౌశిక్ రెడ్డి గతాన్ని తవ్వుతున్న కాంగ్రెస్ శ్రేణులు
– సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చ

దేవేందర్ రెడ్డి,

స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం:

BRS Party: నోరు మంచిదైతే.. ఊరు మంచిగా ఉంటుందంటారు. లేదంటే, తర్వాతి పర్యవసనాలు చాలా తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. జనాలు చీ కొడతారు. కేసులు వెంటాడుతాయి. కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అయినా కూడా, కొందరిలో ఎన్నటికీ మార్పు అనేది ఉండదు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనే చర్చ తాజాగా జరుగుతోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ అవినీతికి పాల్పడ్డారని కొద్ది రోజుల క్రితం ఆరోపించిన ఆయన, ఆ తర్వాతి రోజు నుంచి మీడియాకు ఏదో ఒకటి చెబుతూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. కావాలని తమ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని బద్నాం చేసేందుకు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని హస్తం నేతలు ఫైరవుతున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కౌశిక్ రెడ్డి పాత కేసులు, నోరు అదుపులో లేని మాటలతో ఎదురైన చిక్కులపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

తమిళిసైపై కామెంట్స్.. కమిషన్ చివాట్లు

చిన్నా పెద్దా అనే తేడా లేకుండా, హోదాను మరిచి కింది స్థాయి సర్పంచులను, చోటా మోటా లీడర్లను, మండల స్థాయి జర్నలిస్టులను టార్గెట్ చేస్తూ తిట్టడం కౌశిక్ రెడ్డికి అలవాటుగా మారిందనే టాక్ ఉంది. తెలంగాణకు గవర్నర్‌గా తమిళిసై ఉన్న సమయంలో ఆమెపై అసభ్యకరమైన కామెంట్స్ చేశారు. ఈ ఇష్యూ జాతీయ మహిళా కమిషన్ వరకు వెళ్లింది. కానీ, బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం ఆ తర్వాతే కౌశిక్‌కు మరింత ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. బీఆర్ఎస్ హైకమాండ్ అండతోనే కౌశిక్ రెడ్డి రెచ్చిపోతున్నారనే చర్చ హుజూరాబాద్ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.

ఎన్నికల సమయంలో డ్రామా

అసెంబ్లీ ఎన్నికల సమయంలో హుజూరాబాద్ నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డి, ప్రచార కార్యక్రమాలు ముగిశాక భార్య, కూతురుతో కలిసి ఓ వీడియో విడుదల చేశారు. తనకు ఓటేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. అంతటితో ఆగకుండా, కచ్చితంగా తనకే ఓటెయ్యాలని లేదంటే భార్య, కూతురుతో సహా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినంత పని చేశారు. ఇది అప్పట్లో పెద్ద దుమారం రేపింది. దీనిపై బీజేపీ నేత ఈటల రాజేందర్ కోర్టును ఆశ్రయించగా, కౌశిక్‌కు నోటీసులు అందాయి. ఓటర్లను బ్లాక్ మెయిల్ చేసి కౌశిక్ గెలిచారని ఇప్పటికీ ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు.

అమరవీరుల స్థూపం మాటున రాజకీయం

హుజూరాబాద్ అమరవీరుల స్థూపం శిలాఫలకంపై తన పేరు లేదని పాత స్థూపం కూల్చివేసి కొత్తది ఏర్పాటు చేశారు కౌశిక్ రెడ్డి. ఆవిష్కరణకు ముందే పాత స్థూపాన్ని నేలమట్టం చేయించారు. కొత్తగా నిర్మించిన అమరవీరుల స్థూపం ఆవిష్కరణ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు బండి అజయ్ అనే కెమెరామెన్ హుజూరాబాద్ వెళ్లగా, అక్కడ ఓ మహిళ కౌశిక్ రెడ్డిని సంక్షేమ పథకాలు రావడం లేదని నిలదీసింది. దీంతో రెచ్చిపోయిన ఆయన, మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీన్ని కెమెరాలో రికార్డు చేస్తుండగా కౌశిక్ అనుచరులు వచ్చి తనను కారులో తీసుకెళ్లి దాడి చేశారని అజయ్ ఆరోపించారు. కౌశిక్ రెడ్డి తిట్టిన బూతులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముదిరాజ్ కులస్తులను బండ బూతులు తిట్టడంతో, ప్రాణహాని ఉందని అజయ్ హుజూరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

పోలీసులపైనా నోటి దురుసు

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ క్యాడర్‌కు భరోసా ఇవ్వాలని కౌశిక్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కేసు కూడా నమోదైంది. మార్చి నెలలో కరీంనగర్‌లోని ఓ హోటల్‌లో బీఆర్ఎస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కౌశిక్ రెడ్డి పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. డీజీపీ వరకు ఏ స్థాయి అధికారులకు అయినా మిత్తితో సహా చెల్లిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు పెట్టారు.

ఉద్యోగాలు, బంకుల పేరుతో మోసాలు

గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు, బీఆర్ఎస్‌ అధికారంలో ఉన్నన్నాళ్లూ కౌశిక్ రెడ్డి ఎన్నో మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. పైస్థాయి పెద్దలతో దిగిన ఫోటోలు చూపిస్తూ, వాళ్లు తెలుసు, వీళ్లు తెలుసు అంటూ ఉద్యోగాల్లో పెట్టిస్తానని జనం నుంచి లక్షల రూపాయలు తీసుకున్నారని, దీనిపై నిలదీస్తే, తడిబట్టలతో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేశారని, పబ్లిసిటీ కోసం చిల్లరగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన కౌశిక్ రెడ్డి, అనేక వివాదాలు, దందాలు చేశారని, ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేయడం, పెట్రోల్ బంకులు ఇప్పిస్తానని అందినకాడికి దండుకుని పని చేయకుండా సతయించారనే విమర్శలున్నాయి. పని కాలేదు డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసిన వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం, భూ దందాలు, ఇసుక దందా ఇలా అనేక అక్రమాలకు పాల్పడ్డారని హుజూరాబాద్‌లో మాట్లాడుకుంటున్నారు. పెట్రోల్ బంకులు ఇప్పిస్తానని ఇద్దరు సర్పంచులు సహా అనేకమంది వద్ద ఒక్కొక్కరి నుంచి 20 నుంచి 30 లక్షలు వసూలు చేసిన ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు తీసుకొని పెట్రోల్ బంకులు ఇప్పించకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదం పెరగడంతో నాలుగైదు సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు కొందరికి డబ్బులు తిరిగి చెల్లించారు. మరికొందరికి ఇప్పటికీ డబ్బులు తిరిగి ఇవ్వలేదు.

అనుచరుల ఆగడాలు అన్నీ ఇన్నీ కావు

కౌశిక్ రెడ్డి పేరుతో ఆయన అనుచరులు కూడా దందాలు నడిపించారు. జమ్మికుంట పట్టణం నడిబొడ్డున ఉన్న మహిళా సంఘ భవన స్థలాన్ని అక్రమంగా కౌశిక్ అనుచరులు ఆక్రమించారని కాంగ్రెస్ నాయకుడు పోనగంటి మల్లయ్య, దేశిని కోటి కౌన్సిలర్లు ఆరోపించారురు. మహిళా సంఘ భవనం స్థలం సర్వే నెంబర్ 648 కాగా, కబ్జాదారులు సర్వే నెంబర్ 652లో భవనాన్ని కట్టాల్సి ఉండగా, 648లో కట్టి అధికారులను తప్పుదోవ పట్టించారు. ‘‘అక్రమంగా మహిళా సంఘ భవన స్థలంలో నిర్మాణం చేసిన కట్టడాన్ని అధికారులు వెంటనే కూల్చివేయాలి. కౌశిక్ రెడ్డి అనుచరులు 59 జీవోతో అనేక భూములను కబ్జా చేశారు. ఆనాడు ఎమ్మెల్సీగా, నేడు ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డి ఆగడాలు, అవినీతిని చూసి ప్రజలు కోపంతో రగిలిపోతున్నారు’’ అని అంటున్నారు. మరోవైపు, కౌశిక్ రెడ్డి అనుచరుడు సరిగొమ్ముల వెంకటేష్ గతంలో నకిలీ తుపాకులు పెట్టి బెదిరించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇతనికి హుజూరాబాద్ ఉప ఎన్నిక తరువాత గన్ లైసెన్స్ ఇచ్చారు. గన్ చూపి ల్యాండ్ సెటిల్ మెంట్ చేయడం. ఏకంగా ఓ సీఐని బెదిరించిన ఆరోపణ ఉంది. ల్యాండ్ సమస్యల్లో బెదిరింపులు, అధికారులకు వార్నింగులు, లాండ్ సెటిల్మెంట్లో మామూళ్లు వసూలు చేస్తాడని అంటుంటారు. అలాగే, పోలినేని సత్యనారాయణ రావు, తక్కల్లపెల్లి రాజేశ్వర్ రావులకు కూడా గన్ లైసెన్స్ ఇచ్చారు. వీరితో పాటు మరో 16 మంది గన్ లైసెన్స్ కోసం ధరఖాస్తు చేసుకున్నారు. వారికి అనుమతి ఇచ్చే సమయంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేక చర్చ జరగడంతో పాటు ప్రతి పక్షాలు విమర్శ లు చేయడంతో లైసెన్స్ ఇవ్వడానికి పోలీస్ శాఖ నిరాకరించింది. అక్రమాలకు కేరాఫ్ అయిన కౌశిక్ రెడ్డి, ప్రమాణాలు చేస్తూ డ్రామాలు చేస్తే ప్రజలు నమ్మరని, నవ్వుకుంటున్నారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు.

వివాదాల పుట్ట.. కౌశిక్

* అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో భాగంగా కరీంనగర్‌లో పోలీసులపై కౌశిక్ రెడ్డి దుర్భాషలాడారు. ఈ వివాదం పెరిగి లాఠీచార్జ్ వరకు వెళ్లింది. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎన్నికల నియమాలను ఉల్లంఘించి గొడవకు కారణమైన కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
* తెలంగాణ ఉద్యమ సమయంలోనూ మానుకోటలో ఉద్యమకారులపై ఫైరింగ్ చేశారని, తెలంగాణ వాదుల ఆగ్రహానికి లోనయ్యారు.
* గతంలో మురికి కాలువ విషయంలో హుజూరాబాద్ మండలం జూపాక పంచాయతీ సెక్రెటరీ తోట రాజుతో, ప్రహరీ విషయంలో అదే మండలంలోని రంగాపూర్ పంచాయతీ సెక్రెటరీతో ఫోన్లో దుర్భాషలాడారు.
* జమ్మికుంటలో రైతు దినోత్సవంలో పాల్గొన్న కౌశిక్ రెడ్డిని నష్టపోయిన పంటలకు పరిహారం ఎప్పుడిస్తారని ఓ రైతు అడగ్గా, తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘నీకు సిగ్గు శరం లేదా. రైతుబంధు, పింఛన్ తీసుకోవడం లేదా?’ అంటూ నోరు పారేసుకున్నారు.
* 2023 మే లో సీఎం కప్ ప్రోగ్రాం సందర్భంగా ఓ మహిళా అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుండగా, ఓ రిపోర్టర్ వీడియో రికార్డు చేశాడని తెలిసింది. దీంతో అతడి సెల్ ఫోన్ లాక్కుని, బెదిరించి వీడియో డిలీట్ చేసి దుర్భాషలాడి సెల్ ఇచ్చారని సమాచారం.
* చెల్పూర్ సర్పంచ్ నేరెళ్ల మహేందర్ గౌడ్‌పై అక్రమ కేసులు బనాయించడమేగాక పోలీసులతో కొట్టించారనే ఆరోపణలు ఉన్నాయి.
* గతంలో సినీ హీరో రాజశేఖర్ సోదరుడు గుణశేఖర్‌పై దాడి చేశారు. దీనికి సంబంధించి బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా ఫైల్ అయింది. కారు పార్కింగ్ విషయంలో వివాదం మొదలవ్వగా, కౌశిక్ రెడ్డి తనను కొట్టారని గుణశేఖర్ పోలీసులకు కంప్లయింట్ చేశారు.
* వరంగల్, హనుమకొండలో 1990లో పలువురు కొనుగోలు చేసిన ఇండ్ల ప్లాట్లను తప్పుడు ధృవీకరణ పత్రాలతో తన బంధువు పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఆరోపణలున్నాయి. ముందుగా కొనుగోలు చేసిన వారిని ఇబ్బందులకు గురి చేసి ఒక్కో ఫ్లాట్ నుంచి 30 శాతం వాటాను కొల్లగొట్టారని, పలువురికి వాటాకు సంబంధించిన డబ్బులు ఇవ్వకుండా ఇప్పటికీ ఇబ్బందుల పాలు చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. ఇటీవల కమలాపూర్ మండలానికి చెందిన ఓ మాజీ ప్రజా ప్రతినిధి చొరవ తీసుకొని బాధితులకు డబ్బు ఇప్పిస్తానని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

Publisher : Swetcha Daily

Latest

Minister: అమాత్యయోగం ఎవరికో?

- త్వరలో మంత్రివర్గ విస్తరణ - ఉత్కంఠలో ఆశావహులు - ఆషాడానికి ముందే మహూర్తం? -...

Survey: చదువుల కంటే పెళ్లికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారుగా..!

Indian Weddings: మన దేశంలో పిల్లల చదువుల కంటే.. వారి పెళ్లికి...

Criminal Law: కొత్త పోలీసు చట్టాలు

- దేశవ్యాప్తంగా అమలుకు రంగం సిద్ధం - కేసుల సత్వర విచారణే లక్ష్యం -...

Job Calender: త్వరలో జాబ్ క్యాలెండర్

- అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు - కొలువుల జాతర కొనసాగుతుంది - కాంగ్రెస్...

PM Narendra Modi: అబద్ధాల్లో మోదీని మించారే..

- కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై కూనంనేని ఫైర్ - ‘సింగరేణి ప్రైవేటుపరం చేయడానికి...

Don't miss

Minister: అమాత్యయోగం ఎవరికో?

- త్వరలో మంత్రివర్గ విస్తరణ - ఉత్కంఠలో ఆశావహులు - ఆషాడానికి ముందే మహూర్తం? -...

Survey: చదువుల కంటే పెళ్లికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారుగా..!

Indian Weddings: మన దేశంలో పిల్లల చదువుల కంటే.. వారి పెళ్లికి...

Criminal Law: కొత్త పోలీసు చట్టాలు

- దేశవ్యాప్తంగా అమలుకు రంగం సిద్ధం - కేసుల సత్వర విచారణే లక్ష్యం -...

Job Calender: త్వరలో జాబ్ క్యాలెండర్

- అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు - కొలువుల జాతర కొనసాగుతుంది - కాంగ్రెస్...

PM Narendra Modi: అబద్ధాల్లో మోదీని మించారే..

- కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై కూనంనేని ఫైర్ - ‘సింగరేణి ప్రైవేటుపరం చేయడానికి...

Minister: అమాత్యయోగం ఎవరికో?

- త్వరలో మంత్రివర్గ విస్తరణ - ఉత్కంఠలో ఆశావహులు - ఆషాడానికి ముందే మహూర్తం? - ప్రస్తుతానికి నలుగురికే అవకాశం - అధిష్ఠానం ప్రకటనకై ఎదురుచూపులు State Cabinet Expansion: తెలంగాణలో త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణ కోసం...

Criminal Law: కొత్త పోలీసు చట్టాలు

- దేశవ్యాప్తంగా అమలుకు రంగం సిద్ధం - కేసుల సత్వర విచారణే లక్ష్యం - కొత్త చట్టాల ప్రకారమే కొత్త కేసుల విచారణ - పోలీసు శాఖ కంప్యూటర్లలోనూ మార్పులు - కొత్త మార్పులపై పెదవి విరుస్తున్న న్యాయ...

Job Calender: త్వరలో జాబ్ క్యాలెండర్

- అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు - కొలువుల జాతర కొనసాగుతుంది - కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి Sama Rammohan Reddy: కాంగ్రెస్ పాలనలో కొలువుల జాతర కొనసాగుతుందని, దీనికితోడు జాబ్...