Pooja Hegde: అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ అనే చిత్రంతో పూజా హెగ్డే తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత ముకుంద మూవీలో గోపిక పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అప్పటి నుంచి పలు చిత్రాల్లో నటిస్తూ బుట్టబొమ్మగా యువకుల గుండెల్లో చోటు సంపాదించుకుంది. మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్స్‌తో మూవీస్ చేసింది. దువ్వాడ జగన్నాథం, రంగస్థలం(స్పెషల్ సాంగ్), అరవింద సమేత వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ టాప్ హీరోయిన్ దిశగా దూసుకెళుతోన్న సమయంలో రష్మిక నుంచి భారీ పోటీ ఎదురైంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన విజయాలు అందుకోలేకపోయింది. అయినా కూడా ఈ అమ్మడికి టెంప్ట్ అయిన దర్శకనిర్మాతలు ఛాన్సెస్ ఇస్తూనే ఉన్నారు.
మరోవైపు వరుసగా ప్లాప్ అవుతుండటంతో బుట్టబొమ్మ డిజప్పాయింట్ అవుతూ కొన్నాళ్లుగా టాలీవుడ్‌కు గ్యాపిచ్చింది. ప్రస్తుత తన పరిస్థితిని చూసుకుని బ్యాడ్ లక్ నడుస్తుందని ఫీల్ అవుతుందట. ఇటీవల పూజా హెగ్డే నటించిన చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఒక్కటి కూడా సక్సెస్ టాక్ తెచ్చుకోలేదు. రీసెంట్‌గా షాయిద్ కపూర్ హీరోగా దేవా చిత్రంలో బుట్టబొమ్మ నటించింది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం సూర్య 44వ సినిమా ‘రెట్రో’లో పూజా కథానాయికగా నటిస్తోంది. ఇదిలా ఉంటే పూజా హెగ్డే మనస్సు వెబ్‌సిరీస్‌ల వైపు మళ్ళీనట్టు తెలుస్తుంది. ఓ వెబ్‌సిరీస్‌లో నటించేందుకు సైన్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే సమంత, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్స్ వెబ్‌సిరీస్‌లల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు బుట్టబొమ్మ కూడా వారి దారిలోనే నడవాలని చూస్తుందట. ప్రముఖ వెబ్‌సిరీస్‌ల డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో పూజా నటించనుందనేలా తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read: అతన్ని బాగా మిస్ అవుతున్నా: రకుల్ ప్రీత్ సింగ్
మరోవైపు పూజా తమిళంలో సూర్య సరసన ‘రెట్రో’ అనే మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరో స్టార్ హీరో విజయ్‌తో ‘జన నాయగన్’ అనే మూవీలో ముద్దగుమ్మ నటిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం ‘కూలీ’లో స్పషల్ సాంగ్‌లో చేసేందుకు ఒప్పుకుందట. ప్రస్తుతం ఈ పాట షూటింగ్ కూడా జరుగుతుందట. ఓ భారీ సెట్‌ను ఏర్పాటు చేసి సాంగ్ షూట్ చేస్తున్నారట. రజనీకాంత్ మునుపెన్నడూ చేయని విధంగా ఈ చిత్రంలో సరికొత్త పాత్రలో కనిపించనున్నారట. ఆమిర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర, శ్రుతిహాసన్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది.