future-city-model
తెలంగాణ

Future city: అదిరేలా ఫ్యూచర్ సిటీ ప్లాన్ ; 8 మండలాలు, 70 గ్రామాలు..

సిద్ధమైన ముసాయిదా…
త్వరలో ఫోర్త్ సిటీ ఉడా ఏర్పాటు!
హెచ్ఎండీఏ తరహా అభివృద్ధి బోర్డ్‌
వచ్చే క్యాబినెట్‌లో ఫ్యూచర్ సిటీ ప్లాన్!

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఫ్యూచర్ సిటీ ప్లాన్ శరవేగంగా పట్టాలు ఎక్కబోతున్న‌ది. త్వరలో ఫోర్త్ సిటీ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌బోతున్న‌ది. ఇందుకోసం మున్సిపల్ శాఖ ఇప్పటికే ముసాయిదా సిద్దం చేసింది. ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఆమోదంతో వచ్చే క్యాబినెట్ సమావేశంలోనే హెచ్ఎండీఏ తరహాలో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేస్తార‌ని తెలిసింది. ఎనిమిది మండలాలు, 70 గ్రామాల పరిధిలో ఫ్యూచర్ సిటీ విస్తరించనుందని అధికారులు వెల్లడించారు. ఫోర్త్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీలో ఉండాల్సిన విభాగాలు, అందుకు అవసరమైన అధికారులు, సిబ్బంది తదితర వివరాలను ముసాయిదాలో పొందుపరుస్తున్నారు. సచివాలయ వర్గాల సమాచారం మేరకు బోర్డు పాలక మండలి, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారితో సహా, తొలి దశలో 130 పోస్టులు ఏర్పాటు కానున్నాయి. ఇందులో 80 మంది రెగ్యులర్ ఉద్యోగులు కాగా, మరో 50 మందిని ఔట్ సోర్సింగ్‌లో తీసుకుంటార‌ని తెలుస్తున్న‌ది. ఇందుకు ఆర్థిక శాఖ అనుమతి కూడా లభించినట్లు సమాచారం. అథారిటీ ఏర్పాటైన వెంటనే చైర్మన్, పదిమంది డైరెక్టర్ల నియామకం చేపట్టనున్నట్లు తెలిసింది.

 

Future city Map
ప్యూచర్ సిటి నమూనా మ్యాప్

(తుది సర్వే, నివేదికలో ప్రాంతాలు, ఫైనల్ మ్యాప్ లో కొంతమేర మార్పులు ఉండే అవకాశముంది.)
ఉత్తరం వైపు – శంషాబాద్ – తుక్కుగూడ – రావిర్యాల – బొంగుళూరు (ఔటర్ రింగ్ రోడ్డు పరిధి)
దక్షిణం వైపు – ఆమనగల్ – అప్పారెడ్డి పల్లి – కుర్మేడు
పడమర వైపు- (శ్రీశైలం రోడ్)- తుక్కుగూడ -కందుకూరు – కడ్తాల్ – ఆమనగల్ వరకు.
తూర్పు వైపు – (సాగర్ రోడ్)- బొంగుళూరు – ఇబ్రహీంపట్నం- యాచారం – కుర్నేడు వరకు.

రేవంత్‌రెడ్డి క‌ల‌ల సౌధం..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలల సౌధం ఫ్యూచర్ సిటీ ప్రణాళికలు శరవేగంగా సిద్ధ‌మ‌వుతున్నాయి. రాజధాని హైదరాబాద్‌కు దక్షిణం వైపున ఒక ఆధునిక నగరాన్ని నిర్మించాలని, ఇప్పటికే ఉన్న మూడు న‌గ‌రాలైన‌ హైదరాబాద్, సికింద్రాబాద్, హైటెక్ సిటీకి దీటుగా ఫోర్త్ సిటీని అభివృద్ది చేయాలని సీఎం సంకల్పించారు. ప్రపంచంలోనే ఒక ఐకానిక్ నగరంగా, ఒక దుబాయ్, లండన్, న్యూయార్క్‌ల‌ను తలదన్నేలా ఈ మహా నగరం ఉండాలనేది రేవంత్ రెడ్డి సంకల్పం. పూర్తి ప్రణాళికాబద్ధంగా, కాలుష్య రహిత (నెట్ జీరో) నగరంగా ఉండటంతోపాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలను ముందస్తుగానే అభివృద్ధి చేయటం ఈ ప్యూచర్ సిటీ లక్ష్యంగా ప్రభుత్వం చెబుతున్న‌ది. ముఖ్యమంత్రి కలల ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటున్న ఫోర్త్ సిటీ కోసం సుమారు 80 వేల కోట్ల రూపాయలు అవసరం కావొచ్చని ప్రభుత్వం అంచ‌నా వేస్తున్న‌ది. దీనికోసం ప్రపంచ బ్యాంకు, జైకా లాంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల సహకారంతో నిధులను సమీకరించే ఆలోచనలో ఉంది. ఈ దిశగా సచివాలయంలో వరుస సమీక్షా సమావేశాలు జరుగుతున్నాయి. వివిధ శాఖల సమన్వయంతో మున్సిపల్ శాఖ ప్రణాళికలను రూపొందిస్తున్న‌ది.

వందేళ్ల ల‌క్ష్యంతో న‌గ‌రం

రెండు వారాల కిందట ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తన ఆలోచనలు, రానున్న యాభై నుంచి వందేళ్ల లక్ష్యంతో ఫోర్త్ సిటీ ఎలా ఉండాలి? ఎక్కడ ఏం రావాలి? ప్రపంచ ప్రసిద్ధి చెందిన నగరాలకు దీటుగా ఎలాంటి రవాణా, మౌలిక సదుపాయాల కల్పన ఉండాలనే విషయాన్ని అధికారులకు విడమర్చి చెప్పారు. ఆ ఆదేశాల మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ది, మెట్రో రైల్, రోడ్లు, భవనాలు, ఆర్థిక, న్యాయ తదితర శాఖల అధికారులు కసరత్తులో నిమగ్నమై ఉన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో ఉండటం ఫోర్త్ సిటీకి మెయిన్ అసెట్ కాబోతున్న‌ది. శంషాబాద్, ఫోర్త్ సిటీలను అనుసంధానం చేస్తూ మెట్రో రైల్ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్న‌ది. మరో నెల రోజుల్లో దీనికి సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) ప్రభుత్వానికి అందనుంది. ఆ తర్వాత కేంద్రం ఆమోదానికి ప్రతిపాదనలు వెళ్లనున్నాయి.

రోడ్ల అభివృద్ధే కీల‌కం

ప్రతిపాదిత ఫోర్త్ సిటీలో రోడ్ల అభివృద్దే అత్యంత ప్రధానం కానుంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రోడ్లను అభివృద్ది చేయనున్నారు. ఇవి ఏకంగా పదిలైన్లతో మూడు వందల ఫీట్ల వెడల్పు కలిగిన సరళరేఖలో ఉండనున్నట్లు అధికారులు వెల్లడించారు. రోడ్డు మధ్యలో 72 ఫీట్ల వెడల్పుతో మెట్రో రైలు ట్రాక్ నిర్మాణం జరుగుతుంది. మొదటి సారి ఇక్కడ మెట్రో రైల్ ట్రాక్ ప్రతిపాదిత రోడ్డుకు సమాంతరంగా ఉండనుంది. ప్రధాన రహదారి ప్రస్తుత రావిర్యాల జంక్షన్ సమీపం నుంచి ప్రారంభమై తిమ్మాపూర్, మీర్ ఖాన్ పేట మీదుగా రీజనల్ రింగ్ రోడ్డుకు చేరుతుంది.

Also Read:

CM Revanth: బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మ‌క్కు.. గుట్టంతా బయటపెట్టిన సీఎం రేవంత్

Rajalingam Murder: రాజలింగం చనిపోయినా… పిటిషన్ కంటిన్యూ అవుతుంది

 

Just In

01

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!