Rakul Preet Singh
ఎంటర్‌టైన్మెంట్

Rakul Preet Singh: అతన్ని బాగా మిస్‌ అవుతున్నా: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనకంటూ ప్రత్యేకమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది. ఒకప్పుడు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ ఓ ఊపు ఊపింది. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించింది. అద్భుతమైన నటనతో సూపర్ హిట్ చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్‌గా రకుల్ చక్రం తిప్పింది. ‘లౌక్యం, కరెంట్ తీగ, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. ఆ తరువాత కొన్ని మూవీస్‌లో నటించినప్పటికీ టాలీవుడ్‌లో అవకాశాలు రావడం తగ్గిపోయింది. దీంతో బాలీవుడ్‌కి మకాం మార్చింది. అక్కడ పలు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమె నటించిన సినిమాలు అన్ని అనుకున్నంత విజయాలు సాధించలేదు. అయినా కూడా హిందీలో రకుల్‌కు ఛాన్సెస్ అయితే వస్తున్నాయి.

బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట గతేడాది పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇటీవలే పెళ్లి రోజు కూడా చేసుకున్నారు. తాజాగా రకుల్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. తాను ఒకరిని మిస్ అవుతున్నా అంటూ పోస్ట్ పెట్టింది. సినిమా షూటింగ్ సమయంలో తన హస్బెండ్‌ని బాగా మిస్ అవుతున్నానని తెలిపింది. ఆయనకు దూరంగా ఉన్న తన పక్కనే ఉన్నాడనుకునేలా తన భర్త స్వెట్‌ షర్ట్స్‌ను ధరిస్తున్నాని చెప్పింది. ఈ పోస్ట్‌పై కొందరు అభిమానులు స్పందిస్తూ.. కెరీర్ కోసం రిస్కూ చేయాల్సిందేనని అంటున్నారు.

Also Read: చిరంజీవికి జంటగా బాలీవుడ్ హీరోయిన్
ఇక ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించిన తాజా చిత్రం ‘మేరే హ‌జ్బెండ్ కీ బీవీ’. ఇందులో అర్జున్ క‌పూర్ హీరోగా న‌టించాడు. అయితే ర‌కుల్ ప్రీత్ సింగ్‌తో పాటు భూమి ప‌డ్నేక‌ర్ మ‌రో కథానాయికగా యాక్ట్ చేసింది. రొమాంటిక్‌ కామెడీ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ సినిమా బ్యాడ్ టాక్ తెచ్చుకుంది. తొలిరోజు కేవలం కోటిన్న‌ర వ‌సూళ్ల‌ను మాత్రమే రాబట్టింది. ఈ ఏడాది విడుదలైన బాలీవుడ్‌ చిత్రాల్లో తొలి రోజు అతి తక్కువ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. మూడు రోజుల్లో కేవ‌లం రూ.4.39 కోట్ల మాత్రమే వసూల్ చేసినట్టు ట్రేడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. సోమ‌వారం రూ.50 ల‌క్ష‌ల లోపే వ‌సూళ్ల‌ను రాబట్టినట్టు చెబుతున్నారు. అయితే తెలుగులో ఒకప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ వరుసగా సినిమాలు తీస్తూ భారీ హిట్‌లను సొంతం చేసుకుంది. కానీ ఆమెకు హిందీలో కలిసి వచ్చేలా కనిపిస్తలేదు. రకుల్ నటించిన చిత్రాలు అన్ని కూడా ఆశించిన విజయాలు అయితే సాధించలేదు. మరి చూడాలి రకుల్ కెరీర్‌ని ఏ విధంగా నెట్టుకెళ్తుందో.

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు