rajalingam
తెలంగాణ

Rajalingam Murder: రాజలింగం చనిపోయినా… పిటిషన్ కంటిన్యూ అవుతుంది?

పిటిషన్ మెయింటెయినబుల్ అవుతుంది
లీగల్ హైర్‌ను ఇంప్లీడ్ చేసి లోయర్ కోర్టుకు రిఫర్ చేయొచ్చు
హైకోర్టులో పబ్లిక్​ ప్రాసిక్యూటర్​
క్రిమినల్ పిటిషన్‌కు వర్తించదు
కేసీఆర్ తరఫు లాయర్ వాదన
క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వు

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : మేడిగడ్డ  బ్యారేజీ (Medigadda Barrage) డ్యామేజీతో పాటు కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరపాలంటూ భూపాలపల్లి జిల్లా కోర్టులో పిటిషన్ వేసిన రాజలింగమూర్తి (Rajalingamurthy) చనిపోయినా విచారణ కంటిన్యూ కావచ్చని పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టుకు తెలిపారు. లీగల్ హైర్‌ను ఇంప్లీడ్ చేసి మళ్ళీ లోయర్ కోర్టుకు రిఫర్ చేయాలని సూచించారు. కేసీఆర్ తరఫున హాజరైన న్యాయవాది జోక్యం చేసుకుని, ఇది క్రిమినల్ కేసులకు వర్తించదని, సమన్లు జారీచేసే కేసులకు మాత్రమే వర్తిస్తుందని హైకోర్టుకు వివరించారు. ఇరు వర్గాల తరపున వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు… తీర్పును రిజర్వు చేసింది. రాజలింగమూర్తి గతంలో జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో దాన్ని విచారించిన జడ్జి.. ఈ కేసులో కేసీఆర్, హరీశ్‌రావు సహా మొత్తం ఎనిమిది మందికి నోటీసులు జారీశారు. నోటీసులు ఇచ్చే అధికారం జిల్లా కోర్టుకు లేదని పేర్కొని, వీటిని కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో (TG High Court) కేసీఆర్ (KCR), హరీశ్‌రావు (Harish Rao) క్వాష్ పిటిషన్ (Quash Petition) దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ సందర్భంగా కోర్టు వాదనలను విన్నది.

విచారణ అవసరం లేదు

జిల్లా కోర్టులో పిటిషన్ వేసిన రాజలింగమూర్తి చనిపోయారని హైకోర్టులో విచారణ సందర్భంగా కేసీఆర్ తరఫు న్యాయవాది జడ్జి దృష్టికి తీసుకెళ్ళారు. గత విచారణ సందర్భంగానూ ఇదే అంశాన్ని వివరించారు. పిటిషన్ వేసిన వ్యక్తి చనిపోవడంతో విచారణ జరపాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జోక్యం చేసుకుని విచారణ జరపవచ్చని, సుప్రీంకోర్టు సహా గతంలో పలు రాష్ట్రాల హైకోర్టులు ఇదే విధానాన్ని అనుసరించాయని ఆ విచారణ సందర్భంగా హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. ఇదే వాదనలను సోమవారం కూడా ఇరువురి తరఫు లాయర్లు లేవనెత్తడంతో తీర్పును వెలువరించకుండా రిజర్వులో ఉంచింది.

 

నా భర్త హత్య వెనుక బీఆర్‌ఎస్ పెద్దలు: సరళ

సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్యకు సంబంధించి ఆయన భార్య సరళ పలు కీలక ఆరోపణలు చేశారు. తన భర్త హత్యకు కేవలం భూమి వివాదమే కారణం కాదని, హత్య వెనుక అనేకమంది పెద్దలు ఉన్నారని చెప్పారు. సంజీవ్, హరిబాబుల వెనుక మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఉన్నారని ఆరోపించారు. అసలైన కారకుల ప్రస్తావన లేకుండా కేవలం ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్న వారిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకొనే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరిగిందని, ప్రజాధనం దుర్వినియోగం చేసిన బీఆర్ఎస్ పెద్దలపై కేసు వేశారని, ఆ కేసులో ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తుందనే ఉద్దేశంతోనే తన భర్తను హత్య చేశారని సరళ ఆరోపించారు. రాజలింగమూర్తిని హత్య చేయాల్సిన అవసరం హరిబాబుకు లేదని, బీఆర్ఎస్ అధినాయకులే అవినీతి విచారణ నుంచి తప్పించుకోవడానికి హరిబాబుతో హత్య చేయించారని ఆమె ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమగ్ర విచారణ జరిపి హత్యలో భాగస్వాములైన వారిపై చర్యలు తీసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. భూవివాదం కారణంగానే హత్య జరిగింది అనడం సరికాదని, తన భర్త రాజలింగమూర్తి హత్య కేసును సీబీసీఐడీకి అప్పగించాలని సరళ డిమాండ్ చేశారు.

సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి..

మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య మాట్లాడుతూ.. రాజలింగమూర్తి హత్య కేసును హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. హత్యలో బీఆర్ఎస్ రాజకీయ ప్రముఖుల హస్తం ఉందంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మానవ హక్కుల వేదిక నిజనిర్ధారణ బృందం వివరాలను సేకరించినట్లు ఆయన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రధాన అనుచరుడు హరిబాబు ఈ హత్య కేసులో కుట్రదారుడిగా ఉన్నాడన్నారు. అన్ని కోణాల్లో విచారణ చేస్తే అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ