Poonam Panday in Public Place
ఎంటర్‌టైన్మెంట్

Actress: నటికి ముద్దు పెట్టేందుకు ట్రై చేసిన ఆకతాయి.. నటి ఏం చేసిందంటే?

Actress: సినీ, రాజకీయ ప్రముఖులకు ఫ్యాన్స్ ఎక్కువ మందే ఉంటారు. తన అభిమాన హీరో, నాయకుడు కనిపిస్తే ఫోటో దిగేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వారు కూడా అభిమానులతో ఫోటోలకు ఫోజులిస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు కొందరు మితిమీరి ప్రవర్తిస్తూ ఉంటారు. తాజాగా ఓ నటితో సెల్ఫీ దిగేందుకు వచ్చి ముద్దు పెట్టే ప్రయత్నం చేశాడో అభిమాని. ఎవరా నటి? ఏంటా కథ? అనే విషయంలోకి వస్తే.. బాలీవుడ్ నటి పూనమ్ పాండే (Poonam Pandey) ముంబై సిటీలో చక్కర్లు కొడుతోంది. ఆమెను గమనించిన ఓ మీడియా ప్రతినిధి, వెంటనే మైక్ పెట్టి మాట్లాడిస్తుండగా, అటువైపు ఓ వ్యక్తి వచ్చాడు. అతను సెల్ఫీ అడగగానే ఆమె ఓకే చెప్పింది. ఇక సెల్ఫీ దిగే క్రమంలో పూనమ్‌కు ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడా ఆకతాయి. దీంతో పూనమ్ పాండే అతడిని నెట్టేసి అక్కడ నుంచి దూరంగా పరుగులు తీసింది. ఆ దృశ్యం చూసిన అందరూ షాక్ అయ్యారు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధి ఆ వ్యక్తిని నెట్టేశాడు.

Also Read- Pragya Jaiswal: ‘అఖండ 2’ నుంచి ప్రగ్యాను ఎందుకు తీసేశారు?

అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వ్యక్తి చర్య పట్ల పలువురు మండిపడుతున్నారు. నడిరోడ్డుపై పబ్లిక్ ప్లేస్‌లో ఇలా ప్రవర్తించడం ఏంటని ఫైర్ అవుతున్నారు. మరోవైపు, ఇది కావాలని చేసిందని, ఫేమస్ అవడం కోసం, పబ్లిక్‌లో ఇమేజ్ కోసం చేసిన పనిగా కొందరు కొట్టివేస్తున్నారు. ఆ వీడియోలో పూనమ్ పాండేతో పాటు ఆ వ్యక్తిని గమనిస్తే.. కావాలనే ఇలా చేసినట్టు ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ కాంట్రవర్సీలు క్రియేట్ చేసే పూనమ్ ఇలాంటివి ఎన్నో ఇది వరకు చేసిందని చెబుతున్నారు. పూనమ్ పాండే వివాదాస్పద వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలతో వార్తలలో నిలుస్తుంటారు. గతంలో ఒకసారి సర్వైకల్ క్యాన్సర్‌‌తో పూనమ్ మరణించినట్టు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. ఆ తెల్లారే తాను చనిపోలేదని క్యాన్సర్‌‌పై అవగాహన పెంచేందుకు ఇలా చేసినట్టు రిప్లై ఇచ్చింది. ఆమె తీరుపై నెటిజన్లు మండిపడ్డారు. అవగాహన కలిపించేందుకు చనిపోయారని చెప్పుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదని తెలిపారు. అయితే సర్వైకల్ క్యాన్సర్‌‌ పై అవగాహన కలిపించేందుకు పూనమ్‌తో ఇలా ప్రచారం చేయించామని ఓ డిజిటల్ ఏజెన్సీ క్షమాపణలు కూడా చెప్పింది. పూనమ్ ఇలా చేయడంతో సర్వైకల్ క్యాన్సర్‌‌ గురించి అందరూ గూగుల్‌లో సెర్చ్ చేసి తెలుసుకున్నారని తెలిపారు.

ఇక మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన పూనమ్ పాండే ‘నషా’ అనే చిత్రంతో 2013లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు హిందీ చిత్రాలలో నటించింది. 2011 వన్డే ప్రపంచకప్ టోర్నీ సందర్భంగా ఆమె చేసిన ఓ ప్రకటనతో దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యింది. దాంతో ఆమె పేరు మారుమోగిపోయింది. ఆ తరువాత పెళ్లి చేసుకున్న ఆమె భర్తకు విడాకులు కూడా ఇచ్చింది. చిత్రహింసలకు గురి చేస్తున్నాడంటూ పోలీసులకు కంప్లైంట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియా సెన్సేషన్‌గా ఆమె మారింది.

ఇవి కూడా చదవండి:
Tallest Heroine: సినీ ఇండస్ట్రీలో హైట్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Trivikram Srinivas: సినిమాలకు దూరం.. పవన్‌తోనే పయనం

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!